Huge Explosion

Huge Explosion : క‌డ‌ప‌జిల్లాలో ఘోర ప్ర‌మాదం..ముగ్గురాళ్ల‌లో పేలుడుకు 10 మంది మృతి

Andhra Pradesh
Share link

Huge Explosion : క‌డ‌ప జిల్లాలో ఘోర పేలుడు ప్ర‌మాదం సంభవించింది. ముగ్గురాయి క్వారీలో జ‌రిగిన బాంబు పేలుళ్ల‌లో భారీ ప్రాణం నష్టం చోటుచేసుకుంది. ఘ‌ట‌నా స్థ‌లం భ‌యాన‌క దృశ్యాన్ని త‌ల‌పిస్తుంది.


Huge Explosion : క‌డ‌ప జిల్లాలో శనివారం ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్ల‌ప‌ల్లి ముగ్గురాళ్ల గ‌నిలో పేలుడు ప‌దార్థాల బ్లాస్టింగ్ సంభ‌వించింది. ముగ్గురాళ్లు వెలికితీసే క్ర‌మంలో బొలెరో వాహ‌నంలో పేలుడు ప‌దార్థాలు త‌ర‌లిస్తుండ‌గా గుట్ట‌పై బాంబు పేలుడు జ‌రిగింది. బొలెరో వాహ‌నం ఎగిరి ప‌డి కూలీల‌పై పడింది. బొలెరో వాహ‌నం కింద న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. బాంబు పేలుడులో డ్రైవ‌ర్‌, క్లీన‌ర్‌తో పాటు మ‌రికొంత మంది చ‌నిపోయారు. పేలుడు దెబ్బ‌కు కూలీలు డెడ్ బాడీలు చెల్లా చెదురుగా ప‌డిపోయాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో దారుణ‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ముగ్గురాయి గ‌నిలో ప‌నులు కోసం మొత్తం 40 మంది వ‌ర‌కు కూలీలు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. వీరంతా బ‌ద్వేలు, పోరుమామిళ్ల‌కు చెందిన వారిగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు చేరుకున్నారు.

Photos : బాంబు పేలుడులో చెల్లాచెదురుగా ప‌డి ఉన్న మృత‌దేహాలు, బాంబు పేలుడు తీవ్ర‌త‌కు తునాతున‌క‌లైన అంబులెన్స్‌.

See also  School Timetable: ఉద‌యం 8 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌లు! 10 గంట‌ల పాటు క్లాసులు!

Leave a Reply

Your email address will not be published.