Imprisonment

Imprisonment: 2018 లో లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

Spread the love

Imprisonmentవ‌రంగ‌ల్: 2018 సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ నెల 12వ తేదీన ప‌క్క‌న ఉంటున్న ఓ 8 సంవ‌త్స‌రాల బాలిక‌ను గుట్కా తీసుకుర‌మ్మ‌ని పంపాడు ఓ వ్య‌క్తి. అప్ప‌టికే త‌న మ‌న‌సులో కామ పిశాచి ఆ బాలిక‌పై క‌న్నుప‌డింది. ఇదే అదునుగా చూసుకున్న ఆ వ్య‌క్తి గుట్కా తీసుకువ‌చ్చిన స‌ద‌రు బాలిక‌ను ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. జ‌రిగిన విష‌యాన్ని బాధిత బాలిక కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో వారు ఫిర్యాదు మేర‌కు నిందితుడుపై అత్యాచార కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లం క‌ర్క‌ప‌ల్లి గ్రామంలో వెలుగు చూసింది. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. అయితే నిందితుడికి వ్య‌తిరేకంగా సాక్ష్యాధారాలు సేక‌రించారు. బాధిత బాలిక సాక్ష్యంతో పాటు ఇత‌ర సాక్ష్యాలు ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి నిందితుడికి 20 సంవ‌త్స‌రాల క‌ఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కేసుల ప్ర‌త్యేక న్యాయ‌స్థానం శుక్ర‌వారం తీర్పు(Imprisonment) వెల్ల‌డించింది.

ఈ కేసును అప్ప‌టి స‌బ్ డివిజ‌న‌ల్ పోలీసు అధికారి విజ‌య‌సార‌థి ద‌ర్యాప్తు చేయ‌గా కోర్టు డ్యూటీ ఆఫీస‌ర్ వి.ర‌వీంద‌ర్ సాక్షుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ కేసులో ప్రాసిక్యూష‌న్ త‌ర‌పున ప‌బ్లిక్‌ప్రాసిక్యూట‌ర్ సీహెచ్ స‌త్య‌నారాయ‌ణ వాధించారు.

Section 29 Telugu: సెక్ష‌న్ 29 గురించి తెలుసా!

Section 29: సాధార‌ణంగా ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో ఎలాంటి అరెస్టులు చేయ‌కుండా పోలీసులు కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో సామాన్య వ్య‌క్తులను కొట్ట‌డం, దీంతో వారు పై అధికారుల‌కు Read more

Knife Attach News | పంచాయ‌తీ తీర్పులో మాజీ స‌ర్పంచ్‌పై క‌త్తితో దాడి

క‌ర్క‌ప‌ల్లి గ్రామంలో దారుణం Knife Attach News | పంచాయ‌తీ తీర్పులో మాజీ స‌ర్పంచ్‌పై క‌త్తితో దాడిJayashankar Bhupalpally : జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గ‌ణ‌పురం మండ‌లం Read more

Fertilizer shop: వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం విత్త‌న దుకాణాల్లో పోలీసుల త‌నిఖీలు

Fertilizer shop | వ్య‌వ‌సాయ సీజ‌న్ ఆరంభం అవుతున్న నేప‌థ్యంలో రైతులు మోస‌పోకుండా తీసుకునే చ‌ర్య‌ల్లో భాగంగా Suryapeta ప‌ట్ట‌ణ పోలీసులు విత్త‌న దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. Read more

Teenmar Mallanna Case: తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై మంత్రి పువ్వాడ ఫిర్యాదు..నాపై అన్నీ అస‌త్య ఆరోప‌ణ‌లు అంటున్న మంత్రి

Teenmar Mallanna Case | క్యూ న్యూస్ అధినేత, శ‌నార్తి తెలంగాణ దిన‌ప‌త్రిక నిర్వాహ‌కులు చింత‌పండు న‌వీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు న‌మోదు అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.