indian grey hornbill

indian grey hornbill : న‌ల్గొండ‌లో క‌నిపించిన ‘అడ‌వి రైతు’

Telangana
Share link

indian grey hornbill : అడ‌వి రైతుగా పిలిచే అరుదైన ఇండియ‌న్ గ్రేహార్న్ బిల్ పక్షి న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలో సంద‌డి చేసింది. నిజానికి ఇవి భార‌త ఉప ఖండంలో మాత్ర‌మే క‌నిపిస్తాయి. న‌ల్గొండ జిల్లా చందంపేట మండ‌లంలోని అట‌వీప్రాంతంలో నిన్న ఇది అటవీశాఖ కెమెరాకు చిక్కింది. ఈ ప‌క్షికి 50 సెంటీమీట‌ర్ల పొడ‌వైన ముక్కు, పొడ‌వైన తోక ఉంటాయ‌ని నాగార్జున‌సాగ‌ర్ డివిజ‌న్ అట‌వీ అధికారి స‌ర్వేశ్వ‌ర‌రావు, చందంపేట అట‌వీ అధికారి రాజేంద‌ర్ మీడియాకు తెలిపారు. న‌లుపు, తెలుపు, బూడిద రంగు క‌ల‌బోత‌తో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఎత్తైన చెట్ల‌పైన‌, అడ‌విలోని కొండ‌లు, గుట్ట‌ల‌పైనే సంచ‌రిస్తుంద‌ని చెప్పారు. అత్తిపండ్లు, పాములు, బ‌ల్లుల‌ను ఆహారంగా తీసుకుంటుంద‌ని తెలిపారు. ఈ ప‌క్షిని అడ‌వి రైతు, ఫారెస్ట్ ఇంజ‌నీర్స్ అని కూడా పిలుస్తార‌ని పేర్కొన్నారు.

See also  minister puvvada: పండంటి బిడ్డ‌ను ఎత్తుకొని ఆనంద ప‌డ్డ మంత్రి పువ్వాడ‌..!

Leave a Reply

Your email address will not be published.