I TDP Meeting | ఆంధ్రప్రదేశ్లోని టిడిపిలో జోష్ పెరిగినట్టు ఉంది. ప్రతిపక్ష పార్టీలో ఉన్న టిడిపి వైసీపీ ప్రభుత్వంను ధీటుగా ఎదుర్కొంటూ ఎక్కడిక్కడ ప్రజా సమస్యలపైన, అక్రమ అరెస్టులపైన, అమరావతి రాజధానిపైన సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో పెట్టిన ఐటీడీపీ(I TDP Meeting) కార్యక్రమం సక్సెస్ అయ్యింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా 6 వేలకు మందికి పైగా కార్యకర్తలు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు.
ఒక్కసారిగా పార్టీ కార్యకర్తలను, యువతను చూసిన అధినేతకు, ముఖ్య నాయకులకు ఉత్సహం రెట్టింపు అయ్యిందని చెప్పవచ్చు. దీంతో ప్రసంగాలు కూడా పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా చేశారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటిడిపి కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఐటిడిపి నా మానసిక పుత్రిక అని సంబోంధించడంతో కుర్రాళ్లు ఈలలు కేకలతో ప్రాంగణం మారుమ్రోగింది.

ఇక ఈ ప్రసంగాల్లో రోటీన్ కు భిన్నంగా జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలతో సెటైరికల్ గా సాగడందో యువ కార్యకర్తలు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. 2019 సంవత్సరంలో టిడిపి ఓటమి తర్వాత ఇంత సంఖ్యలో కార్యకర్తలు హాజరవ్వడం అంతే ఉత్సాహంగా సంతోషంగా చంద్రబాబు ప్రసగించడంతో పరిసర ప్రాంతం మహానాడును తలపించింది. అధినేత తో ఫొటోలో దిగేందుకు కార్యకర్తలు విఫలయత్నం చేశారు. మొత్తంగా రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం వెనుక యువ నాయకుల కృషి ఉండే అవకాశం లేకపోలేదు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!