how to take care of a child:చిన్నప్పుడే స‌రైన మార్గంలో వంచితేనే.. లేదంటే ఈ కాలం పిల్ల‌లు విన‌రంటే విన‌రు!

how to take care of a childపిల్ల‌ల్ని పెంచ‌డంలో కూడా ఒక ప‌ద్ధ‌తి ఉంద‌నేది మ‌న‌ పెద్ద‌ల నుంచి మ‌నం నేర్చుకున్న ఒక పాఠంగా చెప్ప‌వ‌చ్చు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్ల‌లు మాములు తెలివిగ‌ళ్ల వారు కాదు.. చేతిలో ఫోను పెడితే దాని చిట్టా మొత్తం క్ష‌ణాల్లో తెలుసుకునే మైండ్ ప‌వ‌ర్ వాళ్ల‌కు ఉన్న‌ది. అలా అని మ‌నం వారిని శ‌భాష్ అని త‌ల్లిదండ్రుల క‌నుస‌న్న‌ల్లో పెంచ‌క‌పోతే మాత్రం చాలా ఇబ్బందులు ప‌డే అవ‌కాశ‌మూ లేదు. అందుకనే పిల్ల‌ల పెంప‌కంలో స‌మ‌య పాల‌న‌, నిబంధ‌న‌లు త‌ప్ప‌కుండా వారికి కేటాయించాల‌నేది ప్ర‌తి ఒక్క త‌ల్లితండ్రి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. (how to take care of a child)అది ఎలాగో ఇప్పుడు చ‌ద‌వండి.

ఫ‌లానా స‌మ‌యానికి ప‌డుకోవాలి.. రోజుకు గంట మాత్ర‌మే టీవీ చూడాలి.. అని చెబుతాం. కానీ వారాంతాల్లో, పిల్ల‌ల‌కు సెల‌వులు ఉన్న‌ప్పుడూ ఆ నిబంధ‌న‌ల్ని స‌డ‌లిస్తుంటాం. దీని వ‌ల్ల పిల్లు మీరు పెట్టే నిబంధ‌న‌ల్ని ప‌ట్టించుకోరు. అందుకే స‌మ‌యం, సంద‌ర్భం ఎలాంటిదైనా స‌రే.. మీరు ఓ నిబంధ‌న పెడితే వాళ్లు క‌చ్చితంగా దాన్ని అనురించేలా చూడండి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ స‌డ‌లించ‌కూడ‌దు.

పిల్ల‌ల‌కు విలువైన స‌మ‌యం కేటాయించ‌డం, వారితో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం అనేది మంచిదే. కానీ ఇంట్లో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌ప్పుడు అలా ఒకేసారి స‌మ‌యం కేటాయించ‌డం వ‌ల్ల వాళ్ల‌తో కొన్నిసార్లు స‌ర‌దాగా గ‌డిపిన‌ట్టు ఉండ‌దు. అందుకే అప్పుడ‌ప్పుడూ ఒక్కొక్క‌రికీ కొంత స‌మ‌యం చొప్పున కేటాయించండి. దీంతో పిల్ల‌లు ఆనందిస్తారు. మీ మ‌ధ్య అనుబంధం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకున్నా, ప‌డుకునేప్పుడు కాసేపు పుస్త‌కం చ‌దివినా స‌రిపోతుంది.

కొన్నిసార్లు పిల్ల‌ల‌కు ఏ చిన్న స‌మ‌స్య ఎదురైనా, ఏదైనా ప‌నిచేస్తున్నా వెంట‌నే సాయం చేసేందుకు ముందుంటాం. అది మంచిదే కానీ అన్నిసార్లూ అలా చేయ‌డం వ‌ల్ల వాళ్లు సొంతంగా చేయ‌లేన‌ప్పుడు మాత్ర‌మే అండ‌గా ఉండాలి త‌ప్ప‌, ముందే కాదు. ఇలా వాళ్లంత‌ట వాళ్లు ప‌నులు చేసుకున్న‌ప్పుడు ప్రోత్స‌హించాలి. దానివ‌ల్ల వాళ్ల‌కు ఇంకా ధైర్యం వ‌స్తుంది. లేదంటే వాళ్లు ప్ర‌తిదానికీ త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డ‌టం మొద‌లు పెడ‌తారు.

మా పిల్ల‌లు ఫ‌లానా ప‌దార్థాలు మాత్ర‌మే తింటారు.. అని చాలాసార్లు అంటుంటాం. వాటినే ఎక్కువుగా చేసి పెడ‌తాం కూడా. కానీ ఏళ్లు గ‌డిచే కొద్ది వాళ్లు దానికే అల‌వాటుప‌డి కొత్త రుచుల్ని చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. అందుకే ఎదిగే కొద్దీ ర‌క‌ర‌కాల కొత్త ప‌దార్థాల‌ను వారికి రుచి చూపించాలి. ఆస‌క్తి చూపించ‌క‌పోయినా క‌నీసం రుచి చూడ‌మ‌ని చెప్పాలి. ఒకే ప‌దార్థాన్ని ర‌క‌ర‌కాల రుచుల్లో వారికి చేసి పెట్టాలి.

స‌రైన నియంత్ర‌ణ లేక‌పోతే పిల్ల‌లు అతిగా టీవీ చూడటం మొద‌లు పెడ‌తారు. చిన్న పిల్ల‌లే క‌దా అనుకుంటే ఏళ్లు గ‌డిచేకొద్దీ వాళ్ల‌కు అదే అల‌వాట‌వుతుంది. చ‌దువుకోవ‌డంలో, కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డంలో వెనుక‌బ‌డిపోతారు అని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అందుకే వ‌య‌సేదైనా, ఎంత చిన్న‌వాళ్ళైనా స‌రే ఒక ప‌రిమిత స‌మ‌యం వ‌రికే చూడాల‌ని చెప్పాలి.

Share link

Leave a Comment