Motivational Content: నువ్వు మాట్లాడేది తప్పు కానప్పుడు దేన్నైనా నిగ్గదీసి అడుగు!
అసలు సంకోచించకు భయపడకు!
నష్టమేమిటి? అసలు ఎందుకు భయపడతావు?
ఎవరికోసం భయపడతావు?
నాకెందుకులే అని ఊరుకొని కూర్చుంటావు!
నువ్వు కాక ఎవరు అడుగుతారు?
Motivational Content:తప్పు చేసేవాడు రకరకాల బలహీనతలు కలిగిన వారు రకరకాల కథలు వల్లిస్తూ కవితలతో, కథలతో సమససమాజ స్థాపనకు మంచి చేస్తున్నట్టు లోపల కుళ్లిపోయి ఉండే భావాజాలం ఉన్నవారు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది లేనిది, నిప్పులా! స్వచ్ఛంగా మనసు పెట్టుకొని నువ్వు మాట్లాడకుండా భయపడటంలో అసలు అర్థం ఏముంది?
నీ మనస్సును స్పష్టంగా పెట్టుకో!
ఆలోచనలు నిజాయితీగా ఉంచుకో!!
దేనికీ కొమ్ము కాయకు!
ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడు!
తట్టుకునే దమ్ము, ధైర్యం చాలా మందికి ఉండవు. ఏవేవో చెబుతారు. తిడతారు. నువ్వు ఇలా అనుకున్నాం.. కానీ ఇలా అని అర్థమైంది. అంటూ పనికిమాలిన బ్రాండింగులు వేస్తారు. వాళ్లలో ఉన్న అసహ్యాన్ని అంతా బయటకు లాగేసి,రాక్షసుల్లా మారిపోతారు. అయినా.. చలించకు.
నువ్వేంటో నీ మనస్సుకు తెలుసు! బోడి ఎవడెవడి మూర్ఘత్వాల మనుషులకు మనం సమాధానం చెప్పడం ఏమిటి? అవును కాబట్టి నువ్వు తప్పించి ఈ సమాజాన్ని అడగలేరు, కడగలేరు.
అందరూ సిరివెన్నలలా! నిగ్గదీసి అడుగు.. ఈ సిగ్గు లేని సమాజాన్ని.. అని పాడుకునే వారు తప్పించి ధైర్యం చేసి అడిగే దమ్ము ఎవ్వరికీ లేదు. లోపల అంతా కులం, మతం వాదాలను చెప్పుకుని కుళ్లిపోయి వాటితో ప్రయోజనాలు పొందుతూ..వాటిని మేకప్లుగా వేసుకొని తిరుగుతూ, పైకి మాత్రం చాలా గొప్పవారుగా ఆదర్శవంతులుగా, విశాల హృదయులుగా తిరిగే నిజాయితీ లేని జనాల్ని సూటిగా ప్రశ్నించు. నష్టమేమీ లేదు.
తాను నిఖార్సైన మనిషినా! కానా? అని ఒక్కొక్కడి గుండెల్లో నీ ప్రశ్నలు స్కానింగ్‌లు అవ్వాలి. కులాలు, మతాలు పక్కన పెట్టి తమకు తాము బ్రతకడం చేతకాని బ్రతుకుల్లో మళ్లీ ఆదర్శాలు ఒకటా! అన్నీ మూసుకొని కూర్చోమను.
మిత్రమా! ఒకసారి ఆలోచించు నష్టమేమి లేదు?
Motivational Content: నీ వల్ల అవుతుంది!
నువ్వే మాట్లాడగలవు!
నువ్వే ధైర్యం చేయగలవు!!
ఈ వ్యవస్థను, ఈ నకిలీ మనుషుల ఆగడాలను నిలదీయాలన్నా, కనీసం నీ చుట్టూ ఉన్న సమాజంలో ఆలోచనలు రేకేతించాలన్నా!
నువ్వే!
నువ్వే..నువ్వే..!!
నువ్వు మాత్రమే! చేయగలవు. ఇది అక్షర సత్యం.
గొప్ప స్థానాల్లో ఉన్నవారిని చూసి, వారికి అదృష్టం ఉంది. మనకు లేదు. మనకూ అదృష్టం ఉంటే ఇంకాస్త ఎత్తుకు ఎదిగేవాళ్లం అని అనుకునేవాళ్లని మూర్ఖులూ అంటారు. ఈ జీవితంలో అదృష్టం అనేది ఎవ్వరీ సొత్తు కాదు. నేరుగా అది వెళ్లి వాడి ఒడిలో పడటానికి.
అదృష్టాన్ని మాత్రమే నమ్మినవాడు. ఎప్పుడూ జీవితంలో బాగుపడిన సందర్భం లేదు. మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాల్సిందే మనమే.ఇవాళ కాదు. రేపు చూద్ధాములే అని అనుకుంటే చచ్చిపోయేదాకా..రేపు అనేది రాదు. ఇది మాత్రం నిజం. ఇవాళ్లే.. ఈ రోజే నీ కళ్ల ముందు సజీవంగా ఉంది. ఏదైనా చేసే సత్తా ఉంటే ఈ రోజే చేయాలి. అది రేపు ఉండదు. నీ చుట్టూ కొన్ని వందల మంది కష్టపడుతున్నారు. వారిని చూసి ప్రేరణ పొందవచ్చు.
motivation:ఎవరెవరో అవసరం లేదు!
నిజంగా నీకు ఇన్మెరేషన్ కావాలంటే స్వామివివేకానందలు, ఇంకా ఎవరెవరో అవసరం లేదు.రోడ్డు మీద ఇడ్లీలు, బజ్జీలు అమ్ముకునే వాళ్లను చూసి కూడా మనం ప్రేరణ పొందవచ్చు. ఉదయాన్నే వాళ్లు ఎన్నింటికి లేస్తారో, ఎన్ని గంటలు అలానే నిలబడి పనిచేస్తారో. ఒక్కసారి, ఒకే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నీ చుట్టూ కొన్ని వందల మంది విజేతలు ఉన్నారు. వారు పడ్డ కష్టం నుంచి మనం ఎదుగుదలకు కావాల్సిన స్ఫూర్తిని పొందవచ్చు. అదీ పొందాలీ అనుకుంటే.
కష్టపడకపోతే ఏమౌతుందిలే? అని ఫీలవ్వకు. అంతకన్నా సిగ్గు చేటు మరొక్కటి లేదు. అలా కష్టపడకపోతే కొన్నేళ్లకు నీమీదే నీకు గౌరవం పోతుంది. ఇది గుర్తు పెట్టుకో.
నేను భూమి గుడ్రంగా ఉందన్నాను. లేదు బల్లపరుపుగా ఉందని మీరు అన్నారు. నేను అతను మంచివాడు అని అన్నాను. వెంటనే మీరు అతను మీకు మంచివాడిలా కనిపిస్తున్నాడా? ఎంత అమాయకంగా ఉన్నారు. అతను చెడ్డతనానికి కేరాఫ్ అడ్రస్ లాంటి వాడు అని అన్నావు. నేను ఆనందం చేసే పనిలో ఉంది అని అన్నాను. మీరు డబ్బు లేకపోతే అసలు ఆనందమే లేదు..అని అన్నారు. జీవితాంతం మనకు, ఎదుట వ్యక్తి కి మధ్య కొనసాగే సంఘర్షణ ఇది.
అభిప్రాయాలు, గోడకు కొట్టే బంతిలా వెంటనే వచ్చే కౌంటర్ అభిప్రాయాలు, వాదనలు వీటితోనే జీవితం సరిపోతుంది. ఎంత మానసిక విలువలు తగ్గిపోతుం టాయో అర్థం కానంతగా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. మన దృష్టిలో ఒక్కటే ఉంటుంది. దేన్ని అంత సులభంగా ఒప్పుకోకపోవడం. అవతల వ్యక్తి కరెక్ట్ అంటే మనం తప్పూ అని అనాలి. కొన్ని సార్లు ఎలాగైనా అవతలి వ్యక్తి నోరు మూయించాలి. మనకెందుకులే అంటూ సైలెంట్‌గా అవతలి వ్యక్తి కూర్చుండిపోవాలి. అప్పుడు మనకు విజయగర్వం కదా!.
motivation: సొంత వ్యక్తిత్వం లేనట్టు!
ఈ అభిప్రాయాలు, మనం అనుకుంటున్న లౌకిక జ్ఞానం నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు. దురదృష్టవశాత్తు మనం నిరంతరం మన అభిప్రాయాలే సరైనవని వాటిని నెగ్గించుకోవడం కోసం పూర్తిగా మెంటల్ రిసోర్స్ ను వృథా చేస్తూనే ఉంటాం. నువ్వు చెప్పినది కరెక్టే అనడానికి మనకు అహం అడ్డు వస్తుంది. నోరు తెరిచి మనం వాదించకపోతే మన అస్తిత్వం అవతల వ్యక్తి అభిప్రాయంలో కొట్టుకుపోతుందని ఓ భయం. అవతలి వ్యక్తి మాట్లాడిన దాంట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ, ఒక మాట అనాల్సిందే. నువ్వు బాగానే చెప్పావు కానీ, అంటూ ఓ వంక పెట్టాలి. అప్పుడు గానీ నాకు ఒక అభిప్రాయం ఉంది అని సిగ్నల్ ఇచ్చినట్టు సంతృప్తి కలుగుతుంది. ఈ కానీలు, అనాలు మాట్లాడకపోతే, ఎదుట వ్యక్తి చెబుతున్పప్పుడు బుద్ధిగా తలూపుతూ కూర్చుంటే, సొంత వ్యక్తిత్వం లేనట్టు ఓ తప్పుడు ఇమేజ్ సమాజంలో నిర్మింప బడుతుంది.
Motivational Content: నిజంగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడేవాడు, నిజంగా తన మాటలతో అవసరం లేనప్పుడు మౌనంగా తలవంచుకుని కూర్చునేవాడు ముఖ్యంగా అభిప్రాయాల యుద్ధంలో కొట్టుకుపోని వాడు, జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడుపుతూ ఉంటాడు. వాడికి తెలుసు జీవితం తనకు కల్పించిన అభిప్రాయాలు, ఆ పరిస్థితులు, విశ్లేషనాత్మక శక్తి అనుభవం వంటి అనేక అంశాల మీద ఆధారపడి అవి ఎప్పుడూ 100 % కరెక్టు కాకపోవచ్చనేది కాస్త అటూ ఇటూగా ఉంటాయనేది వాడికి తెలుసు.


మనకు ఉన్న అభిప్రాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడటానికి మించిన త్యాగం, పరిపక్వతత జీవితంలో ఏదీ లేదు. ఇదంతా చదవిని తర్వాత కూడా మీకు కానీ? అనే పదం కాస్త వెనుకడుగు వేసిందటావా?
ఒక్కోక్కసారి ఈ జీవితం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం మేస్తుంది. అసలు మన వ్యక్తిగత లైఫ్ ఏమిటి? మనం మానసికంగా ధృఢంగా ఉన్నామా? మన వాదనల సమయాన్ని ఎక్కడ వృథాగా ఖర్చుపెడుతున్నాం? మన గమ్యం ఎక్కడికి అని అనేవి ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నాయి.
మనిషికి అతి గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది జీవితం మాత్రమే!
ఒక్కసారి నీ ఆలోచనలను హైలెవల్లో పెట్టుకుంటే అద్భుతాలు చేయగలవు! మనకు అర్థం కావడం లేదు కానీ, రోజులో ఏళ్లు, జీవితం గడిచిపోతుంది.
Motivation:ఏదో బతకాలి కాబట్టి!
శారీరకంగా బలంగా ఉన్నాం!
మానసికంగా స్థిరంగా ఉన్నాం!!
మనం ఏం చేయాలో, ఏం సాధించాలో ఎక్కడా కూడా క్లారిటీ ఉండదు. ఎక్కడ లేని చెడు అలవాట్లు అన్నీ ప్రక్కన పెట్టుకొని ఇంత గొప్ప జీవితాన్ని అసలు క్వాలిటీనే లేకుండా, ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నామా? అసలు రోజు తెల్లవారుతుందో, ప్రొద్దుగూకుతుందో రోజంతలో మనం ఏం సాధించాము? అనేది ఏమైనా అర్థమవుతుందా? ఒక్కాసారైనా మనలో మనం ఎప్పుడైనా తొంగి చూసుకుంటున్నామా? పరిశీలించుకో! మనల్ని మనం నిరంతరం పదును పెట్టుకోకపోతే ఎవరో వచ్చి చెబుతారనేది ఒట్టి కల.
మంచి ఆలోచనలు చేయమని!
మంచిగా ఉండమని!
మంచి అలవాట్లు అలవర్చుకోమని!
ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు మనకు చెప్పాలిందేనా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు లోకంలో ఏది మంచి? ఏది చెడు అని తెలిసి కూడా ఎందుకు ఫాలో కాము. ఒక్కటి మాత్రం నిజం. మన జీవితం ఎలా ఉండాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మంచి ఆలోచనలతో పనులు మొదలు పెడితే దాని ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. వచ్చి తీరాల్సిందే! అన్నీ నాకు తెలుసులే.. అని బద్ధకిస్తే మాత్రం దాని ఫలితం దానికే ఉంటుంది. ఆలోచించు మిత్రమా!
ఇది చదవండి: చిగురించిన ప్రేమ చివరికి ఏమైంది?లవ్ స్టోరీ