112 emergency call: హైదరాబాద్: ఆపద సమయంలో అత్యవసరంగా మనం ఏదైనా సహాయం కోరాలంటే 100 డయల్ చేస్తామనే విషయం అందరికీ తెలిసిందే కదా! అయితే డయల్ 100 స్థానంలో ఇప్పుడు కొత్తగా డయల్ 112 నెంబర్ వచ్చింది. దీనిని ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ అందుబాటులోకి రానుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నెంబర్‌పై అవగాహన కల్పించాలంటూ గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో తెలంగాణ పోలీసు శాఖ అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మరో రెండ్నేళ్ల తర్వాత డయల్ 112 (112 emergency call)అందుబాటులోకి వస్తుంది. అయితే అప్పటి వరకు మాత్రం డయల్ 100 కూడా పనిచేస్తుంది. ఒక వేళ దానికి డయల్ చేసినప్పటికీ ఆ ఫోన్ కాల్స్ అన్నీ 112కు అనుసంధాన మవుతాయి. డయల్ 112 పై సామాజిక మాధ్యమాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కర్ణాటక , తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ విషయంలో ముందు ఉన్నాయి.
యూరప్ దేశాల బాటలో భారత్!
ప్రస్తుతం భారతదేశంలో వివిధ అత్యవసర సేవలకు వివిధ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి. పోలీసు సేవలకు 100, అంబులెన్స్ కు 108, అగ్నిమాపక సేవలకు 101 నెంబర్లు ఉపయోగిస్తున్నాము. అయితే అమెరికా, యూరప్ దేశాలలో అన్ని సేవలకు ఒకే నెంబర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఒకే నెంబర్ ను తీసుకురావాలని నిర్ణయించింది.
కొత్తగా పలు ఫిర్యాదులు జోడింపు!
కొత్త నెంబర్‌తో విపత్తు నివారణ, గృహ హింస, వేధింపులకు సంబంధించిన సేవలను కూడా జోడించింది. సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్ మార్పులు తదితర కారణాల వల్ల ప్రస్తుతం నాలుగు, ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ నెంబర్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా దేశవ్యాప్తంగా ఈ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?