Intermediate education:ఇంట‌ర్మీడియ‌ట్ గ్రూపు కెరీర్‌ను నిర్థేశిస్తుందా? విద్యార్థులు తెలుసుకోవాల్సిన విష‌యాలు!

0
30

Intermediate education ప్ర‌త్యేక నైపుణ్యాల‌తో కూడిన మెడిక‌ల్ కోర్సులు చేయాల‌న్నా, ఇంజ‌నీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చ‌ద‌వాల‌న్నా, సాంప్ర‌దాయ‌క డిగ్రీల‌లో చేరి ఉన్న‌త విద్య‌లో రాణించా ల‌న్నా ఇంట‌ర్మీడియ‌ట్‌తోనే ఆరంగ్రేటం చేయాలి. ఉన్న‌త విద్య‌కు వార‌ధి లాంటి ఇంట‌ర్మీడియ‌ట్లో ఇష్టానికి ప్రాధాన్య‌త ఇస్తూ స‌రియైన గ్రూపును ఎంచుకోవ‌డ‌మే (Intermediate education)అత్యంత కీల‌క‌మైన అంశం.

ఎందుకంటే ఈ గ్రూపు మీదే మిగిలిన (ఉన్న‌త‌) విద్య అంతా ఆధార‌ప‌డి ఉంటుంది. విద్యార్థి కెరీర్ ను నిర్ధేశించే కీల‌క‌మైన మ‌లుపు కూడా ఈ కోర్సు ద్వారానే. పాఠ‌శాల విద్యకూ, ఉన్న‌త విద్య‌కూ మ‌ధ్య వార‌ధిలాంటి ఇంట‌ర్‌లో ఏ గ్రూపులో చేరాల‌నే విష‌య‌మై ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవాలి. భ‌విష్య‌త్తులో జీవిత గ‌మ‌నాన్ని నిర్ధేశించే గ్రూపును ఎంచుకోవ‌డంలో త‌ప్ప‌ట‌డుగు ఏ మాత్రం ప‌నికిరాదు. విద్యార్థులు ఇంట‌ర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించ‌గ‌ల‌రో ముందే ఒక నిర్థార‌ణ‌కు రావాలి.

సొంతంగా గ్రూపు ఎంచుకోవాలంటే..

ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసిన విద్యార్థుల్లో చాలా మందికి ఇంట‌ర్లో ఉండే గ్రూపుల గురించి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌దు. ఏ గ్రూపులో ఏయే స‌బ్జెక్టులు ఉంటాయో, భ‌విష్య‌త్తులో వాటికి ఉన్న ఉపాధి అవ‌కాశాలేమిటో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. గ్రూపుల గురించి తెలుసుకున్నా, ఏ గ్రూపులో రాణించ‌గ‌ల‌ర‌నే విష‌యంలో వారికి ఒక స్ప‌ష్ట‌త ఉండ‌క‌పోవ‌చ్చు. సొంతంగా నిర్ణ‌యం తీసుకునేంత వ‌య‌స్సు, అనుభ‌వం లేక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు, స్నేహితులు ఇచ్చే స‌ల‌హాల మీద ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ఇలా అయోమ‌య ప‌రిస్థితుల్లో ఏదో ఒక గ్రూపును ఎంచుకుటే త‌ర్వాత ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి విలువైన కాలం వృథా అవుతుంది.

ఈ ప‌రిమితుల‌ను అధిగ‌మించి, స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలంటే, విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ అడ్మిష‌న్ల‌కు ముందే కొంత ప‌రిజ్ఞానం సంపాదించాలి. దాని బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌ను విశ్లేషించుకొని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి అభిరుచి, సామ‌ర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని త‌ల్లిదండ్రులు కూడా ఏ గ్రూపులో చేరాల‌నే విష‌య‌మై స‌ల‌హా ఇవ్వాలి.

Groups in Intermediate

Science Groups

 • Biology, Physics, Chemistry- BiPC
 • Mathematics, Physics, Chemistry – MPC

Art Groups

 • Mathematics, Economics, Commarce -MEC
 • Commerce, Economics, Civics-CEC
 • History, Economics, Civics-HEC

Vocational

 • Engineering & Technology – category – 1
 • Agriculture – category – 2
 • Home Science – category – 3
 • Business & Commerce – category – 4
 • Para Medical – category – 5
 • Humanities & Other – category – 6
 • Bridge Courses (Theory & Practice)

గ్రూపు ఏదైనా విజ‌య అవ‌కాశాలు మాత్రం మీరు ఎంచుకున్న గ్రూపులో మీకున్న ప‌ట్టు (విష‌య ప‌రిజ్ఞానం) మీద ఆధార‌ప‌డి ఉంటాయి. కాబ‌ట్టి గ్రూపుల ఎంపిక‌లో వ్య‌క్తిగ‌త ఆస‌క్తులు, సామ‌ర్థ్యాలు, ల‌క్ష్యాలు, బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాలి. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో ఏ గ్రూపు ఎంచుకున్న‌ప్ప‌టికీ ప‌లు ఉన్న‌త విద్య ఉద్యోగావ‌కాశాల‌కు పోటీప‌డే అర్హ‌త ల‌భిస్తుంది. ఎంపీసీ విద్యార్థుల‌కు త్రివిధ ద‌ళాల్లో కెరీర్ను ఖాయం చేసే ఎన్‌డిఏ ప‌రీక్ష రాసేందుకు అర్హ‌త ల‌భిస్తుంది. ఇక గ్రూపుతో సంబంధం లేకుండా ఇంట‌ర్మీడియ‌ట్ అర్హ‌త‌తో బ్యాకింగ్ రంగంలో క్ల‌రిక‌ల్ స్థాయిలో స్థిర‌ప‌డే అవ‌కాశం అందిపుచ్చుకోవ‌చ్చు. రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సీ నిర్వ‌హించే గ్రూప్‌- 4 స్థాయి ఉద్యోగాల‌కు పోటీ ప‌డొచ్చు.

Latest Post  exam stress:పిల్ల‌లు అదే ప‌నిగా చ‌దువుతున్నారా - జాగ్ర‌త మ‌రి!

గ‌మ‌నిక: ఇంట‌ర్ లో సైన్సు గ్రూపు తీసుకున్న‌వారు డిగ్రీలో ఆర్స్ట్ గ్రూపు తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ ఆర్ట్స్ గ్రూపు తీసుకున్న వారికి సైన్సు గ్రూపు తీసుకునే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి కోర్సు ఎంపిక‌లో జాగ్ర‌త్త‌.

సేక‌ర‌ణ: అమ్మ సోష‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ (ఎఎస్ డ‌బ్ల్యూఏ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here