human different characters: ఇవి కేవ‌లం మ‌నుషుల‌కే సాధ్యం.. మ‌న‌ల్నీ గ‌మ‌నించే ఉంటారులే!

0
9

human different characters ఎవ‌రైనా కొత్త వ్య‌క్తులు తార‌స‌ప‌డితే వాళ్ల‌ని ప‌రిశీలించ‌డం చాలా మందికి అల‌వాటు క‌దా!. మ‌నం కూడా అప్పుడ‌ప్పుడు ఎక్క‌డో ఒక చోట ఎవ‌రినైనా ప‌రిశీలిస్తూనే ఉంటాం. రైల్వే స్టేష‌న్‌, బ‌స్ స్టేష‌న్‌, మార్కెట్‌, ఆసుప‌త్రి ఇలా ఎక్క‌డికి వెళ్లినా ఏం చేస్తున్నా అదే ప‌ని. ఆ ప‌రిశీల‌న‌లో ఎన్ని అనుభ‌వాలో. కొంత మందిని చూడ‌గానే ఒక విధ‌మైన స్నేహ‌భావం క‌లుగుతుంది. ఇంకొంత‌మందిని చూస్తే అబ్బ వీళ్ల‌ని వీళ్ళ కుటుంబ స‌భ్యులు ఎలా భ‌రిస్తున్నారా? (human different characters)అనిపిస్తుంది.

ర‌క‌ర‌కాల మ‌నుషులు, ర‌క‌రకాల మ‌న‌స్త‌త్వాలు. ముఖ్యంగా ప్ర‌యాణంలో ఇలాంటివి ఎక్కువుగా జ‌రుగుతుంటాయి. ప్ర‌యాణంలో ఇది ఓ మంచి కాల‌క్షేపం కూడా. ఎవ‌రైనా కొత్త వ్య‌క్తితో ప‌రిచ‌యం అయిన‌ప్పుడు కూడా ఎక్కువుగా వాళ్ళ ప్ర‌వ‌ర్త‌న మీదే దృష్టి పెడుతుంటాం. చెప్పేది శ్ర‌ద్ధ‌గా వింటు న్నారా? లేదా? మాట్లేడ‌ట‌ప్పుడు ముఖ‌క‌వ‌ళిక‌లు ఎలా ఉంటున్నాయి? ఇవ్వ‌న్నీ గ‌మ‌నిస్తుంటాం. ఇక ఒక అంచ‌నాకు వ‌చ్చేస్తుంటాం.

ఓ మ‌నిషి ముఖ క‌వ‌ళిక‌లు, మాట‌తీరు, న‌డ‌క‌, ఓ గంట ప‌రిశీలిస్తే చాలా ఆ మ‌నిషి స్వ‌భావం ఎలాంటిదో చూసేవారు ఒక అంచ‌నాకు వ‌స్తారు. దీనికి కావాల్సింది కాస్తంత ప‌రిశీల‌నా దృష్టి మాత్ర‌మే. మ‌నం చేసే ప్ర‌తి ప‌ని మ‌న వ్య‌క్తిత్వాన్ని ప్ర‌తిబింబిస్తుంది. కూర్చోవ‌డం, నించోవ‌డం, న‌డ‌వ‌డం, తిన‌డం, మాట్లాడే ట‌ప్పుడు చేతులు ఆడించే విధానం, ముఖంలోని హ‌వ‌భావాలు, తెలియ‌కుండానే త‌ల ఓ ప్ర‌క్క‌కు ఒరిగిపోవ‌డం, ఇలా ప్ర‌తి ప‌నీ, ప్ర‌తి క‌ద‌లికా వ్య‌క్తిత్వాన్ని ఎదుటి వాళ్ళ‌కు ప‌ట్టిస్తాయి. ఇవి అనుకుని చేసే ప‌నులు కావు, అసంక‌ల్పితంగా చేసేవే.

అలాగే మ‌నుషుల ప్ర‌వ‌ర్త‌న‌ను ఒక్కోసారి జంతు ల‌క్ష‌ణాల‌తో పోల్చ‌డం కూడా ప‌రిపాటి. ఎలాగంటే పులి లాంటి చూపు, మ‌గ‌వారినైతే సింహం లాంటి న‌డ‌క అని, ఆడ‌వారిని హంస న‌డ‌క అని, చిలుక ప‌లుకులు, న‌క్క విన‌యం, లేడిలా ప‌రిగెత్త‌డం, అలా మ‌నుషుల ముఖ‌హావభావాలు, ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి కొన్ని జంతువుల‌తో కొంద‌రు పోల్చిన పోలిక‌లు చూడండి.

  • బిగుసుకున్న ద‌వ‌డ‌లు, గంభీర‌మైన ముఖం, తీక్ష‌ణ‌మైన చూపు, వేగ‌వంత‌మైన క‌ద‌లిక‌లు, అప్ర‌మ‌త్త‌త‌, రాజ‌సం ఉట్టిప‌డే న‌డ‌క‌- పులి.

  • గంభీర‌మైన ఆకారం, కంచు కంఠం, భార‌మైన న‌డ‌క‌, ప్ర‌తిదానికి ఇత‌రుల మీద ఆధార‌ప‌డ‌టం- సింహం.

  • చురుక్కుమ‌నిపించే చూపులు, వేగ‌వంత‌మైన క‌ద‌లిక‌లు, అప్ర‌మ‌త్త‌త‌-చిరుత‌.

  • భారీ ఆకారం, భీక‌ర‌మైన కంఠం, మంద్ర‌మైన న‌డ‌క‌- ఏనుగు.

  • లొడ‌లొడా మాట్లాడ‌టం, వేగ‌వంత‌మైన ప‌రుగు, విశ్వాసంగా ఉండ‌టం, తీక్ష‌ణ‌మైన ప‌రిశీల‌న‌- కుక్క‌.

  • అప్ర‌మ‌త్త‌త‌, త‌త్త‌ర‌ప‌డే చూపు, నాజూకుగా ఉంటూనే వేగం- లేడి.
Latest Post  Calvary Temple Hospital: సక‌ల సౌక‌ర్యాల‌తో క‌ల్వ‌రి టెంపుల్ ఆసుప‌త్రి యొక్క‌ విశేషాలు!

  • అతి విన‌యం, కీచు గొంతు, దొంగ‌చూపులు, డొంక తిరుగుడు మాట‌లు -న‌క్క‌.

  • దొంగ చూపులు, ప‌క్క చూపులు, నిల‌కడ లేని మాట – పిల్లి.

  • ప‌ళ్లికిలిస్తూ మాట్లాడ‌టం, అన‌వ‌స‌ర‌మైన హావ‌భావాల ప్రద‌ర్శ‌న – కోతి.

  • శ్రావ్య‌మైన గొంతు, సుతిమెత్త‌ని న‌డ‌క‌- చిల‌క‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here