Iftar in Khammam | మతసామరస్యానికి కాపాడటంతో పాటు ముస్లీంల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మం నగరంలోని త్రీటౌన్ కాల్వ ఒడ్డు లోని మోతే మజీద్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar in Khammam)కు మంత్రి పువ్వాడ హాజరయ్యారు. ఉపవాసంలో ఉన్న దీక్షకులను పండ్లు తినిపించి శుక్రవారం ఉపవాసంను విరమింపజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..మత సామరస్యం అనేది తెలంగాణను చూసి నేర్చుకోవాలని ఆనాడు మహాత్మగాంధీ చెప్పిన మాటలను మంత్రి పువ్వాడ గుర్తు చేశారు. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉన్నామని, ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించారని తలంచిన ప్రభుత్వం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజ్, సుడా ఛైర్మన్ విజయ, కార్పొరేటర్ కమర్తపు మురళి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్, ముతవళి సర్వర్ మియా, సెక్రెటరీ సయ్యద్ మహబూబ్ పాష, ఇమామ్ సాబ్, అబ్దుల్ గని, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జానీ, షేక్ అంజద్, షేక్ ఇస్మాయిల్, ఎండి అన్వర్ ఖాన్, షంషుద్దీన్, తాజుద్దీన్, ఆసిఫ్, భాషా, షేక్ హుస్సేన్, మజీద్, మొహమ్మద్ షమీ తదితరులు ఉన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ