Importance of Social Norms క్రింద తెలిపిన కొన్ని అముల్యమైన వాఖ్యాలు ఎవర్నీ తక్కువ చేసి కాదు ఎక్కువ చేసి చెప్పడం లేదు. జీవితంలో ప్రతిఒక్కరికీ తెలియాల్సిన విషయాలుగా నేను కూడా పాటించాల్సిన విషయా లుగా మీ ముందుకు తీసుకొస్తున్నా. (ఈ మెస్సేజ్ వాట్సాప్ గ్రూపులో నుండి సేకరించడం జరిగింది. (Importance of Social Norms)ముందుగా వారికి ధన్యవాదాలు.
1. ఒకరికి, రెండు సార్లకు మించి అదే పనిగా కాల్(ఫోన్) చేయవద్దు. వారు సమాచారం ఇవ్వకపోతే వారికి వేరే చాలా ముఖ్యమైన పని ఉందని అర్థం.
2.అవతలి వ్యక్తి అడగక ముందే మీరు అరువు తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న మొత్తమైనాసరే! అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది!.
3.ఎవరైనా మీకోసం పార్టీ ఇస్తున్నప్పుడు మెనూలో ఖరీదైన వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్ చేయవద్దు. వీలైతే మీ కోసం వారినే ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని అడగండి.
4. ‘మీకుఇంకా వివాహం కాలేదా? మీకు పిల్లలు లేరా? ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?’ వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుటవారిని అడగవద్దు. అవి వారి సమస్యలు. మీవి కావు!.
5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ మీరే తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించండి. అమ్మాయి, అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరనా సరే ఒకరి పట్ల మంచిగా ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా మారరు.
6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు సరదాగా తీసుకోకపోతే వెంటనే దాన్ని ఆపివేయండి! మరలా చేయవద్దు.
7.బహిరంగంగా ప్రశంసించండి. ప్రైవేటుగా విమర్శించండి.
8. ఒకరి బరువు గురించి మీరు ఎప్పుడూ వ్యాఖ్యానించవద్దు.‘మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు.’అని చెప్పండి. అప్పుడు బరువు తగ్గడం గురించి మాట్లాడాలనుకుంటే వారే మాట్లాడతారు.
9. ఎవరైనా వారి ఫోన్ లో మీకు ఫొటో చూపించినప్పుడు, అదొక్కటే చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు స్వైప్ చేయవద్దు. తర్వాత ఏముంటాయో మీకు తెలియదు కదా!
10. మీరు ఒక సీ.ఈఓ తో ఎట్లా వ్యవహరిస్తారో అదే గౌరవంతో క్లీనర్‌తో కూడా వ్యవహరించండి. మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే ప్రజలు ఖచ్చింతంగా దాన్ని గమనిస్తారు.
11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ సలహా ఇవ్వకండి.
12. సంబంధంలేని వారికి మీ ప్రణాళికల గురించి చెప్పవద్దు.
13. ఒక స్నేహితుడు / సహద్యోగి మీకు ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు మర్యాదగా ‘నో‘ చెప్పండి. కానీ రుచి లేదా వాసన చూసిన తర్వాత ‘నో‘ చెప్పవద్దు. అట్లా చేస్తే మీరు వారిని అవమానించినట్లే!.
14. మరో ముఖ్య విషయం.. ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా, మీ పనేదో మీరు చూసుకోండి!!
నోట్ : మీకు నచ్చితే ఆచరించింది!.లేకుంటే వదిలేసి మరొకరికి షేర్ చేయండి!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ