indian army cycle rally

indian army cycle rally: ఖ‌మ్మం న‌గ‌రానికి చేరిన ఆర్మీ జ‌వాన్ల సైకిల్ యాత్ర‌

Spread the love

indian army cycle rally: ఖ‌మ్మం : బంగ్లాదేశ్ – పాకిస్థాన్ మ‌ధ్య 1971 లో జ‌రిగిన యుద్ధంలో అసువులు బాసిన వీర జ‌వాన్ల ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని చేప‌ట్టిన ఆర్మీ జ‌వాన్ల సైకిల్ (indian army cycle rally)యాత్ర ఖ‌మ్మం న‌గ‌రానికి చేరింది.ఈ సంద‌ర్భంగా వారికి రోట‌రీ క్ల‌బ్ ఆఫ్ ఖ‌మ్మం అధ్య‌క్షులు పాల‌డుగు నాగేశ్వ‌ర‌రావు, కార్య‌ద‌ర్శి న‌ల్ల‌మోతు ర‌వీంద్ర‌నాథ్‌, రోట‌రీ ట్ర‌స్ట్ నుండి మ‌ల్లాది వాసుదేవ్‌, దొడ్డ‌పునేని సాంబ‌శివ‌రావు, కాళ్ల పాపారావు, ఐ.రామ‌కృష్ణ‌, ఐతం ర‌వీంద్ర‌, బి.కె.రావు, వంగాల జ‌గ‌న్నాధం, పాషా, ఇన్న‌ర్ వీల్ త‌రుపున ఝాన్సీల‌క్ష్మీ త‌దిత‌రులు వారికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

అనంత‌రం స్థానిక హోట‌ల్లో అల్పాహారం ఏర్పాటు చేసి త‌ద‌నంత‌రం వ‌రంగ‌ల్‌, భువ‌న‌గిరి మీదుగా హైద‌రాబాద్ కు చేరుకోనున్నారని వారు తెలిపారు. సెప్టెంబ‌ర్ 20 వ తేదీన లెప్ట్ నెంట్ జ‌న‌ర‌ల్ ఏ.అరుణ్ కుమార్‌, ఏఓసి క్యాంపు సికింద్రాబాద్‌లో ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. ఆర్మీ జ‌వాన్ల సైకిల్ యాత్ర గోల్కొండ్‌, ఘ‌న్‌పూర్‌, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల్‌, ఆదోని, కొండారెడ్డి పోర్ట్ పెద్ద డోర్నాల నుండి ఖ‌మ్మం ప‌ట్ట‌ణానికి చేరుకొని సుమారు 800 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం చేశారు.

మొత్తంగా 1300 కి.మీలు సైకిల్ యాత్ర జ‌రుగుతుంద‌ని, లెప్ట్ నెంట్ జన‌ర‌ల్ క‌ల్న‌ల్ ల‌క్ష్మ‌ణ్ సింగ్ తెలిపారు. ఇక్క‌డ నుండి భువ‌న‌గిరి, హైద‌రాబాద్ ఏఓసి క్యాంపున‌కు చేరుకోనుంద‌ని పేర్కొన్నారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా సైనికుల‌తో మ‌నో ధైర్య‌ము , ఆత్మ‌స్థైర్య‌ము నింప‌డంతో అమ‌రులైన జ‌వాన్ల ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఈ యాత్ర‌ను చేపట్టార‌ని తెలిపారు.

ఈ సైకిల్ యాత్ర‌లో లెప్ట్ నెంట్ క‌ల్న‌ల్ ల‌క్ష్మ‌ణ్ సింగ్‌తో పాటు స‌బ్ మేజ‌ర్ విజ‌య‌సింగ్‌, అంకూర్ రావ‌త్‌, హ‌వ‌ల్దార్ మ‌హేతతో, నాయ‌క్ ఆసీస్ రాయ్‌, పోలిశెట్టి నాగ‌రాజు, ఏపీ సింగ్‌, స‌చిన్ కుమార్‌, యాగాస్ ప‌టేల్‌, జేమ్స్‌, బ్రిజ్మోహ‌న్‌, విశాల శ‌ర్మ‌, సాకేత్ శ‌ర్మ‌, కెవి తేజ‌స్‌, వీజీ త‌దిత‌రులు ఆర్మీ నుండి పాల్గొన్నారు.

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Seethakka: ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కమూ మీకోస‌మే ఎవ‌రూ అశ్ర‌ద్ధ చేయొద్దు

Seethakka | ములుగు MLA సీత‌క్క గురువారం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. గోవిందారావుపేట మండ‌ల కేంద్రంలోని రైతు వేదిక కార్యాల‌యంలో 42 మందికి క‌ళ్యాణ Laxmi Read more

Leave a Comment

Your email address will not be published.