Immune Booster Foods: రోగ నిరోధ‌క శ‌క్తి ఆహారం నీ చుట్టూనే ఉన్న‌ప్ప‌టికీ!

Immune Booster Foods: మ‌న చుట్టూరా బోలెడ‌న్ని హానికార‌క సూక్ష్మక్రిములు తిరుగు తుంటాయి. ఎప్పుడైనా వీటి బారిన‌ప‌డే ప్ర‌మాద‌ముంది. దీంతో ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, జ‌బ్బులు దాడి చేస్తాయి. అయితే మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి బ‌లంగా ఉంద‌నుకోండి. అవేమీ చేయ‌లేవు. వ్యాయామం, మంచి జీవ‌న‌శైలి మాత్ర‌మే కాదు. కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు కూడా నిరోధ‌క శ‌క్తి పుంజుకోవ‌డానికి తోడ్ప‌డ‌తాయి. అలాంటి కొన్ని ప‌దార్థాలేంటో (Immune Booster Foods) చూద్ధాం.

Immune Booster Foods: రోగ నిరోధ‌క శ‌క్తి ఆహారం

పుచ్చ‌కాయ: లోప‌ల ఎర్ర‌టి గుజ్జుతో చూడ‌గానే నోరూరించే పుచ్చ‌కాయ‌లో నీటి శాతం ఎక్కువ‌. ఇందులో గ్లుటాధియోన్ అనే శ‌క్తివంత‌మైన యాంటీఆక్సిడెంట్ కూడా దండిగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచి ఇన్‌ఫెక్ష‌న్లు, జ‌బ్బులు రాకుండా కాపాడుతుంది. పై తొక్క‌కు స‌మ‌పీంలోని గుజ్జులో ఈ గుట్లాథియోన్ అధికంగా ఉంటుంది.

క్యాబేజీ: దాదాపు అన్ని కాలాల్లోనూ దొరికే క్యాబేజీలో గుట్లమైన్ రోగ‌నిరోధ‌క శ‌క్తి పుంజుకోవ‌డానికి ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. కాబ‌ట్టి దీన్ని కూర‌గానో స‌లాడ్‌గానో త‌రుచుగా తీసుకోవ‌డం అల‌వాటు చేసుకుంటే మంచిది.

బాదంప‌ప్పు: పావు క‌ప్పు బాదం ప‌ప్పు తింటే ఆ రోజుకి అవ‌స‌ర‌మైన విట‌మిన్ ఇ మోతాదులో స‌గం వ‌ర‌కు ల‌భించిన‌ట్టే. ఇది నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌కుండానూ కాపాడుతుంది. ఇక బాదంలోని రైబోప్లావిన్‌, నియాసిన్ వంటి బి విట‌మిన్లు ఒత్తిడి ప్ర‌భావాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి సాయ‌ప‌డ‌తాయి.

పెరుగు: రోజూ ఒక క‌ప్పు పెరుగు తింటే జ‌లుబు బారిన‌ప‌డే అవ‌కాశం త‌గ్గుతుంది. ఇది జ‌బ్బుల‌తో పోరాడేలా నిరోధ‌క శ‌క్తిని ప్రేరేపిస్తున్న‌ట్టు కొన్ని అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. పెరుగులో విట‌మిన్ డి కూడా ఉంటుంది. విట‌మిన్ డి లోపం మూలంగా జ‌లుబు, ఫ్లూ ముప్పు పెరుగుతున్న‌ట్టు ప‌రిశోధ‌కులు గుర్తించారు కూడా.

వెల్లుల్లి: దీనిలో బోలెడ‌న్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవ‌న్నీ హానికార‌క‌క్రిముల‌తో పోరాడేవే. ముఖ్యంగా జీర్ణౄశ‌యంలో పుండ్లు, క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే మెచ్‌.పైలోరీ బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. వెల్లుల్లి పొట్టును తీసి, స‌న్న‌గా త‌రిగి 15 నిమిషాల త‌ర్వాత వంట‌ల్లో వాడితే రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంపొందించే ఎంజైమ్‌లు బాగా ప్రేరేపిత‌మ‌వుతాయి.

పాల‌కూర‌: ఇందులో పోలేట్ దండిగా ఉంటుంది. ఇది కొత్త క‌ణాలు పుట్ట‌కురావ‌డంతో, డిఎన్ఏ మ‌ర‌మ్మ‌తులో పాలు పంచుకుంటుంది. పాల‌కూర ద్వారా పీచుతో పాటు విట‌మిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ల‌భిస్తాయి. పాల‌కూర‌ను బాగా క‌డిగి, ప‌చ్చిగా గానీ కాస్త ఉడికించి గానీ తింటే మ‌రింత మేలు.

చిల‌గ‌డ‌దుంప‌: క్యారెట్ల మాదిరిగానే చిల‌గ‌డ‌దుంప‌లోనూ బీటా కెరొటిన్లు బాగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ గుణాలు గ‌ల ఇవి విశృంఖ‌ల క‌ణాల నుంచి ఎదుర‌య్యే అనర్థాల‌ను నివారిస్తాయి. త్వ‌ర‌గా వృద్ధాప్యం రాకుండా చూసే విట‌మిన్ ఏ కూడా ఇందులో దండిగా ఉంటుంది.

ప‌చ్చ గోబీపువ్వు: మ‌న ఆరోగ్యాన్ని కాపాడే బోలెడ‌న్నీ పోష‌కాలు ప‌చ్చ గోబీపువ్వులో దండిగా ఉంటాయి. దీంతో విట‌మిన్ ఏ, విట‌మిన్ సి, గ్లుటాది యోన్ కూడా ల‌భిస్తాయి. త‌క్కువ కొవ్వుతో కూడిన ఛీజ్‌ను క‌లిపి బ్ర‌కోలీని తింటే రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంపొందించే బి విట‌మిన్లు, విట‌మిన్ డి కూడా పొందే అవ‌కాశం ఉంది.

విట‌మిన్ మాత్ర‌లు క‌న్నా ఇవి మిన్నా!

Immune Booster Foods: శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే మ‌నం తీసుకునే ఆహారంలో విట‌మిన్లు సమృద్దిగా ఉండాలి. పోష‌కాల్లో ఇవి ఎక్కువ‌గా ఉండేలా త‌గిన ఆహారాన్ని ఎంచుకోవాలి. విట‌మిన్ మాత్ర‌ల‌ను వేసుకోవ‌డానికి అల‌వాటు ప‌డ‌టం క‌న్నా, అవి పుష్క‌లంగా ల‌భించే ఆహారాన్ని విధిగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ముందుగా రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతం కావాలి.

ఇందుకు విట‌మిన్లుతో కూడిన స‌మ‌తుల ఆహారం అనునిత్యం తీసుకోవాలి. ఇన్‌ఫెక్ష‌న్లు, ఇత‌ర అనారోగ్యాల‌కు దూరంగా ఉండాలంటే విట‌మిన్‌-సి అందించే పాల‌కూర‌, క్యాబేజీ, అనాస‌, బొప్పాయి, నారింజ‌, బ‌త్తాయి, నిమ్మ మామిడిపండు వంటివి త‌రుచూ తీసుకోవాలి. బాదం, వేరు శ‌న‌గ‌, బ‌ఠాణీలు, ఇత‌ర గింజ‌లను తీసుకుంటే విట‌మిన్‌-ఇ శ‌రీరానికి త‌గినంత‌గా అందుతుంది.

మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేసే విట‌మిన్‌- ఇ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను నివారిస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేలా విట‌మిన్ బి-6 కూడా మ‌నం తీసుకునే పోష‌కాల్లో త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. పిస్తా, పాల‌కూర‌, చికెన్‌, చేప‌లు, గుడ్లు వంటి ఆహారంలో ఇది ఎక్కువుగా ల‌భిస్తుంది.

Share link

Leave a Comment