china border: తూర్పు లడాఖ్ దగ్గర చైనా సరిహద్దుల దగ్గరికి మళ్లీ భారత్ సైన్యం పెద్ద ఎత్తున్న మోహరించింది. ఇప్పటికే పలు ఒప్పందాల్లో మాట ఇచ్చిన చైనా ఇప్పుడు నిబంధనలు ధిక్కరించింది. ఏ క్షణమైనా ఏం జరుగుతుందోనని అప్రమత్తమైంది భారత్ సైన్యం.
china border: గతంలో చైనాతో కుదిరిన ఒప్పందం వల్ల అక్కడ ఉన్న లక్ష మంది సైన్యంలో 50 వేల మందిని భారత్ వెనక్కి రప్పించింది. అయితే తాజాగా తన సరిహద్దుల వైపు 2 లక్షల మంది సైనికులను చైనా మళ్లీ మోహరించింది. దీంతో భారత్ కూడా ఇప్పటికే అక్కడ ఉన్న 50 వేల మంది సైనికులకు తోడుగా మరో 50 వేల మందిని తరలించింది. భారత్ కూడా 2 లక్షల మందిని మోహరించే పనిలో నిమగ్నమయ్యింది. కమాండర్ స్థాయి అధికారులతో ఇప్పటి వరకు జరిపిన చర్చలు పాక్షికంగానే ఫలితాలని ఇచ్చాయి. తప్పితే చైనా ఒప్పందం చేసుకోవడం మళ్ళీ దానిని పక్కన పెట్టి తన సైన్యాన్ని మోహరించడం వల్ల తప్పని సరి పరిస్థితుల్లో భారత్ కూడా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.
కొద్ది నెలలుగా చైనా తన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లను నిత్యం ప్రాక్టీస్ పేరుతో విన్యాసాలు చేయడం కూడా ఒక కారణం. భారత్ కూడా తన ఎయిర్‌పోర్స్ తో పాటు ఆర్టీలరీని కూడా మళ్లీ మోహరిస్తున్నది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి భారత్ వైపు వాతావరణం అనుకూలించదు. కానీ చైనా తన వైపు రోడ్లు వర్షాకాలానికి, మంచు వాతావరణానికి అనువుగా వేసేసింది కాబట్టి వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ భారత్ వైపు ప్రధానంగా చైనా సరిహద్దుల దగ్గరికి దళాలని తరలించడం కొద్దిగా కష్టమైన పనే అవుతుంది. ఇక విలేఖరులు ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులను ప్రశ్నించడానికి ప్రయత్నించగా మాట్లాడటానికి నిరాకరించినట్టు తెలుస్తున్నది.
ఇంతకు ముందు భారత్ సైన్యం డీఫెన్సివ్ మోడ్ కి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇప్పుడు స్ట్రాటజీ మార్చింది మన సైన్యం. ఎఫెన్సివ్ – డిఫెన్స్ మోడ్‌లో వెళ్లిపోయింది. అంటే ఏ మాత్రం అనుమానం వచ్చినా ముందు ఎటాక్ చేయడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. M777 హోవిట్టర్ (M777 howitzer built by BAE Systems Inc) లని హెవీ లిఫ్ట్ హెలీకాఫ్టర్స్తో ఒక లోయ నుండి మరో లోయ లోకి భారత్ సైన్యం లిఫ్ట్ చేస్తున్నది. బీజింగ్ లాంగ్ రేంజ్ ఆర్టీలరీలని టిబెట్ నుండి సరిహద్దుల్లోకి తరలిం చినట్టు గుర్తించింది ఆర్మీ ఇంటెలిజెన్స్. కాగా చైనా ఆర్మీ అధికారులను అక్కడి విలేఖరులు ప్రశ్నించగా మాట్లాడటానికి నిరాకరించినట్టు తెలుస్తున్నంది.
డిఎస్ హుడా (DS Hooda) మాజీ లెఫ్టినెంట్ జెనెరల్, ఉత్తర కమాండ్ మాట్లాడుతూ ఇరువైపులా ఇంత పెద్ద మొత్తంలో సైనికులని, ఆయుధాలని మొహరించడం చాలా ప్రమాదకరమని ఎటువైపున ఎవరు కవ్వించినా అది జన నష్టానికే దారి తీస్తుందని, ఒక వేళ చిన్నపాటి ఘర్షణ జరిగినా అది చిలికి చిలికి గాలి వాన అవుతుందని అటువంటి పరిస్థితుల్లో సైనికులు క్రమశిక్షణ తప్పుతారని వాళ్ళని ఆపడం కష్టం అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే చైనాని నమ్మడానికి వీలులేదని అటువంటప్పుడు ఇది తప్పనిసరి చర్య అవుతుందని వ్యాఖ్యానించారు.

ఇరువైపులా సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్న సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కాగా యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాలలో అనుభవం ఉన్న 20,000 వేల సైనికులను భారత్ లడాఖ్ దగ్గరికి తరలించింది. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులని ఏరి వేసిన అనుభవం ఉంది. చొరబాట్లు ఎలా జరుగుతాయో వాటిని ఎలా ఎదుర్కోవాలో భాగా అను భవం ఉన్నది వీళ్లకి, మరోవైపు పశ్చిమ పశ్చిమ వైపున పాకిస్థాన్ సరిహద్దుల నుండి సైన్యాన్ని లఢాఖ్ దగ్గరికి తరలిం చారు. అయితే వీళ్లని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించారు. (1962లో చైనా ఇక్కడ నుంచే భారత్‌లోకి చొరబడ్డది.) తోడుగా ఒక స్వ్కాడ్రన్ రాఫెల్ జెట్స్‌ని మోహరించారు. అవసరం అయితే భూమి మీద వెళ్లే ఆర్మీకి తోడుగా ఆకాశం నుండి దాడి చేయడానికి లాంగ్ రేంజ్ మిసైల్స్‌తో ఆఫకోర్స్ సేపేకాట్ జాగ్వార్లని కూడా మోరించారు.
అవసరం అయితే తక్కువ ఎత్తులో వేగంగా వెళ్లగల జాగ్వార్లు సైనికులు ముందుగా వెళ్ళే దారిలో శత్రువుల మీద రాడార్లకి దొరక్కుండా భూమి మీద ఉన్న శత్రు టార్గెట్లని ధ్వంసం చేసి మన ఆర్మీకి సేఫ్ దారి ఇస్తాయి. మరో భారత నేవీ దీర్గకాల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నది. ఇప్పటికే కీలక ప్రదే శాల్లో తమ యుద్ధ నౌకలని మోహరించింది. మలక్కా స్ట్రైట్ని ఒక కంట కనిపెడుతున్నది. మలక్కా జలసంధి నుండే చైనాకి కూడా బాగా తెలుసు. కరోనా వల్ల దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే సమ యంలో ఇదొక అదనపు ఖర్చు మోడీ ప్రభుత్వానికి , కానీ దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా ఆర్మీ అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటిని తీరుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మొదటి సారిగా మన సైన్యం ఎఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లడానికి కారణం రాజకీయ జోక్యం తక్కువగా ఉండటమే భారత్ కమాండర్ల ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడింది.
చైనా ఉద్దేశ్యం ఏమిటి?
తైవాన్ మీద దాడి చేసి తన అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. చైనా కానీ సముద్రం మీద కానీ భూమి మీద కానీ తనకి ఇబ్బందులు సృష్టించగల శక్తి ఒక్క భారత్ కి మాత్రమే ఉందని తెలుసు. అందు కే భారత్‌తో టిబెట్ దగ్గర బిజీగా ఉంచి మరోవైపు తైవాన్‌ని స్వాధీనం చేసుకోవాలనే ఒక ప్లాన్. ఇక రెండోవ ప్లాన్..లడాఖ్ని ఏ క్షణం అయినా భారత్ స్వాధీనం చేసుకోవచ్చు అనే బయం కూడా ఇంకో కారణం. POK మీద దాడి చేసి స్వాధీనం చేసుకుంటే మాత్రం అది ఆక్సాయ్‌చిన్ కి ప్రమాదం కాబట్టి ముందు జాగ్రత్తగా లడాఖ్ దగ్గర ఉద్రిక్తలు చల్లారకుండా చూస్తున్నది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి