how to remove face makeup naturallyపార్టీకి గానీ, ఫంక్షన్‌గానీ వెళ్లొచ్చిన తరువాత చాలా మంది రిమూవర్‌తో మేకప్ తీసేస్తుంటారు. కానీ మేకప్ రీమూవర్ వాడటం వల్ల కొంత మంది చర్మం పొడిబారుతుంటుంది. అందుకే కొన్ని పద్ధతుల ద్వారా మేకప్ తీసేస్తే చర్మానికి ఎటువంటి హానీ కలగకుండా చూసుకోవచ్చు.
కళ్ల మేకప్ తీసేయడానికి బేబీ షాంపూ(baby shampoo) చాలా బాగా ఉపయోగపడుతుంది. (how to remove face makeup naturally)దీనితో ఐ లైనర్, మస్కారా, ఐ షాడోలను చాలా సులభంగా తీసేయవచ్చు. అంతే కాకుండా బేబీ షాంపూ వాడటం వల్ల మేకప్ రసాయనాల వల్ల కళ్లకు ఎలాంటి హానీ జరగదు. మొదట బేబీ వైప్స్‌తో మేకప్‌ని తుడిచేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దూదిని మాయిశ్చరైజర్‌తో తడిపి మొదట కళ్ల చుట్టూ ఆ తరువాత ముఖంపై తుడవాలి. వెంటనే సబ్బు రుద్దుకుని వేడినీటితో ముఖం కడుక్కోవాలి.


ముఖానికి వేసుకున్న మేకప్ తీసేయడానికి ఆలివ్ ఆయిల్(olive oil), బాదం నూనె ఉపయోపడతాయి. కొద్దిగా దూదిని తీసుకొని ఏదో ఒక నూనెలో ముంచి మేకప్‌ని తుడవాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే మేకప్ తీసేసిన తరువాత చర్మం పొడిబారకుండా ఉంటుంది. మొదట పెట్రోలియం జెల్లీని(petroleum jelly) కళ్లు, ముఖంపై రాసుకొని దూదితో మేకప్‌ని గట్టిగా తుడిచేయాలి. తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది. పైన పేర్కొన్న విధంగా కాస్త జాగ్రత్తలు తీసుకొని మేకప్ తీసుకోవడం మంచిది. ఇది అవగాహన మాత్రమే.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?