Hydroponic Farming: మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ చరిత్రలో హైడ్రోఫోనిక్స్ విధానంలో పంట సాగు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది. ఈ హైడ్రోఫోనిక్స్ విధానం ద్వారా స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ కొందరు రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో కొత్తిమీర పంట(coriander farming) ద్వారా అధిక లాభాలు పొందడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం ఇప్పుడు తెలుసుకుందాం!.
Hydroponic Farming: ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం సాగు చేస్తూ కొందరు లాభాలు బాట పడుతున్నారు. ఈ సాగులో ఎలాంటి చీడపీడల బెడద లేకుండా లాభసాటిగా ఆకుకూరలు పెంపకం ఇప్పుడు సుళువుగా మారిందనే చెప్పుకోవచ్చు. హైడ్రోఫోనిక్ విధానంలో వ్యవసాయాన్ని ఇప్పుడు కొంత పుంతలు తొక్కిస్తున్నారు. గ్రీన్ చైన్ నెట్ కింద పైపుల మీద కేవలం భూమికి మూడు అడుగుల ఎత్తులో కొత్తమెర సాగుచేస్తున్నారు. ఈ విధానంలో ముందుగా కోకోపిట్(Cocopeat)ను ఆర్.ఓ వాటర్‌తో తడుపుతారు. అనంతరం కోకోపిట్‌ను ట్రేలల్లోకి నింపి కొత్తిమీర విత్తనాలను పెడతారు. ఎప్పటికప్పుడు కోకోపిట్‌ను ఆర్.ఓ వాటర్‌తో తడుపుతుంటారు. ఇలా 10 రోజుల తర్వాత కోకోపిట్‌ను ప్లాస్టిక్ పైపుల్లోకి మారుస్తుంటారు.
ఈ పంట సాగు విధానంలో బోరు నీటి బదులు ఒక 40 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్‌ను తయారు చేసి అందులో ఆర్.ఓ వాటర్‌ను పంపడంతో పాటు కొన్ని రకాల న్యూట్రీయన్స్ను కలుపుతుంటారు. ఈ ఆర్.ఓ వాటర్‌ను 24 గంటల పాటు మొక్కలను పంపుతుంటారు. ఆర్.ఓ(Reverse osmosis water) వాటర్‌ను పంపే విధంగా పైపులను ఏర్పాటు చేస్తారు. ఇలా మొక్కలు వినియోగించుకోగా మిగిలి ఉన్న ఆర్.ఓ వాటర్ వృథా కాకుండా మళ్లీ ట్యాంక్‌కు మళ్లిస్తుంటారు. ఈ మొక్కలకు అందించే వాటర్‌లో పి.హెచ్ లెవల్స్ సుమారు 6 ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఈ కొత్తమీర సాగు ఉన్న భూమిని బట్టి, మనకు ఉన్న పరికరాలను బట్టి అర ఎకరంలో గానీ అంతకుపైగా గానీ ఉన్న భూమిలో సాగు చేసుకోవచ్చు. ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో కొత్తిమీర పంట 20 రోజుల్లో చేతికి వస్తుంది. కొత్తిమీర పంట పైపుల ద్వారా సాగు చేయడంతో పాటు దాని కింద ఏదైనా ఆకుకూరలను సాగు చేయవచ్చు.


హైడ్రోఫోనిక్ ప్రయోజనాలు:
1. హైడ్రోఫోనిక్స్ విధానం వల్ల పంట చేతికి తర్వగా వస్తుంది.
2.అలాగే విత్తనం వేసిన ప్రారంభం నుండి మొక్క పెద్దది అయ్యే వరకు వాటికి కావాల్సిన
పోషకాలను క్రమ పద్ధతిలో ఇవ్వవచ్చు.
3.ఈ హైడ్రోఫోనిక్స్ విధానంలో ఏ పంట నైనా పండించవచ్చు.
4.పైపుల ద్వారా పండించే పద్ధతిని ఎన్.ఎఫ్.టి అంటారు.
5.రెండు ఎకరాల్లో పండించే పంటను ఈ విధానం ద్వారా కేవలం అర ఎకరంలోనే పండించవచ్చు.
6.ఇలాంటి పద్ధతిలో సాగు ద్వారా ప్రకృతి వైపర్యిత్యాల భారిన పడకుండా ఉండవచ్చు.
7.90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. లాభాల విషయానికి వస్తే 3 రెట్లు అధికంగా ఉంటుంది.
8.సహజంగా పండిన పంట కావడంతో మార్కెట్లో ఈ పంటకు మంచి డిమాండ్ కూడా ఉంటుందట.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!