Indraja & Pragathi Dance: వారిద్దరూ తెలుగు సీనియర్ నటీమణులు. ఒకరు హీరోయిన్ పాత్ర వేస్తే, మరొకరు అమ్మ, పిన్ని, అత్తమ్మ పాత్రలు వేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు 45 టు 50 ఫ్లస్‌లో ఉన్నారు. కానీ వినాయక చవితి ప్రోగ్రాంకు డ్యాన్స్ మాత్రం ఇరగదీశారు. ఆ ప్రోగ్రాం ఎక్కడో కాదండోయ్!. ఈటివిలో ప్రసారమమైన Mana Oori Devudu ప్రోగ్రాంలో Vinayaka Chavithi Special Event 2022.మరి వారిద్దరు ఎవరనుకున్నారు వారే ఇంద్రజ మరియు ప్రగతి.
గత నెలలో ETV ప్రోగ్రాంలో 31వ తేదీన ప్రసారమైన వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ 2022 ప్రోగ్రాంకు ముఖ్య గెస్ట్‌లుగా వచ్చారు. వీరుతో పాటు మరికొందరు నటులు కూడా వచ్చారు. కానీ ఇంద్రజ & ప్రగతి ఎంట్రీ డ్యాన్స్ ప్రోగ్రాంకు హైలెట్ అయ్యింది. ప్రోగ్రాం స్టార్ట్ అయిన వెంటనే నటి ప్రగతి గ్రూపు డ్యాన్స్‌తో హుషారుగా డ్యాన్స్ వేశారు. మొన్న నిన్నటి వరకు నటి ప్రగతి ఒక సైలెంట్ నటిగా ఉండేవారు. ఈ మధ్య కాలంలో తాను కూడా సోషల్ మీడియా వేదికగా విన్యాసాలు చేయడం, హాట్ హాట్ డ్యాన్స్‌లు వేయడంతో ప్రగతి అంటే ఈమేనా అన్నట్టు తెలిసిపోయింది.


Indraja & Pragathi Dance | డ్యాన్స్ సూపర్
ఇంద్రజ గత దశబ్ధ కాలంలో పలు సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించారు. మంచి మంచి సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్నారు. కొంత కాలం వరకు పబ్లిక్‌కు కనిపించకుండా ఉన్న ఈమె గత కొద్ది కాలంగా జబర్ధస్ ప్రోగ్రాంలో జడ్జిగా రాణిస్తున్నారు. ఈ వినాయకుడి చవితి స్పెషల్ ప్రోగ్రాంలో ఈమెకూడా డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. సాధారణంగా హీరోయిన్ కావడంతో డ్యాన్స్ అంటే తెలిసిన ఇంద్రజ ఈ ప్రోగ్రాంలో అలవకొలవగా డ్యాన్స్ వేశారు.


నటి ప్రగతి మరియు ఇంద్రజ డ్యాన్స్‌లతో టీవీ షో అదిరిందని చెప్పవచ్చు. వారి డ్యాన్స్‌లను కన్నార్ప కుండా చూశారు. ఇక ఈ ప్రోగ్రాంను యూట్యూబ్‌లో చూసిన పలువురు ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటుండగా, మరికొందరు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అసలు ఏమాత్రం అవకాశం లేని ఈ వయసులో పెళ్లి అయి నటనకు దూరమై డ్యాన్స్ కు దూరమైన ఉండి కూడా కొన్ని సంవత్సరాలు కాలు కదపని ఈ నటీమణులు డ్యాన్స్ ఇరగదీశారని కామెంట్ చేస్తున్నారు.


నటి ప్రగతి ఎక్కువుగా జిమ్‌లో గడుపుతుంటారు. ఈ వయసులో ఆమె డ్యాన్స్ వేయడం ఆమె సీక్రేట్ వ్యాయామేనని అంటున్నారు. ఈ ప్రోగ్రాంకు వ్యాఖ్యాత గా ప్రదీప్ ఉన్నారు. గతంలో సినిమాల్లో నటించిన చాలా మంది సీనియర్ నటులు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. Indraja & Pragathi Dance అనంతరం ఫెర్మామెన్స్‌ను అడిగి తెలుసుకున్నారు.