IIT Professor Alok Sagar life | Act of Goodness | నచ్చినట్టు బ్రతకడమే అసలైన జీవితం! ఫ్రొఫెసర్ అలోక్ సాగర్(Professor Alok Sagar) స్టోరీ చదువుతున్నవారికి చాలా గొప్పగా, ఆదర్శవంతంగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్ ఐపీఎస్ అధికారులకు మాత్రం ఒక బాషా స్టోరీ లెవల్లో గుర్తుకు వచ్చింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ తీసిని బాషా సినిమాల్లో తను ఎవరో ఫ్లాష్ బ్యాక్ చెబితే అంతా ఒణికిపోతారు మనందరికీ తెలుసుకదా!. అయితే అలోక్ సాగర్ విషయంలో కూడా అదే జరిగింది.
ఆరేళ్ల కిందట మధ్యపద్రేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో చొక్కా లేకుండా మాసిన గడ్డంతో ఓ సైకిల్‌పై అక్కడ ఉన్న గిరిజన గ్రామాల్లో తిరుగుతుంటారు. ఎందుకంటే తనకు నచ్చిన జీవితాసు సారం అక్కడ చెట్ల మధ్య జీవిస్తుంటారు. ఆ గిరిజన గ్రామంలో తిరుగుతూ రోజుకు 10 చెట్లను నాటుతూ జీవనం సాగిస్తుంటారు. వెనుకబడిన గిరిజన జాతులకు చదువుల విషయంలో కానీ, సామాజిక అంశాలు మరియు ఇతర ఏ సహాయం కావాలన్నా వారికి చేస్తూ ఉంటారు.
అయితే ఎన్నికల సమయంలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు చూసేందుకు ఓ పోలీసు అధికారి బేతూల్ జిల్లాలోని అటవీ ప్రాంతానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తుండగా పోలీసు అధికారి ఎదుట పట్టించుకోకుండా అలోక్ సాగర్ సైకిల్‌పై తన మానాన తను వెళుతుంటారు. అతను ఎవరు? అని గ్రామస్థులను పోలీసు అధికారి అడగగా మా ఊళ్లోనే ఉంటారని, చెట్లను పెంచుతుంటారని సమాధానం ఇస్తారు. ఆయన పూర్తి వివరాలు ఏమీ తమకు తెలియదని గ్రామస్థులు పోలీసులకు చెబుతారు. దీంతో కానిస్టేబుల్‌ను పంపించి అలోక్ సాగర్‌ను పిలిపిస్తారు సదరు పోలీసు అధికారి ఎస్పీ. అతని వద్దకు వెళ్లిన కానిస్టేబుల్ పేరు ఏమిటి? అని అడుగుతారు. అలోక్ సాగర్ అని చెబుతాడు.
గుర్తింపు కార్డు ఏది? అని అడిగితే తన ఇంట్లో ఉంది అంటాడు. ఇక్కడకు తెచ్చుకోలేదని కూడా చెబుతాడు. నేను భారతీయుడునే. భయపడవద్దు. నేను సామాన్య జీవితాన్ని గడుపుతున్నానని చెప్పడంతో ఆ విషయాన్ని ఎస్పీకి కానిస్టేబుల్ చెప్పడంతో అనుమానం వచ్చిన ఎస్పీ అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకురా వాలని సిబ్బందికి చెబుతారు. అయితే పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధపడతారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తాడు అలోక్ సాగర్. అనుమానితుడిగా అదుపులోకి తీసుకుంటున్నామని చెబుతారు. పోలీసు స్టేషన్‌కు మాసిన గడ్డంతో, చిరిగిన చొక్కాతో వచ్చిన అలోక్సాగర్ను తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నిస్తారు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన అలోక్ సాగర్‌కు ఏ భాషలో కావాలని పోలీసు అధికారిని అడిగారట. హిందూ, ఉర్దు, అస్సామీ, బెంగాళీ ఇలా 8 భాషలు ఆయనకు వచ్చు. తాను ఐఐటీ ఢిలీ ఫ్రొఫెసర్‌ను. అమెరికాలో పిహెచ్డి చేసి వచ్చానని, నా శిష్యుడు ఓ ఆర్బిఐ గవర్నర్ రంగరాజన్, కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి అని ఇంగ్లీషులో చెప్పి అక్కడి నుండి అలోక్ సాగర్ వెళ్లిపోయాడు.
దీంతో పోలీసులకు ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. ఇతనెవర్రా బాబు. బాషా స్టైయిల్లో వణికించి పోయాడని పోలీసులు అక్కడికక్కడే వణికిపోయారట. వివరాలు కావాలంటే చెబుతాను. ఆధారాలు మాత్రం అడగొద్దని చెప్పి అలోక్ సాగర్ వెళ్లిపోయారట. వెంటనే పోలీసులు అతని బ్యాక్‌గ్రౌడ్ ఆరా తీయడంతో నిజంగానే ఐఐటీ ఫ్రొఫెసర్ అని తేలిపోయింది. ఎస్పీకి వివరాలు తెలియడంతో వెంటనే కానిస్టేబుల్‌ను పంపి క్షమాపణలు అడిగారట. అంతే మొదటి సారి ఈ ఘటనతో అలోక్ సాగర్ అనే వ్యక్తి గురించి బయట ప్రపంచానికి తెలిసిపోయింది.
అలోక్‌సాగర్ అతని తల్లిదండ్రులు ఢిల్లీలో ఉండేవారు. అతని తండ్రి రిడైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. తల్లి ఢిల్లీ యూనివర్శిటీలో ఫిజిక్స్ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తుంది. ఢిల్లీలోని ప్రతాప్ఘంజ్లో నివాసం ఉండేవారు. ఆయన బాల్యం గురించి ఏ మీడియా ఎదుట పంచుకోలేదు. కనీసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడలేదట. చదువులో చాలా చురుగ్గా ఉండే అలోక్‌సాగర్ ఢిల్లీలోని ఐఐటీ చదవారు. తర్వాత అమెరికాలోని ఓ యూనివర్శిటీలో పిహెచ్డీ పూర్తి చేశారు. కొన్నాళ్లపాటు అక్కడే బోధన కూడా చేశారట. ఆ సమయంలోనే ఆర్బిఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కూడా అక్కడే చదువుకున్నారు. భారతీయ ఫ్రొఫెసర్ గొప్పతనం తెలిసిన రంగరాజన్ కూడా అలోక్‌సాగర్ క్లాసులకు వెళ్లేవారట.
ఇక భారత్ తిరిగి వచ్చిన అలోక్‌సాగర్ దాదాపు దశాబ్ధాలుగా ఢిల్లీలో ఐఐటీ విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. ఆయన ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా గొప్పగొప్ప సంస్థల్లో పనిచేస్తున్నారట. వారిలో కలెక్టర్లు, పోలీసులు అయిన వారు కూడా ఉన్నారు. అయితే జీవితాన్ని ప్రకృతి వనంకు దగ్గరగా బ్రతుకుదామని మధ్యప్రదేశ్‌లోని బెతిల్ హోషన్బాగ్ వచ్చారు. గిరిజన గ్రామాల్లోనే ఉంటూ వారికి ప్రకృతి గురించి చెబుతూ వేలాది చెట్లను నాటిన ఆయన సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా వారికి చెబుతూ ఉండేవారు. ప్రాశ్చాత్య తిండికి, ఆహార అలవాట్లక దూరంగా ఉండాలని చెప్పేవారు. అంతేకాదు అందరూ చదువుకోవాలని చాలా గట్టిగా చెప్పేవారట.
ఆయా గ్రామాలకు కరెంట్ సౌకర్యం లేకపోవడంతో ఎన్నో సార్లు అధికారులకు లేఖ రాసినా స్పందించలేదు. అతను ఇంగ్లీష్‌లో మాట్లాటంతో పాటు లేఖలు కూడా ఇంగ్లీష్‌లో రాసేవారు. దీంతో ఢిల్లీ సీఎం ఆఫీసుకు లేఖ రాయడంతో ఏళ్లుగా రాని కరెంట్ ఆయన చొరవతో వచ్చిన కొద్దినెలల్లోనే విద్యుత్ సదుపాయం ఏర్పడింది. ఎక్కడా తను మాజీ ఫ్రొఫెసర్నని, అమెరికాలో పిహెచ్డీ చేసినట్లు ఎవ్వరికీ చెప్పేవారు కాదు. చాలా తక్కువగా మాట్లాడుతూ గిరిజన ప్రజలకు సేవలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. అతనికి అద్భుతమైన జీవితం ఉన్నా వాటిని వదిలివేసి వచ్చారు. ఖరీదైన కార్లలో తిరగవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆయన ఫ్రొఫెసర్‌గా పనిచేయవచ్చు.
కానీ జీవితాన్ని సంతోషంగా చెట్ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడపాలనే కోరికే తనను అక్కడ ఉండేలా చేసింది. విశేషమేమిటంటే అలోక్‌సాగర్ అసలు చొక్కానే వేసుకోరట. కేవలం పోలీసులు రమ్మనడంతోనే ఆరు నెలల తర్వాత చొక్కా వేసుకున్నారట. అనంతరం పోలీసులు ఆయన ఉన్న ప్రాంతాన్ని సందర్శించి నప్పుడు అలోక్‌సాగర్ వద్దకు వెళ్లి నమస్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వచ్చేవారట. అలా జీవితాన్ని ప్రకృతి ఒడిలో గడుపుతున్నారు అలోక్ సాగర్. కోట్లకు కోట్లు పడగలెత్తుతున్న ఈ ఆధునిక యుగంలో అంత పెద్ద పెద్ద చదువులు చదివి, కేవలం సామాన్య జీవితం గడుపుతూ ఎలాంటి అంగూఆర్భాటం లేకుండా ఉన్న అలోక్సాగర్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిందే. హాట్యాఫ్ అలోక్‌సాగర్. జై హింద్.