Core Web Vitals Assessment: huzurabad by election 2021: ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌? కేసీఆర్ నీడ గా హ‌రీ

huzurabad by election 2021: ఏం జ‌రుగుతోంది అక్క‌డ‌? కేసీఆర్ నీడ గా హ‌రీష్‌రావు డైరెక్ష‌న్‌!

huzurabad by election 2021: తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఇక మేన‌ల్లుడు మంత్రి హ‌రీశ్‌రావు ద్వారా మంత్రాంగం నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. రోజూ స‌ర్వే నివేదిక‌లు నేరుగా పార్టీ నేత‌ల‌తో సీఎం మంత‌నాలు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు పిలిపించి చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఓ ఇన్‌ఛార్జి ఆ దిశ‌గా యోచిస్తున్న పార్టీ అధినేత ఇటు రాష్ట్రంపైనా ఫోక‌స్ పెట్టిన‌ట్టు ఉన్నారు. ఉద్యోగ ఖాళీల‌పై అత్య‌వ‌స‌ర స‌మీక్ష లో భాగంగా హెచ్ఆర్‌డీలో శాఖల వారీ ప‌రిశీలిస్తున్నారు.


huzurabad by election 2021: ఇప్పుడు రాష్ట్రం మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పైనే ఆస‌క్తిగా ప‌రిశీలిస్తోంది. నేరుగా హుజూరా బాద్ నియోజ‌క‌వ‌ర్గం, జిల్లా ముఖ్య నేత‌ల‌ను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టిఆర్ఎస్‌కు రాజీనా మా చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దానికి కూడా రాజీనామా చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీసి ఉప ఎన్నిక వ‌చ్చేలా చేశారు.

బీజేపీ పార్టీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. అదే స‌మ‌యంలో టిఆర్ఎస్ నేత‌లు ప‌లువురు అక్క‌డ మోహ‌రించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను ఇన్‌ఛార్జిగా మంత్రి హ‌రీశ్‌రావుకు అప్ప‌గించారు. అప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి వివిధ మార్గాల ద్వారా తన‌కు అందుతున్న స‌మాచారాన్ని సీఎం విశ్వేషిస్తున్నారు. ప‌లు స‌ర్వే సంస్థ‌లు, ఇంటెలి జెన్స్ విభాగం నుంచి రోజువారీగా అందుతున్న నివేదిక‌ల ఆధారంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను ఖ‌రారు చేస్తున్నారు. ఈ మేర‌కు అక్క‌డ చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు మంత్రి హ‌రీశ్‌రావును ఆయ‌న అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.

ఈ రోజు ఏం చేశాం. రేపు ఏం చేయాలి? అనే దిశ‌గా ట్రిపుల్‌ షూట‌ర్ మంత్రి హ‌రీశ్‌రావు త‌న‌కు ఉన్న అనుభ‌వాన్ని జోడించి, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేస్తున్న పార్టీ నేత‌ల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. చెప్పిన ప‌ని చేస్తున్నారా? క‌లవాల్సిన‌ వారిని క‌లుస్తున్నారా? అనే విష‌యాల‌ను ఆయ‌న ఆరా తీస్తున్నారు. ఈ ఉప ఎన్నిక‌తో క్ష‌ణం తీర‌లేకుండా పార్టీ నేత‌లంతా అక్క‌డే మ‌కాం వేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు మంత్రి హ‌రీశ్‌రావు ఆధ్వ‌ర్యంలో ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తూనే, మ‌రోవైపు సొంత పార్టీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుదుర్చుతున్నారు.

సోష‌ల్ మీడియా, కుల సంఘాలు, మ‌హిళా సంఘాలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా ఒక్కో విభాగం వారీగా పార్టీ ముఖ్య‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ప్రాంతాల వారీగా బాధ్య‌లు ఈట‌ల రాజేంద‌ర్ కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌కి గురైన‌ప్ప‌టికీ నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ త‌ర‌పున ఇన్‌ఛార్జి లుగా ప‌నిచేస్తున్న క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్ సునీల్ రావు, ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌రావు, శాత‌వాహ‌న అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మ‌న్ జీవి రామ‌కృష్ణారావును కొన‌సాగించ‌డంతో పాటు, హుజూరా బాద్ ప‌ట్ట‌ణ బాధ్య‌త‌ల‌ను ప్ర‌త్యేకంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌కు అప్ప‌గించారు. నియోజ‌క‌ వ‌ర్గంలోని జ‌మ్మికుంట ప్రాంత బాధ్య‌త‌ను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, ఎమ్మెల్యేలు పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డికి వీణ‌వంక‌, ఆరూరి ర‌మేష్‌కు ఇల్లందు కుంట‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డికి క‌మ‌లాపూర్ ప్రాంత బాద్య‌త‌లు అప్ప‌గించారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ పార్టీ త‌ర‌పున విద్యార్థి, యువ‌జ‌న విభాగాల‌తో పాటు, సోష‌ల్ మీడియా ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వీరంతా సీఎం కేసీఆర్ నుంచి వ‌యా మ‌త్రి హ‌రీశ్‌రావు ద్వారా అందుతున్న ఆదేశాల‌కు అనుగుణంగా క్షేత్రంలో ప‌నిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల్సిన పార్టీ నేత‌ల సంఖ్య‌ను మ‌రింత పెంచే క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ప్ర‌తి 50 మంది ఓట‌ర్ల‌కు ఒక ఇన్‌ఛార్జిని పెట్ట‌బోతున్నారు. ఈ ప్ర‌క్రియ ఒక‌వైపు కొన‌సాగుతుండ‌గానే, టీఆర్ఎస్ చీఫ్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ ముఖ్యుల‌ను త‌న వ‌ద్ద‌కు పిలిపించుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బండ శ్రీ‌నివాస్‌, క‌రీంన‌గ‌ర్ జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ విజ‌య భ‌ర్త క‌నుమ‌ల్ల గ‌ణ‌ప‌తి త‌దిత‌రులు శుక్ర‌వారం సీఎం కేసీఆర్ ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. నియోజ‌క‌ వ‌ర్గంలోని ప‌రిస్థితుల‌పై కేసీఆర్ ఆరా తీశారు. ఇక‌పై వారు చేయాల్సిన ప‌నుల‌పై దిశానిర్థేశం చేశారు. రెండు రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు మండ‌లాల జ‌డ్పీటీసీ స‌భ్యులు, ఎంపీపీలు, మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్‌లు ,ఇత‌ర ముఖ్య నేత‌ల‌ను పిలిపించుకొని మాట్లాడాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఈట‌ల‌పై సానుభూతి త‌గ్గింద‌ని అంచ‌నా వేస్తున్నారు గులాబీ నేత‌లు. బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో మొద‌ట ఉన్నంత సానుభూతి ఇప్పుడు లేద‌ని, కొంత త‌గ్గింద‌ని టిఆర్ఎస్ ముఖ్య‌లు అంచ‌నా వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ వ‌ల్ల‌నే జ‌రిగాయ‌నే అభిప్రాయాన్ని తాము ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్తు న్నామ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ, ప్ర‌భుత్వంలో ఎంతో ప్రాధాన్యం క‌ల్పించినా, సీఎం కేసీఆర్‌కు ఈట‌ల ద్రోహం చేశార‌ని వివ‌రిస్తున్నారు. ఈట‌ల‌ను మ‌ళ్లీ గెలిపిస్తే, విప‌క్షంలో ఉండి ఏమీ చేయ‌లేర‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి, సంక్షేమం కొన‌సాగాలంటే ప్ర‌భుత్వం వైపు ఉండాల‌ని గులాబీ పార్టీ ముఖ్య‌నేతలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ళి చెబుతున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *