Inhumane : ఉత్తర్ ప్రదేశ్‌లో అమానవీయ సంఘటన యావత్తు భారతదేశానికి కంట నీరు తెచ్చింది. కరోనా మనిషి జీవితంతో సృష్టించిన విలయతాండవం, స్వేచ్ఛలేని జీవితానికి ఇది అద్ధం పడుతోంది.
Inhumane : కరోనా విజృంభణ వేళ దేశంలో అమానవీయ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనాకు భయపడి ప్రజలు అందర్నీ అనుమానిస్తున్నారు. కరోనా భయంతో చాలా అప్రమత్తంగా ఉన్నారు. అదే క్రమంలో మానవత్వమూ మరిచారు. ఈ క్రమంలోనే మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన భార్యను సైకిల్‌పై శ్మశానానికి తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అతడిని రాకుండా నిలువరించారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని జాన్పూర్ జిల్లా అంబర్‌పూర్‌కు చెందిన తిలక్ధారి సింగ్ భార్య రాజ్‌కుమారి (50) అనారోగ్యంతో ఉమానాథ్ జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. గ్రామం వరకు అంబులెన్స్‌లో మృతదేహం వచ్చింది. అయితే అక్కడ నుంచి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. నా అనేవారు లేకపోవడంతో ఆ వృద్ధుడు తన భార్యను అంత్యక్రియల కోసం శ్మశానానికి సైకిల్‌పై తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతడిని అడ్డుకున్నారు. అమె కరోనాతో మృతి చెందిందనే భయాందోళనతో గ్రామస్థులు ముందుకు కదలనీయలేదు. చివరకు విషయం తెలుసుకున్న పోలీసులు స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started