India Pakistan border news I Telugu news I పాక్ కాల్పులు ముగ్గురు జవాన్లు వీరమరణం
శ్రీనగర్: పాకిస్తాన్ రోజురోజుకూ హద్దులు దాటుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో భారత్‌కు చెందిన ముగ్గురుజవాన్లు వీర మరణం పొందారు. మరో ముగ్గురు కూడా మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. బారాముల్లోని నంబ్లా సెక్టార్ వద్ద జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. పాక్ సైన్యం మోర్టార్టు, ఇతర ఆయుధాలతో దాడి చేశారు. హజీ పీర్ సెక్టార్ లో జరిగిన ఘటనలో ఓబీఎస్ ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందగా, మరో జవాను గాయపడినట్టు అధికారులు తెలిపారు.
బారాముల్లా జిల్లాలోని యురి ప్రాంతం కామల్‌కోటే సెక్టార్లో జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృత్యువాత పడ్డారు. బాల్కోటే ప్రాంతం హజీపీర్ సెక్టార్లో జరిపిన దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలు ప్రాంతాల్లో జరిపిన దాడిలో పలువురు పౌరులు కూడా గాయపడినట్టు అధికారులు పేర్కొన్నారు.
పాక్ బంకర్లను పేల్చివేసిన ఆర్మీయురి, హీజీపీర్, కమల్‌కోట్, బాలాకోట్ ప్రాంతాల్లో కాల్పులకు తెగబడిన పాక్ బలగాలను భారత్ సైన్యం సమర్థం తిప్పికొట్టింది. పాకిస్థాన్ బంకర్లు, ఇంధన ట్యాంకులు, లాంచ్ ప్యాడ్లను భారత్ ఆర్మీ పేల్చివేసింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌కు చెందిన ముగ్గురు కమాండోలు ఉన్నారని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మరో 10 నుంచి 12 మంది పాకిస్థాన్ ఆర్మీ సిబ్బందికి తీవ్ర గాయాలపాలయ్యారు. పీవోకెలోని లీపా, నీలం సెక్టార్లను పూర్తిగా ఖాళీ చేసి పాక్ సైనికులు పారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పాకిస్థాన్ ఆర్మీ పోస్టులను భారత్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది.