immunity food | మన చుట్టూ నిరంతరం బోలెడన్ని హానికారక సూక్ష్మక్రిములు తిరుగుతుంటాయి. ఎప్పుడైనా వీటి భారినపడే ప్రమాదం ఉంది. దీంతో రకరకాల infectionన్లు, జబ్బులు దాడిచేస్తాయి. అయితే మనలో రోగనిరోధక శక్తి (immunity) బలంగా ఉందనుకోండి. అవేమీ చేయలేవు. వ్యాయామం, మంచి జీవనశైలి మాత్రమే కాదు. కొన్నిరకాల ఆహార (food) పదార్థాలు కూడా రోగనిరోధక శక్తి పుంజుకోవడానికి తోడ్పడతాయి. అలాంటి కొన్ని immunity food పదార్థాలేంటో చూద్ధాం.
రోగ నిరోధక శక్తికి పెంపొందించే Food Items
పుచ్చకాయ(Puchha kaya)
లోపల ఎర్రటి గుజ్జుతో చూడగానే నోరూరించే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. ఇందులో గ్లుటాదియోన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా దండిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా కాపాడుతుంది. పైతొక్కకు సమీపంలోని గుజ్జులో ఈ glutathione అధికంగా ఉంటుంది.
క్యాబేజీ(cabbage)
దాదాపు అన్నికాలాల్లోనూ దొరికే క్యాబేజీలో ఉండే గ్లుటమైన్ రోగనిరోధక శక్తి పుంజుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని కూరగానో సలాడ్గానో తరుచుగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచింది.
బాదం పప్పు(Badam Pappu)
పావు కప్పు బాదం పప్పు తింటే ఆ రోజుకి అవసరమైన Vitamin E మోతాదులో సగం వరకు లభించినట్టే. ఇది నిరోధక శక్తి తగ్గకుండానూ కాపాడుతుంది. ఇక బాదంలోని రైబోప్లావిన్, నియాసిన్ వంటి బి విటమిన్లు ఒత్తిడి ప్రభావాల నుండి బయటపడటానికి సాయపడతాయి.
పెరుగు(Perugu)
రోజూ ఒక కప్పు పెరుగు తింటే జలుబు బారినపడే అవకాశం తగ్గుతుంది. ఇది జబ్బులతో పోరాడేలా నిరోధక శక్తిని ప్రేరేపిస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. పెరుగులో విటమిన్ D కూడా ఉంటుంది. విటమిన్ డి లోపం మూలంగా జలుబు, flu ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు కూడా.

వెల్లుల్లి(vellulli)
దీనిలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ హానికారక క్రిములతో పోరాడేవే. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్కు కారణమయ్యే హెచ్.ఫైలోరీ బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. వెల్లుల్లి పొట్టును తీసి, సన్నగా తరిగి, 15 నిమిషాల తర్వాత వంటల్లో వాడితే రోగనిరోధక శక్తినిని పెంపొందించే ఎంజైమ్లు బాగా ప్రేరేపితమవుతాయి.
పాలకూర(Palakura)
ఇందులో ఫోలెట్ దండిగా ఉంటుంది. ఇది కొత్త కణాలు పుట్టకురావడంలో, DNA మరమ్మతులో పాలు పంచుకుంటుంది. పాలకూర ద్వారా పీచుతో పాటు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. పాలకూరను బాగా కడిగి, పచ్చిగా గానీ కాస్త ఉడికించి గానీ తింటే మరింత మేలు.
చిలగడదుంప (Chilagada dumpa)
క్యారెట్ల మాదిరిగానే చిలగడదుంపలోనూ బీటా కెరోటిన్లు బాగా ఉంటాయి. యాంటీఆక్సాడెంట్ గుణాలు గల ఇవి విశృంఖల కణాల నుంచి ఎదురయ్యే అనర్థాలను నివారిస్తాయి. త్వరగా వృద్ధాప్యం రాకుండా చూసే విటమిన్ ఏ కూడా ఇందులో దండిగా ఉంటుంది.
పచ్చ గోబీపువ్వు (gobipuvvu)
మన ఆరోగ్యాన్ని కాపాడే బోలెడన్ని పోషకాలు పచ్చ గోబీపువ్వులో (Broccoli) దండిగా ఉంటాయి. దీంతో విటమిన్ ఏ, విటమిన్ సి, గ్లుటాథియోన్ కూడా లభిస్తాయి. తక్కువ కొవ్వు కూడిన ఛీజ్ను కలిపి బ్రకోలీని తింటే రోగనిరోధక శక్తి పంపొందించే బి విటమిన్లు, విటమిన్ డి కూడా పొందే అవకాశం ఉంది.