Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం తెలంగాణ‌లో 1,400 కోట్ల రూపాయ‌ల భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మంత్రి కె.తార‌క‌రామారావుతో Davosలోని తెలంగాణ పెవిలియ‌న్‌లో Hyundai Company సీఐఓ యంగ్చోచి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న Mobility క్ల‌స్ట‌ర్‌లో ఈ పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్టు తెలిపింది.

పెట్టుబ‌డితో పాటు భాగ‌స్వామిగా!

కేవ‌లం పెట్టుబ‌డి పెట్ట‌డ‌మే కాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న Telangana మొబిలిటీ వ్యాలీలో భాగ‌స్వామిగా ఉండేందుకు సంస్థ అంగీరించింది. ఈ పెట్టుబ‌డితో త‌మ కంపెనీ టెస్ట్ ట్రాక్‌ల‌తో పాటు ఇకో సిస్ట‌మ్ అవ‌స‌రం అయిన ఇత‌ర మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపింది.దీంతో పాటు తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేసేందుకు ఉన్న ఇత‌ర అవ‌కాశాల‌పైన కూడా విస్తృతంగా చ‌ర్చించారు.

మంత్రి కేటీఆర్‌తో మాట్లాడుతున్న కంపెనీ బృందం

తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హుండై పెట్టుబ‌డి గొప్ప బ‌లాన్ని చేకూర్చుతుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్ర‌త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలిని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని, ఇందులో భాగ‌స్వామిగా ఉండేందుకు ముందుకు వ‌చ్చిన హ్యుండై కి మంత్రి KTR ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ‌లో 1400 కోట్ల రూపాయ‌ల భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చిన హ్యూండై కంపెనీకి సంపూర్ణ స‌హ‌కారం అందిస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. Hyundai Company రాక‌తో తెలంగాణ రాష్ట్రంలో మ‌రిన్ని Investments మొబిలిటీ రంగంలో వ‌స్తాయ‌న్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *