remove pimples: మిస్ వరల్డ్, మిస్ ఇండియా ఈ పదాలు, వీటి ప్రాముఖ్యత అందరికీ తెలిసే ఉండొచ్చు. అందమైన అమ్మాయిలు ఈ పోటీలకు ముందు వరుసలో ఉంటారు. అంతెంతుకు మిస్ విజయవాడ, మిస్ హైదరాబాద్ లాంటి పోటీలు పెడుతున్నారని ఆడవారి చెవిలో పడిందనుకోండి.. ఇక వారు చర్మ సంరక్షణ కోసం తీసుకునే జాగ్రత్తలు, ఆహార నిబంధనలు అన్నీ ఇన్నీ కావు. అందాల పోటీల్లో పాల్గొని ఆ కిరీటం తలపై పెట్టుకొని మురిసిపోవడమే తరువాయి!.
remove pimples: ఇప్పుడు టైటిల్లో పెట్టిన విధంగా మొటిమలకు, అందాల పోటీలకు లింక్ ఏమిటి? అని ఆలోచించకండి! కచ్చితంగా సంబంధం ఉందండి. ఆ రెండింటీకి సంబంధం ఉంది. ఎందుకంటే? ఈ అందగత్తెల పోటీలు వచ్చినప్పటి నుంచే అందంపై ఆడవారు, మగవారు దృష్టి పెట్టడం ప్రారంభించారట. అప్పటి నుంచి క్రీములు, లోషన్లు రాయడం కూడా ప్రారంభమైందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ కాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మొఖంపై మొటిమలు చేస్తున్న యుద్ధానికి వారు లోలోపల ఎంత మదన పడుతున్నారో అది అనుభవించివారికే తెలుస్తుంది. ముఖ్యంగా యుక్త వయస్సు వారికైతే అమ్మో మొటిమలా? వాటి బాధ భరించలేము అనే విధంగా చెబుతారు. ఈ ప్రపంచంలో యుక్తవయస్సు వచ్చిన వారిలో 91 శాతం మందికి మొటిమలు వస్తాయి.మొటిమలు రావడం చాలా మంచిది అని కూడా వైద్య నిపుణులు అంటున్నారు.
మొటిమలు హర్మోన్స్ పెరుగుదల వల్ల, జెన్యూపరంగా, వంశపారపర్యంగా, బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. మొటిమలు రావడంతోనే యుక్త వయస్సులో శరీరంలో అన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మగవారిలో గడ్డాలు, మీసాలు, శరీరం పెరుగుదల, గొంతు మారిపోవడం. అలానే ఆడవారిలో కూడా కొన్ని అవయవాల్లో మార్పులు వస్తుంటాయనేది అందరికీ తెలిసిందే. మొటిమలు మొఖానికి, ఛాతికి, వీపుకు కూడా వస్తుంటాయి.
మొటిమలు ప్రారంభంలో చిన్న చిన్న పొక్కులుగా వస్తుంటాయి. వాటిని గిల్లి మనమే పెద్దవి చేస్తాం. అలా మొటిమ వచ్చినప్పుడల్లా మన చెయ్యి ఆ మొటిమ పైనే కసితీర్చుకున్నట్టు నొక్కి పడేస్తాం. నొప్పి పంటి బిగువునైనా ఆపుకుంటాం కానీ మొఖంపై మొటిమ అనేది ఉండకూదనేదే మన లక్ష్యం అన్నట్టు చేస్తాం. ఇలా నొక్కీ..నొక్కీ ఆఖరికి అందమైన ముఖాన్ని మనమే మన చేతులతోనే అందహీనంగా చేస్తుంటాం.
సాధారణంగా మనకు ఆయిల్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కదా! అలా ఆయిల్‌తో తిన్నతర్వాత ఆ ఆయిల్ శరీరంలో నుంచి మళ్లీ ఎప్పుడు బయటకు వద్దామా అన్నట్టు ప్రయత్నం చేస్తుంటుంది. మన చర్మంపై లెక్కలేని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా ఆయిల్ బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇదే సందర్భంలో శరీరంలో ఒక బ్యాక్టీరియా ఆ ఆయిల్ వచ్చే రంధ్రాలకు అడ్డుగా మారుతుంది. మనం తినే నూనె మనకు ఎంత ఇష్టమో!.. ఆ బ్యాక్టీరియాకు కూడా ఆ ఆయిల్ అంటే అంత ఇష్టమట. ఇక చర్మం కింది భాగంలో ఆయిల్‌ను ఇల్లుగా మార్చుకొని ఇక తన సంతానోత్పత్తిని పెద్దది చేస్తుంది. అలా చేసిన బ్యాక్టీరియా మొటిమ రూపంలో మన మొఖంపై ప్రత్యక్షమవుతుంది.


మొదటి సారి ఒక మొటిమను ముఖంపై చూసినప్పుడు యుక్తవయస్సుల్లో మనకు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కాస్త మొటిమల సంఖ్య పెరిగి ఆవిరి చేస్తుంది. మొటిమల వల్ల ఎంతో మంది ఆడపిల్లలు, మగ పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అమ్మాయిలు అయితే నేను అందంగా లేనని నన్ను ఎవరూ చూడరేమోనని, అబ్బాయి అయితే నన్ను ఏ అమ్మాయి చూడటం లేదు దీనికి మొటిమలే కారణం అని మొఖంపై కసితీరా నొక్కుతాడు. చివరకు ఆ మొటిమలు మచ్చలు, గుంటలుగా ఏర్పడి అసలకే ఎసరు వస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా మొటిమలను చేతితో ఎట్టి పరిస్థితుల్లో నొక్కవద్దు. మీది యుక్త వయస్సు కాబట్టి అలా వస్తాయి..కాల క్రమేణా అవే పోతాయి. మరీ ఇబ్బందిగా ఉంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న మంచి డెర్మటాలజీని సంప్రదించండి. మీ స్కిన్‌కు తగ్గట్టు కావాల్సిన క్రీములు, లోషన్లు తీసుకోండి. వాటిని మొటిమలపై రాయండి. ఇలా 3 నుంచి 5 నెలల్లోపు మొటిమలు పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొటిమలు గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదని కొందరు డెర్మటాలజిస్టులు చెబుతున్న సలహా.
- Company IPO: కంపెనీ ఐపిఓలను ఎందుకు జారీ చేస్తుంది?
- Technical Analysis: స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ అంటే ఏమిటి?
- trailing stop loss:ట్రైలింగ్ స్టాప్‌లాస్ ఎలా ఉపయోగించాలి? | stock market
- stock market cycle: స్టాక్ మార్కెట్ సైకిల్, స్టేజెస్
- Munugode By Elections 2022: నా త్యాగం మునగోడు అభివృద్ధికి శ్రీకారమంటున్న రాజగోపాల్ రెడ్డి!