Human Behaviour 2022: చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు.
మనిషి ఎక్కడున్న ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది (18) ఉన్నాయట.అవి నాలుగు వేదాలు(vedas), పంచ భూతాలు, అంతరాత్మ ధర్మరం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షనం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు. కానీ వీటి గమనిక నుండి మనిషి (Human Behaviour 2022) తప్పించుకోవడం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థౄలు రహస్యయంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి.
మనం చేసే ప్రతి చెడు పనులను అవి పరిశీలిస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరు జన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడతాయి. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం.
Human Behaviour 2022: అంతరాత్మ ఒకటుంది!
మనలో అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డతా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అనర్థాలకు దారి తీయడం మనందరికీ అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ(Soul) నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము.


అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగడం వివేకం. నలుగురికీ తెలిసేలా దాన ధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్నా కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్లు చూస్తున్నట్టేగా అర్థం. ఈ విషయం ఎరిగి తెలిసినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయడానికి తెగించడు.
ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్ సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి(Human Behaviour 2022) సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖ శాంతులకు నోచుకుంటాడు.