Raagi Halwa రాగి హల్వా ఇంటిలో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింద తెలిపిన విధంగా నేర్చుకొని రాగి హల్వా ఎలా తయారు చేయాలో నేర్చుకోండి.
కావాల్సిన పదార్థాలు: రాగులు – ఒక కప్పు, బెల్లం – అర కప్పు, కొబ్బరి తురుము- మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- ఒక టీస్పూను, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు.
తయారీ: (Raagi Halwa)రాగుల్ని రెండు మూడు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. పైన చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి బట్టలో వేసి పిండితే పాలు వస్తాయి. ఈ పాలను మందమైన వెడల్పాంటి గిన్నెలో పోసి మిశ్రమాన్ని కాస్త గట్టి పడేవరకూ గరిటెతో తిప్పాలి. తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. హల్వా రూపాన్ని సంతరించుకున్న తర్వాత స్టవ్‌మీద నుంచి దించి నెయ్యి లేదా నూనె రాసిన పళ్లెంలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవాలి. ఇక రాగి హల్వా రెడీ!.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి