hyderabad crime news: హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక చివరకు అనుమానస్పదరీతిలో మృతి చెందిన సంఘట వెలుగు చూసింది. దీంతో ఈ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన (hyderabad crime news)కొనసాగిస్తున్నారు.
చంపాపేట నుంచి సాగర్ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు బాధితుల ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. వారిని సముదాయించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా ఆందోళనకారులు, బాధిత కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. ఆందోళన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.
ఈ ఘటనలో నిందితుడిగా భావిస్తున్న రాజు పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. మరో వైపు ఆందోళన కారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, డీసీసీ రమేష్ రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బెల్టు షాపులు, గుడుంబా లేకుండా చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీసీసీ రమేష్ రెడ్డి తెలిపారు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!