Debit – Credit కార్డుల వల్ల జరిగే మోసాలు? | Cyber మోసగాళ్లతో జాగ్రత్త!
Debit – Credit : ప్రస్తుతం అందరూ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానే తమ ఆర్థిక వ్యవహారాలను, అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇక కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ లావాదేవీల రెట్టింపు బాగా పెరిగింది. ఎందుకంటే ఎవ్వరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏదైనా వస్తువు కొనాలన్నా షాపులు తీయలేని పరిస్థితి నెలకొంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో బ్యాంకులు కూడా ఏటిఎంలో నిల్వలను అంతంత మాత్రమే ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్, డెబిట్ కార్డుల అవసరం ఎక్కవ అయ్యింది. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు మోసగాళ్లు డబ్బులు కొల్లగొట్టే పనిలో పడ్డారు. ఏదో ఒక సందర్భంలో అకస్మాత్తుగా ఓ నెంబర్ నుంచి ఫోన్ చేసి బ్యాంకు వివరాలను చాకచక్యంగా కూపీ లాగుతున్నారు. ఇందుకు మంచి అందమైన అమ్మాయిలతో మాట్లాడిస్తూ ట్రాప్‌లోకి దించుతున్నారు. ఇలా మోసపోయిన వారి క్రెడిట్, డెబిట్ డేటాను చోరీ చేసి డబ్బులు కాజేస్తున్నారు. అయితే అసలు మన కార్డులు ఎంత భద్రంగా ఉన్నాయి? ఆ కార్డుల వల్ల వినియోగం ఎంత వరకు మంచిది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంత మేరకు తెలుసుకుందాం!


మోసాలు ఎలా ఉంటాయి అంటే?
మోసాలు చేసే వారు దాదాపు 99% శాతం బ్యాంకు ప్రతినిధులుగానే చెప్పుకుంటూ నమ్మిస్తూ సదరు ఖాతాదారుడిని ట్రాప్ చేస్తారు. వారికి ఖాతాదారుడికి సంబంధించిన ఏ విషయాలూ తెలియకపోయినప్పటికీ, తెలిసినట్టు నటిస్తూ మన చేతనే ప్రాథమిక విషయాలను చెప్పేలా ప్రయత్నిస్తారు. ఇక డెబిట్ కార్డు కాలం చెల్లుతుందనో, లేక మంచి ఆఫర్ ఉందనో, క్రెడిట్ కార్డు వడ్డీ చెల్లించకపోతే బ్లాక్ అవుతుందనో కంగారు పెట్టించి సదరు వ్యక్తిని నమ్మేలా మాయచేస్తారు. అనంతరం కార్డు సంఖ్య, సీవీవీల నెంబర్లను చోరీ చేస్తారు. అదే విధంగా ఖాతాదారుడికి ఫోన్ చేసి మీ కార్డు వివరాలను చెప్పాలని, ఫోన్ నెంబర్‌కు ఓటిపి వస్తుందని అది త్వరగా చెప్పాలని అడుగుతారు. అనంతరం మన పుట్టిన తేదీ, ఈమెయిల్, కార్డు వివరాలు అన్నీ చోరీ చేస్తారు. ఒక్కొక్క సారి అదే సమయంలో డబ్బులను ఆ ముఠా ఖాతాలకు మళ్లించు కుంటారు. లేదా మన ఒరిజినల్ క్రెడిట్, డెబిట్ కార్డుల మాదిరిగానే డూప్లికేట్ కార్డులను తయారు చేసి ఆన్లైన్ మోసాలకు పాల్పడతారు.
కార్డు వివరాలు రహస్యంగా ఉన్నట్టేనా?


ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు రహస్యంగా ఉన్నాయో లేదో అప్పుడప్పుడు సంబంధిత బ్యాంకు ప్రతినిధుల వద్దకు వెళ్లి తనిఖీ చేసుకోవాలి. లేకుంటే కార్డు నెంబర్లు, సీవీవీ కోడ్, పేరు, ఈమెయిల్ ఐడీ లాంటి వివరాలన్నీ సైబర్ నేరగాళ్లు చోరీ చేసి అత్యంత లగ్జరీ వస్తువులను మన కార్డులపై కొంటున్నారట. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా సింగపూర్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్ తెలియజేసింది. ముఖ్యంగా భారతదేశంలో సుమారు 5 లక్షల మంది డేటా ఇలా చీకటి (డార్క్) వెబ్‌లో అమ్ముతున్నారని తేల్చింది. ఈ వివరాలను సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళితే సులువుగా లావాదేవీలు జరిపే ఆస్కారం ఉందని చెబుతుంది. వాస్తవంగా ఇంత పెద్ద మొత్తంలో కార్డుల వివరాలు లీక్ కావడం ఇటీవల కాలంలో ఇది రెండో సారట. కానీ ఇంత పెద్ద మొత్తంలో డేటా ఎలా లీకైంది? అన్న విషయం మాత్రం పరిశోధిస్తున్నారు. అయితే ఈ విషయం మాత్రం గత ఏడాదిలో బయటకు వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018 -19 వార్షిక నివేదిక ప్రకారం 1,866 ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డు మోసాలు జరిగాయట.


రాయడం కానీ, ఉంచడం కానీ చేయకూదడు!
బ్యాంకు ఖాతాదారులు సాధారణంగా అపరిచిత వ్యక్తులెవ్వరికీ పిన్, పాస్‌వర్డ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో నమోదు చేసి పెట్టుకోకుండా ఉండటం చాలా మేలు. సాధ్యమైనంత వరకు జ్ఞాపకం ఉంచుకోవడమే మేలు. విదేశీ కరెన్సీ, లాటరీల్లో గెలిచారని చెప్పి వచ్చే మెయిళ్లను, ఫోన్లను నమ్మకూడదు. కార్డు పోయినా, మీ సమాచారం ఎవరికైనా తెలిసిందనే అనుమానం ఉంటే వెంటనే బ్యాంకు అధికారులకు ఆ విషయాన్ని తెలియజేయాలి.


ప్రస్తుతం కాలంలో ఇంటర్నెట్లో స్కిమ్మింగ్ బాగా పెరిగింది. సైబర్ ముఠాలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ తదితర ప్రదేశాల్లో ఉండే అక్కడ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకుంటారు. వినియోగ దారుడు అక్కడకు వెళ్లిన సందర్భంలో బిల్లు చెల్లించడానికి కార్డులు ఇచ్చినప్పుడు వాటిని స్కిమ్ చేస్తుం టారు. ఇందుకు వాడే స్కిమ్మర్ అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. కార్డును ఒక్కసారి అందులో స్వైప్ చేస్తే చాలు దాని డేటా మొత్తం అందులో నిక్షిప్తమైపోతుంది. అంటే మన కార్డు గుట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టేగా గమనించాలి. ఇక ఏటీఎం సెంటర్లలోనూ ఫిక్స్ చేసే స్కిమ్మర్లూ ఉన్నాయి. వీటిని ఏటీఎం మిషన్ లో కార్డులను ఇన్సర్ట్ చేసే ప్రదేశంలో ఫిక్స్ చేస్తారు. డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన వినియో గదారుని కార్డును ఇన్సర్ట్(లోపలికి) చేయగానే అక్కడ ఏర్పాటు చేసిన స్కిమ్మర్ డేటాను గ్రహిస్తుంది. దీంతో మన ఏటీఎం పిన్ నెంబర్ వివరాలు వారికి తెలిసిపోతుంది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court