indian food for strong bonesచాలా మంది అవసరమైనవి తినకుండా నోటికి రుచిగా ఉండే నూడుల్స్, చాక్లెట్స్, పఫ్లు ఇలా ఎవేవో కొన్ని పదార్థాలు పైపైన తింటుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కాల్షియం చాలా ఎక్కువుగా లభిస్తేనే ఆ పైన వివాహం అయిన తర్వాత, బిడ్డలకు తల్లి అయిన తర్వాత ప్రసవ సమయంలోనూ, ఇంటి పని, ఆఫీసు పని చక్కబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయని (indian food for strong bones)నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో50 శాతానికి పైగా ఆడపిల్లలు కాల్షియం(calcium) లోపంతో బాధపడుతున్నారు. తగినంత కాల్షియం ఉంటేనే ఎముకల పటిష్టత బాగుంటుంది. ఇవి సప్లిమెంటరీగా మందుల ద్వారా కాకుండా వారు తినే ఆహార పదార్థాల నుండే సమకూర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఎముకలను రక్షించే కాల్షియం, జింక్ పదార్థాలు(zinc food) ఎక్కువుగా తీసుకోవాలి.
మధ్య వయస్సు మహిళల్లో పెళుసుగా ఉండే ఎముకలకు జింక్ చాలా అవసరం. మాంసాహారులైతే జింక్ సమృద్ధిగా లభించే గొర్రె మాంసం తీసుకోవచ్చు. ఇక శాఖాహారులైతే ఆకుకూరలు, తమలపాకుల్లో కూడా జింక్ అధిక శాతం ఉంటుంది. తోటకూరలో పుష్కలంగా విటమిన్ – కె ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకలకు అవసరమైన కాల్షియంను సరఫరా చేయడంలో చాగా ఉగయోగపడుతుంది.

అలాగే ఎముకలలోకి ఖనిజ లవణాలు చేరడం వల్ల జీర్ణక్రియకూ తోడ్పడుతుంది. విటమిన్ – కె ఆస్ట్రియోపోరోసిస్ వ్యాధి ఉన్నవారిలో ఎముకలలో ఖనిజ లవణాల ప్రమాదాలు పెరగడానికి దోహదం చేయడమేగాక ఎముకలు చిట్లిపోవడం తగ్గుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆహారపదార్థాలలో ఉప్పును తగ్గించాలి. ఉప్పు(Salt) ఎక్కువుగా తీసుకుంటే మూత్రం ద్వారా కాల్షియంను బైటకు పంపిస్తుంది. అందుకే ఉప్పును తక్కువగా తీసుకోవాలి. తోటకూర, బచ్చలికూర, పొన్నగంటికూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలు, పాలు, ఇంకా ఇతర పాల ఉత్పత్తులను ఎక్కవుగా తీసుకోవడం ద్వారా కాల్షియం తగినంత సమకూరి ఎముఖలు ధృఢంగా ఉంటాయి.
ఎముకల ఆరోగ్యానికి (Tea benefits)తేనీరు!
తేనీటిని ఆస్వాదించేందుకు మరో మంచి కారణం దొరికింది. తేనీరు తాగడం ద్వారా ఎముకలు బలిష్టంగా మారతాయని, తుంటి సహా ఎముకలు విరిగే ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు మూడు కప్పుల తేనీటితో ఆస్టియోపోరోసిస్తో ఎముకలు విరిగే ప్రమాదం 30 శాతం దాకా తగ్గుతుందని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ విశ్వ విద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా సగటున 80 ఏళ్ల వయస్సున్న 1200 మంది వృద్ధ మహిళలను పదేళ్లపాటు పరిశీలించారు. కనీసం రోజుకు మూడు కప్పుల తేనీరు తాగిన వారిలో ఎముకలు విరిగే ముప్పు గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు.

ఫ్లేవనాయిడ్స్ వంటి వృక్షరసాయానాలు కొత్త ఎముక కణాల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు, ప్రస్తుత కణాల క్షీణతను నెమ్మదింపజేయడం ద్వారా ఎముకల్ని బలిష్టంగా మార్పుతుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం వృద్ధుల్లో కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి