Indian Embassy | క్షణం క్షణం ఉత్కంఠత రేపుతోన్న రష్యా- ఉక్రయిన్(Ukraine) యుద్ధంలో ఎప్పుడు ఏమౌంతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు అక్కడ జనం. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి ప్రవేశిస్తున్న రష్యా తన యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధానిలోని కీవ్‌లో ఉన్న భారత ఎంబసీని (Indian Embassy)మూసివేశారు.
అక్కడ నుంచి ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం లీవ్‌లోకి భారత ఎంబసీని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి విద్యార్థుల తరలింపు ప్రక్రియ పూర్తయినట్టు కేంద్రం వెల్లడించింది. ఇండియన్స్ అందరూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను విడిచి పెట్టారని తెలిపింది కేంద్రం. ఖార్కివ్ నుండి భారతీయుల తరలింపు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత అని, ఉక్రెయిన్‌లో ఉన్న 20,000 వేల మందిలో 12 వేల మందిని ఇప్పటికే తరలించామని కేంద్రం చెబుతోంది.
ఇక రానున్న మూడ్రోజుల్లో 26 విమానాలు నడపాలని నిర్ణయించామని, ఇప్పటికే రొమేనియాకు IAF C-17 విమానం బయల్దేరనుంది. రానున్న మూడ్రోజుల్లో బుకారెస్ట్, ఇతర ప్రాంతాల నుండి భారతీయులను తీసుకురావడానికి 26 విమానాలు షెడ్యూల్ చేయబడ్డాయని కేంద్రం చెప్పింది. ఇండియన్స్‌ను తరలించేందుకు పోలాండ్, స్లోవాక్ ఎయిర్‌పోర్టులు ఉపయోగిస్తామని తెలిపింది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!