India Progress: 21వ శతాబ్ధంలో జాతి పురోగతికి పునాది అనుసంధానత. సౌకర్యాల మెరుగుదల ఒక్కటే కాదు, ప్రజల జీవితాలు సరళం చేయడం, జాతి అభివృద్ధిని పటిష్టం చేయడం కూడా వేగానికి అర్థం. అందుకే నేటి భారతదేశంలో శాస్త్ర, సాంకేతికతలను ఉపయోగించుకుంటూ బహుముఖీన అనుసంధానతకు కొత్త దిశ అందించే కృషి జరుగుతోంది.
India Progress: అభివృద్ధికి భారత్ సిద్ధం!
ఈ నవ భారతంలో పురోగతి కోసం ప్రతీ ఒక్క ఇండియన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నవభావరం, యువత ఆశల గురించి ప్రభుత్వం సంపూర్ణ అవగాహన కలిగి ఉంది. నేటి యువతకు కొత్తది ఏదైనా సాధించాలనే బలమైన ఆకాంక్ష మాత్రమే కాదు, దాన్ని సాధించాలనే పట్టుదల కూడా ఉంది.అతను తన లక్ష్యాలు సాధించుకునేందుకు ఎక్కువ కాలం వేచి చూడాలనుకోవడం లేదు, దాన్ని సాధించుకునేందుకు కృషి చేస్తున్నాడు.
భారత్‌లో యువశక్తి 130 కోట్ల మందికి పైగా ఉంది. వారంతా పురోగతికి స్పూర్తి. ఇటు ప్రభుత్వం నుంచి, అటు ప్రైవేటు రంగం నుంచి కూడా నవభారతానికి సంబంధించిన క్రియలను ఆశిస్తున్నారు. నేడు భారతదేశం అది జరుగుతుంది, అలాగే నడుస్తుంది..అనే ఆలోచనా ధోరణికి అతీతంగా కదులుతోంది. చేసి తీరాలి?..సకాలంలో చేయాలి!..అని భారతదేశం నేడు భావిస్తోంది. ఇలాంటి వాతావరణంలో వాస్తవాలను ప్రతిబింబించే దిశగా కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ఆలోచనా ధోరణి మారింది.
టెక్నాలజీ వేగం!
నేడు దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం మూడింతలు వేగం అందుకుంది. సరికొత్త హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేల తీరులోనే నేడు కొత్త విమానాశ్రయాలు, నిర్వహణలోని విమానాశ్ర యాలు అధిక సంఖ్యలో నిర్మాణం (India Progress) అవుతున్నాయి. నాడు దేశంలో రైల్వే స్టీమ్ ఇంజన్ల నిర్మాణంతో ప్రారంభమైన ప్రయాణం, నేడు దేశ దేశీయంగానే 52 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగల వందే భారత్ రైళ్ల (vande bharat express) ను నిర్మించుకోగల స్థాయికి చేరింది.


భారత్ మాలా తరహాలోనే పర్వత శ్రేణుల్లో సంక్లిష్టమైన మార్గాల్లో ప్రయాణం సులభతరం చేసేందుకు రోప్‌వే (ropeway) ప్రాజెక్టు ప్రారంభమైంది. అంతర్గత జలమార్గాల ప్రాజెక్టు కూడా వేగంగా ముందుకు సాగుతోంది. జాతి పురోగతికి నీరు, భూమి, వాయు అనుసంధానత పర్యావరణ మిత్రంగా సాగుతోంది.