Third wave of Corona

Third wave of Corona: థ‌ర్డ్ వేవ్ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తే మ‌ళ్లీ ఇబ్బందులే!

Spread the love

Third wave of Corona: గ‌త కొంత కాలంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గుతూ వ‌స్తోంది. మే 15 నుంచి జూన్ 20 వ‌ర‌కు దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుతూ వచ్చాయి. ఈ నేప‌థ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా ఆంక్ష‌లు స‌డలిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మ‌న రాష్ట్రంలో కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా.. దేశంలో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర స‌హా ప‌లు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో థ‌ర్డ్ వేవ్ కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌తి ఒక్క‌రూ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ముఖ్యంగా ప్ర‌భుత్వం నిర్థేశించిన నియ‌మాల ప్ర‌కారం వ్యాక్సిన్ తీసుకోవ‌డంతో పాటు మాస్కు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, చేతుల‌ను స‌బ్బుతో లేదా శానిటైజ‌ర్ తో శుభ్రంగా క‌డుక్కోవ‌డం మాత్రం మ‌ర్చిపోకూడ‌దు. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ప‌నుల మీద బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించ‌డం ద్వారా క‌రోనా వ్యాప్తిని చాలా వ‌ర‌కు అరిక‌ట్ట‌వ‌చ్చు.

స్టేడ్ నోడల్ ఆఫీస‌ర్ (కోవిడ్ – 19) డాక్ట‌ర్ అర్జా శ్రీ‌కాంత్ చెప్పిన సూచ‌న‌లు!

Third wave of Corona: మాస్క్ త‌ప్ప‌నిసరిగా ధ‌రించాలి?

-కోవిడ్ -19 వైర‌స్ ఒక వ్య‌క్తి నుంచి మ‌రొక వ్య‌క్తికి సుల‌భంగా వ్యాపిస్తుంది. వైర‌స్ సోకిన వ్య‌క్తి తుమ్మిన‌ప్పుడు గానీ, ద‌గ్గిన‌ప్పుడు గానీ ద్ర‌వ‌రూపంలో ఉండే తుంప‌ర్లు గాలి ద్వారా ఎదుటి వారి మీద ప‌డే అవ‌కాశం ఉంటుంది. మ‌రికొంద‌రిలో శ్వాస కోస వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంది. అదే మ‌నం మాస్కు ధ‌రిస్తే వైర‌స్ మ‌న శ్వాస వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తుంది. అందుకే ప్ర‌తిఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి.

-టిఫెన్‌, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర ఎప్ప‌టిలాగే తీవ్ర‌మైన ర‌ద్దీ ఉంటోంది. ఎక్కడా క‌నీసం భౌతిక దూరం పాటించ‌డం లేదు. మాస్కులు పెట్టుకున్నా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఫ్యాష‌న్‌గా మాస్కులు ముఖానికి త‌గిలించుకుని నిర్ల‌క్ష్యంగా ఉంటున్నారు.

-క‌రోనాకి ఎవ‌రూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో క‌రోనా భారిన‌ప‌డేవారి సంఖ్య మరింత పెరుగ‌తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మ‌న‌వ‌ర‌కు రాలేద‌ని, ఒక వేళ క‌రోనా వ‌చ్చిపోయినా అజాగ్ర‌త్త‌గా మాత్రం ఉండ‌కూడ‌దు. అతి మ‌న బాధ్య‌తార‌హిత్యాన్ని తెలియ‌జేస్తుంది.

-క‌రోనా అనేది సాధార‌ణ వ్యాధుల్లా ప‌రిగ‌ణించి బ‌య‌ట తిర‌గ‌కూడ‌దు. ఉద్యోగ రిత్యా, ఇత‌ర ప‌నుల కోసం బ‌య‌ట‌కు వెళ్లినా క‌రోనా సోక‌కుండా అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకోవాలి.

-సాధ్య‌మైనంత వ‌ర‌కు చిన్న పిల్లల్ని బ‌జారుకు, మార్కెట్ల‌కు, ర‌ద్దీగా ఉండే ప్ర‌దేశాల‌కు పంప‌కండి.

Health news today: మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు సైరెన్ మోగిస్తున్న క‌రోనా..రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన కేంద్రం!

Health news today: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభించ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా Read more

UK Covid Cases: మ‌ళ్లీ యూకేను క‌మ్మేస్తున్న క‌రోనా! ఆంక్ష‌లు ఎత్తేసిన ప్ర‌భుత్వం

UK Covid Cases: యూకేలో క‌రోనా మ‌ళ్లీ విల‌య‌తాండ‌వం చేస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 54,674 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఏడాదిలో జ‌న‌వ‌రి నెల Read more

covid 3rd wave : షాకింగ్ : క‌రోనా థ‌ర్డ్ వేవ్ రెడీగా ఉందంట‌!

covid 3rd wave : ప్ర‌పంచ దేశాలు ప్ర‌శాంతంగా ఉన్నా భార‌త్‌ను మాత్రం క‌రోనా ప్ర‌శాంతంగా బ‌త‌క‌నిచ్చేట‌ట్టు లేన్న‌ట్టుంది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి రూపాంత‌రం చెందుతూ ప్ర‌జ‌ల Read more

Third wave of Corona : థ‌ర్డ్‌వేవ్ ముంచుకొస్తుందా? సెకండ్‌వేవ్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మా?

Third wave of Corona : భార‌త్‌లో క‌రోనా మ‌హమ్మారి విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే సెకండ్ వేవ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు థ‌ర్డ్‌వేవ్ భ‌యం ప‌ట్టుకోంది. సెకండ్‌వేవ్ తీవ్ర‌త Read more

Leave a Comment

Your email address will not be published.