Improve self confidence tipsవ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఉద్యోగ విధుల్లో కావచ్చు.. ఆత్మవిశ్వాసం లోపించకుండా ఉండాలి అనకునే వారు పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. “ఏ పని చేద్ధాం అన్నా ఏదో అడ్డంకి, ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు..” అని చాలా మంది అంటుంటారు. అలా అనుకోవడంలోనే కాలం గడిచిపోతూ ఉంటుంది. సమస్యలు ఎదురవ్వడం సహజం. ప్రతి దానికీ ఓ పరిష్కారం ఉంటుంది, దానిని వెతికే ప్రయత్నం చేద్ధాం. అనుకుంటే సానుకూల ఆలోచనలు కలుగుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, నేను ధైర్యంగా పరిష్కరించుకోగలను… అని మనసులో తరచూ అనుకుంటూ ఉండాలి. దీని వల్ల ప్రతి కూల ఆలోచనలు దూరం (Improve self confidence tips)అవుతాయి.
మానసిక ఆందోళన తగ్గుతుంది. భవిష్యత్తు పట్ల స్పష్టమైన ఆలోచనలూ, లక్ష్యాలూ ఉండాలి. అప్పుడే అసలు జీవితంలో మీకేం కావాలీ, వాటిని ఎలా సాధించుకోవాలీ అన్న అవగాహన వస్తుంది. అది ప్రేరణగా పనిచేసి ముందుకు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో కొన్ని బలాలూ, బలహీనతలూ ఉంటాయి. నైపుణ్యాలనూ, సామర్థ్యాలనూ తెలుసుకుని వాటిని మరింత మెరుగు పెట్టుకునేందుకు ప్రయత్నించాలి. బలహీనతల్ని సరిదిద్దుకోవాలి. మనలోని లోపాలను ఎదుటి వాళ్లు చెప్పినప్పుడు వెంటనే అది నిజం కాదు అనుకోకుండా ఓసారి సమీక్షించుకోవాలి. వాస్తవం ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. బలహీనతలు తగ్గుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది.


“అది కాదు… ఇది చేయలేం, ఎటు చూసినా సమస్యలే.. “అంటూ ఆత్మన్యూనతతో మాట్లాడే వారితో ఎంతసేపు గడిపినా ప్రేరణ అందదు. మాటల్లో ఆత్మవిశ్వాసం, చేతల్లో చురుకుదనం కనబరిచే వారితో తరచూ మాట్లాడాలి. వారు పాటించే నియమాల్ని అడిగి తెలుసుకోవాలి. మంచి పద్ధతుల్ని పాటించే ప్రయత్నం చేయాలి.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?