Interesting Bible Storie 2022 : ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వాస్తవానికి 1986వ సంవత్సరంలో ఆనాటి జ్యోతి పత్రికలో ప్రచురించబడిన కథనం. ఈ కథనం బైబిల్‌కు సంబంధించింది. అప్పట్లో డా.ఎస్.జాన్ డేవిడ్ (చిలకలూరిపేట) రాసిన అద్భుతమైన స్టోరీ ఇది. బైబిల్ యొక్క గొప్పతనం గురించి చెప్పిన కథను ఇక్కడ మీకు అందిస్తున్నాము.
Interesting Bible Storie 2022 : గుప్త ధనము
కొద్ది సంవత్సరాల కిందట ఒక బీద వృద్ధుడు తన పూర్వికుల పుస్తకాల మధ్య తన మేనత్త తనకు 35 సంవత్సరాల కిందట బహుకరించిన ఒక విలువైన బైబిల్‌ను కనుగొన్నాడు. తాను పాతికేళ్ల యువకుడిగా ఉన్నప్పుడు అతని మేనత్త మరణించింది. ఆమె చేసిన అప్పులకు ఆమె ఉత్తర క్రియలకు కొంత ధనం పోగా, మిగిలిన ధనం యావత్తు ఆ బైబిల్‌తో సహా తన మేనల్లునికి చెందవల్సిందిగా తన మరణ శాసనంలో లిఖించింది.
ఆమె దహన క్రియలకు, అప్పులకు డబ్బు చెల్లించిన తర్వాత మిగిలినవి కొన్ని వందల డాలర్లు మాత్రమే. వాటిని ఖర్చు పెట్టుకున్న తర్వాత ఆ మేనల్లుడు తన చాలీచాలని జీతముతో 35 సంవత్సరాల కాలం గడిపాడు. ఇంక ఎటువంటి పనులు చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన దూరపు బంధువు గృహంలో తన శేష జీవితం గడుపుతామని బయలుదేరాడు.
అలా వెళ్లక ముందే దుమ్ము కొట్టుకొని పడివున్న తన మేనత్త బైబిల్ లోని పేజీలను తిరుగ వేస్తుంటే ఆ మధ్య తన మేనత్త దాచి ఉంచిన 5000 వేల డాలర్లు (dollars) కనిపించాయి. కటిక దారిద్య్రం ఇంత వరకు అనుభవిస్తూ కేవలం దాని వంక చూసి తృప్తి పడేవాడు కానీ, దానిని విప్పి చదివినట్లయితే ఆ దాచిన గుప్త ధనం కంట బడేది.
దేవుని న్యాయ విధులు, సత్యమైనవని, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోర తగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కన్న మధుర మైనవి అని దైవ భక్తులు పాడుతుంటారు. ఆస్తి పాస్తులు అందించే ఆనందం కన్న, గొప్ప పిత్రార్జితము కన్న మంచి ఆరోగ్యం, కుటుంబం గృహం కలిగి యుండుట కన్న, దేవుని వాగ్ధాన ములు ఆయన బిడ్డలకు అంతులేని ఆనందాన్ని కలుగ జేస్తాయి.
దేవుని ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రభావము అన్నింటిని ఆయన కుమారుడైన క్రీస్తులో మనము చూడవచ్చు. పాప జీవితంలో మునిగి పోయి, ఏ నిరీక్షణ లేక కేవలం నిస్సహాయ స్థితిలో ఉన్న మానవుని పునర్జీవింప చేసి వానిని పరిశుద్ధునిగా, మహిమా స్వరూపిగా మార్చగలిగే జీవ జల ఊటలు మనమీ గ్రంథంలో చూడగలం.
Interesting Bible Storie 2022 : ముగింపు
కేవలం దుమ్ము దులిపి కళ్ళ కద్దుకుని అలంకార ప్రాయంగ ఒక ప్రత్యేక స్థలములో ఉంచకుండా భక్తి శ్రద్ధలతో పఠించినప్పుడే అది మన ఆత్మీయ దాహాన్ని ఆకలిని తీర్చ గలదు. మీ జీవిత మార్గం శాంతి, ఆనందం, ఆశీర్వాదములతో కూడిన మార్గముగా మార్చాలనుకుంటే ఈనాడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను పఠించండి.