ice cubes for face వేసవిలో చర్మానికి తాజాదనాన్ని చల్లదనాన్ని సాంత్వనను ఇచ్చేందుకు ఐస్ముక్కలను చక్కగా ఉపయోగించుకోవచ్చు. మేకప్ చేసుకునేటప్పుడు ఐసు ముక్కలను ప్రైమర్గా వాడుకోవచ్చు. మేకప్ వేసుకోవడానికి ముందు ముఖమంతా ఐసుముక్కతో ముఖాన్ని సున్నితంగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తాజాగా మారుతుంది. మేకప్ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

రక్తప్రసరణ సక్రమంగా(ice cubes for face) జరిగేందుకు!
ముఖానికి స్క్రబ్లను వాడినప్పుడు చర్మగ్రంథులు తెరుచుకుని అలానే ఉండిపోతాయి. అప్పుడు ఐసుముక్కలతో చర్మంపై సున్నితంగా రాయాలి. దీంతో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. ముడతలూ, యాక్నే తగ్గుముఖం పడతాయి. ఒక్కోసారి నిద్ర ఎక్కువైనప్పుడు ఇతరత్రా కారణాల వల్ల కళ్లు ఉబ్బినట్టుగా అవుతాయి. ఐసుముక్కలతో ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందవచ్చు. కళ్ల చుట్టూ ఐస్ముక్కలతో సున్నితంగా రాస్తే కళ్ల చుట్టూ ఉబ్బిన చర్మం సాధారణ స్థితికి వస్తుంది.

చర్మం ఉత్తేజమవుతుంది!
చర్మం కందిపోయినప్పుడు ఐసుముక్కలతో మెల్లగా రాసుకుంటే ఎరుపుదనం తగ్గి తేటపడుతుంది. ఎండలో బాగా తిరిగి వచ్చినప్పుడు పరిశుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో ఐసు ముక్కలు వేసి రాసుకుంటే అలసిన చర్మం ఉత్తేజితమవుతుంది. కమలాఫలం రసానికి కొద్దిగా నీళ్లు చేర్చి ఐస్ ట్రేలలో వేసి ఫ్రిజ్లో పెట్టాలి. గడ్డకట్టిన తర్వాత ముక్కలతో ముఖంపై సున్నితంగా రాయాలి. తరువాత పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మం చక్కటి నిగారింపును సంతరించుకుంటుంది. కమలారసంతో తయారైన ఈ ఐసుముక్కలు సహజ క్లెన్సర్లుగా పనిచేస్తాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ