Hyderabad Drug Case హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వ సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకై 24 గంటల్లో మరో యాక్షన్‌ప్లాన్ రెడీ చేయనుంది. డ్రగ్స్ కేసుల విషయమై సీఎం కేసీఆర్(CM KCR) అధికారులతో ప్రత్యేక సమవేశం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ నియంత్రణకు కొత్త చట్టం కోసం ముసాయిదా రూపొందించే చాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 1100 మందితో డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు(Hyderabad Drug Case) సమాచారం.
అమ్మేవాడు..కొనేవాడు ఉండొద్దు!
అసలు అమ్మేవాడు..కొనేవాడే లేకుండా చేయాలనే విధంగా నగరంలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే చంచల్గూడలోని రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని కస్టడీలోకి తీసుకోవాలని రాష్ట్ర పోలీసు అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే రేపు టోనీని కస్టడీలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టోనీని కస్టడీలోకి తీసుకొని 5 రోజుల పాటు విచారించనున్నారు పంచాగుట్ట పోలీసులు.
బడా వ్యాపారులను ఎలా విచారించాలి?
ఈ కేసు విచారణలో టోనీని గాని మిగిలిన బిజినెస్ మ్యాన్లను విచారించడానికి నాంపల్లి కోర్టు ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయమై రాష్ట్ర పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. అమ్మిన వారిని..కొన్న వారిని కలిపి విచారిస్తే ఇంకా మరికొన్ని వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే వారిని విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసులో మొత్తం 34 మంది బడా వ్యాపారులకు లింక్ ఉన్నట్టు తేలిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ వ్యాపారులు డ్రగ్స్ వాడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రాష్ట్ర పోలీసుల విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వలేదు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!