Core Web Vitals Assessment: Kerala Mayor : నాకే ఎందుకు సెల్యూట్ చేయ‌డం లేదు?

Kerala Mayor : నాకే ఎందుకు సెల్యూట్ చేయ‌డం లేదు?

Kerala Mayor : పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేస్తానంటున్న న‌గ‌ర మేయ‌ర్‌!


Kerala Mayor : ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో అధికార యంత్రాంగం మ‌ధ్య ప్రోటోకాల్ నిబంధ‌న‌లు ఎంతో కీల‌కం. అయితే పోలీసులు త‌న‌ను గౌర‌వించ‌డం లేదంటూ కేర‌ళ‌లోని త్రిస్సూర్ న‌గ‌ర మేయ‌ర్ ఎంకే వ‌ర్గీస్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పోలీసులు త‌న‌ను చూసి కూడా సెల్యూట్ చేయ‌డం లేద‌ని వ‌ర్గీస్ ఆరోపిస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న కేర‌ళ పోలీసు బాస్ అనిల్ కాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొ నేందుకు తాను వాహ‌నంలో వెళుతుండ‌గా, పోలీసులు త‌న‌ను గుర్తించి కూడా సెల్యూట్ చేయ‌లేద‌ని వ‌ర్గీస్ వాపోయారు. తాను వ్య‌క్తిగ‌త సెల్యూట్ కోరుకోవ‌డం లేద‌ని, త‌న ప‌ద‌విని గుర్తించి గౌర‌వించాల‌ని కోరుతున్నాన‌ని వెల్ల‌డించారు. కార్పొరేష‌న్ ప‌రిధిలో ప్రోటోకాల్ ప‌రిశీలిస్తే గ‌వ‌ర్న‌ర్‌, సీఎం త‌ర్వాత స్థానంలో మేయ‌ర్ ఉంటార‌ని వ‌ర్గీస్ వివ‌రించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు సెల్యూట్ కొడుతున్న పోలీసులు త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ గ‌ర్హ‌నీయం అని పేర్కొన్నారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ అనిల్ కాంత్‌ను కోరారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *