T20 World Cup: ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. రెండు జట్లూ ఒకే గ్రూపులో చోటు సంపాదించుకోవడమే అందుకు కారణం. కానీ మ్యాచ్‌ల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ సారి ప్రపంచకప్‌లో ఐసీసీ మొత్తం నాలుగు గ్రూపులను ఏర్పాటు చేస్తుంది. అందులో గ్రూప్ – ఏ , గ్రూప్ – బీ తో పాటు గ్రూప్ -1, గ్రూప్ -2 ఉంటాయి. గ్రూప్ -1, గ్రూప్ -2 లో ప్రధాన 8 జట్లు ఇప్పటికే చోటు సంపాదించుకోగా మిగతా జట్లు గ్రూప్ – ఏ, గ్రూప్ – బీలో ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లోని విజేతలు, రన్నరప్ జట్లు తర్వాతి దశలో అంటే సూపర్ – 12కు అర్హత సాధిస్తాయి, దీంతో ఆ జట్లు గ్రూప్ – 1, గ్రూప్ -2 లో చోటు దక్కించుకుంటాయి.
ఇక టీ20 క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న వెస్టిండీస్, గ్రూప్ – 1లో ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పోటీపడుతుండగా, మరోవైపు గ్రూప్ -2 లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గానిస్థాన్ జట్లతో తలపడనుంది. ఈ క్రమంలోనే శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, పపువాన్యూ గినియా, ఓమన్ జట్లు గ్రూప్ – బీలో చోటు సంపాదించుకున్నాయి. ఈ ఎనిమిది జట్లలో టాప్‌లో నిలిచిన నాలుగు గ్రూప్ – 1, గ్రూప్ – 2 చివరిస్థానాల్లో నిలుస్తాయి, కాగా, ఈ పోటీలను బీసీసీఐ యూఏఈ, ఒమన్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. మరోవైపు మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!