india vs Sri Lanka 2ND T20: చెల‌రేగిన టీమిండియా రెండో టీ20లో ఘ‌న విజ‌యం

india vs Sri Lanka 2ND T20 | రెండో టీ20 లోనూ భార‌త్ ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. హిమాచ‌ల్ ప్ర‌దేశో రాష్ట్రంలోని ధ‌ర్మ‌శాల లో శ‌నివారం ఇండియా-శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య రెండ‌వ టీ 20 క్రికెట్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ‌రొక మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌తో దిగిన శ్రీ‌లంక ఓపెన‌ర్లు ధ‌నుష్‌ను గుణ‌తిల‌,ప‌ధుమ్ నిశాంక‌లు నిదానంగా ఆడారు. వికెట్ ప‌డ‌కుండా స్కోరును పెంచే ప్ర‌య‌త్నం (india vs Sri Lanka 2ND T20)చేశారు.

గుణ‌తిలక 29 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స‌ర్లతో 38 వ‌ద్ద అవుట‌య్యాడు. వ‌రుస‌గా వ‌చ్చిన ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ త్వ‌ర త్వ‌ర‌గా అవుట్ అయ్యారు. క‌మిల్ మిశారా 1, చ‌రిత్ అస‌లంక 2, దినేష్ చంఢీమాల్ 9 వ‌ర్ల బిడ్డ అవుట‌య్యారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌తో ఓపెన‌ర్ నిశాంక‌తో క‌లిసి శ్రీ‌లంక స్కోర్ బోర్డును ఒక్క‌సారిగా పెంచేశారు. నిశాంక అర్థ సెంచ‌రీ పూర్తి చేసిన త‌ర్వాత 53 బంతుల్లో 11 ఫోర్ల‌తో 75 ప‌రుగుల వ‌ద్ద అవుట‌య్యాడు. శ్రీ‌లంక కెప్టెన్ శ‌న‌క సిక్స‌ర్ల‌తో చెల‌రేగడంతో స్కోర్ దూసుకుపోయింది. కేవ‌లం 19 బంతుల్లో 5 సిక్సులు, 2 రెండు ఫోర్ల తో 47 ప‌రులుగు చేసి నౌటౌట్‌లో నిలిచాడు.

చ‌మిక క‌రుణ‌ర‌త్నే నాటౌట్, ఎగ్‌స్ట్రాలు 11 ప‌రుగుల‌తో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో శ్రీ‌లంక 5 వికెట్లు కోల్పోయి 183 ప‌రుగులు చేసింది. ఇండియా బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, ర‌వీంద్ర జ‌డేజా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ బూమ్రా, చాహ‌ల్ త‌లో వికెట్ తీశారు. అనంత‌రం 184 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా ఓపెన‌ర్లు రోహ‌త్ శ‌ర్మ ఒక ప‌రుగు చేసి అవుట్ కాగా మ‌రో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ 16 ప‌రుగుల వ‌ద్ద అవుట్ అయ్యాడు.

శ్రీ‌లంక‌- ఇండియా మ్యాచ్‌

దీంతో కాస్త ఒత్తిడికి గురైన టీమిండియా వారి స్థానంలో వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్ అస‌లు ఆట చూపించారు. శ్రేయ‌స్ అర్థ శ‌త‌కం చేశాడు. సంజూ వ‌రుస‌గా ఒకే ఒవ‌ర్లో మూడు సిక్స‌ర్లు బాధాడు. వారి కాంబినేష‌న్‌లో టీమిండియా స్కోర్ పెంచారు. 25 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగుల వద్ద అవుట‌య్యాడు. త‌ర్వాత వ‌చ్చిన ర‌వీంద్ర జ‌డేజా ఫోర్లు సిక్స‌ర్ల‌తో చెల‌రేగాడు.

Share link

Leave a Comment