How to prepare notes సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించేవి మనం సేకరించుకునే రిఫరెన్స్ పుస్తకాల ని చెప్పవచ్చు. ఆ రిఫరెన్స్ పుస్తకాలు సేకరించుకున్న తర్వాత పేపర్ -1 వారు అయితే ప్రస్తుతం ఉన్న డైట్ కాలేజీలలో అమలులో ఉన్న పుస్తకాన్ని ప్రధాన పుస్తకంగానూ, పేపర్-2 వారు అయితే ప్రస్తుతం బి.ఎడ్ కాలేజీలలో అమలులో ఉన్న పుస్తకాన్ని ప్రాథమిక పుస్తకంగానూ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ పుస్తకంలోని అంశాలు అన్నీ (టెట్-2021 గవర్నమెంట్ సిలబస్‌లో ఉన్నవి) ఒక సారి చదివి (సాధారణ అవగాహన కోసం) అప్పుడు సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇలా ఒక సారి చదివి నోట్స్ రాసుకోవడం వల్ల అంశాలను ఒక క్రమ పద్ధతిలోనూ, సులభంగానూ (How to prepare notes) రాసుకోవచ్చు.


మీరు సొంత నోట్స్ రాసుకునే విధానంను నేను ఉదాహరణంగా ఒక టాపిక్ తీసుకొని దాని ద్వారా మీకు ఎక్సెప్లెయిన్ చేస్తాను. మీకు వికాస నియమాలు- విద్యా సంబంధ అనువర్తనం అనే టాపిక్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు చేయాల్సింది మళ్లీ ఇంకోసారి(రెండవసారి) పూర్తిగా ఆ టాపిక్ ను అవగాహన చేసుకుంటూ చదివి, దానిపైన పట్టు సాధించాక అప్పుడు దానికి సంబంధించిన నోట్స్‌ను మీరు చదివిన అకాడమీ పుస్తకం ఆధారంగా రాసుకోవాలి. ఆ తర్వాత మీకు పైన రిఫరెన్స్‌గా ఇచ్చిన మిగిలిన రెండు అకాడమీ పుస్తకాలలో అదే టాపిక్ ను పరిశీలించి, మొదట అకాడమీ బుక్‌లో లేని అంశా లు (ఆల్ రెడీ మీరు నోట్స్ వ్రాసుకున్న అంశాలు కాకుండా) ఏవైతే ఉన్నయో వాటిని కూడా మీరు ఆ నోట్స్‌లో వ్రాసుకోవాలి. ఇలా వ్రాసే అంశాలు మీరు ఈ రెండు బుక్స్‌లో కలిపి 1 లేదా 2 శాతం కంటే ఎక్కువగా ఉండవు. ఇప్పుడు మీకు ఆ టాపిక్కు సంబంధించిన పూర్తి నోట్స్ తయారైంది. మీరు ప్రాథమిక బుక్‌గా తీసుకున్న బుక్‌లోని సైకాలజీ సిలబస్ మొత్తంలో అదనంగా 10 నుండి 15 శాతం అంశాలు మాత్రమే మిగిలిన రెండు బుక్స్‌లో మీకు లభిస్తాయి.
మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ప్రతి టాపిక్ కు కూడా ఆ టాపిక్ నిడివి ఆధారంగా ఆ టాపిక్ అయిన తర్వాత అవసరాన్ని బట్టి 1 లేదా 2 ఖాళీ పేజీలు వదులుకోవాలి. ఆ ఖాళీ పేజీలు ఎందుకు అంటే భవిష్యత్తులో ఆ టాపిక్స్ సంబంధించి కీవార్డ్స్ లేదా హింట్స్ లాంటివి లేదా ఇంకా ఏదైనా అదనపు సమాచారం ఉంటే అక్కడే వాటిని కూడా వ్రాసుకోవచ్చు. ఇలా మీరు నోట్స్ రాసుకునేటప్పుడు విష యాన్ని వీలైనంత సరళీకృతం చేసి వ్రాసుకోవాలి. నోట్స్ రాసేటప్పుడు విషయాన్ని పట్టికల రూపంలో రాసుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా విషయాలను పట్టికల రూపంలో రాసుకోండి. ముఖ్యం గా కన్ఫ్యూజ్ అయ్యే అంశాలను మాత్రం తప్పని సరిగా పట్టికల రూపంలో రాసుకోండి. దీని వల్ల మీకు ఆ అంశాల మధ్య తారతమ్యాలు తెలిసి ఆ అంశంలో కన్ఫ్యూజ్ అవ్వరు. అలాగే పట్టికలతో పాటు ప్లోచా ర్టులు, పై డయాగ్రాం లాంటివి కూడా ఉపయోగించి నోట్స్ వ్రాసుకోవాలి. ఇలా కనుక మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీ నోట్స్ ను మించిన మంచి మెటీరియల్ అనేది మీరు ఎక్కడా దొరకదు. అదే ది బెస్ట్ మెటీరియల్ అవుతుంది.


సొంత నోట్స్ వల్ల ఉపయోగాలు:
- నోట్స్ మీరు రాసుకుంటారు కాబట్టి నోట్స్‌లోని అంశాలు మీరు సులభంగా చదువుకోవచ్చు.
- చదువుకుంటూ నోట్స్ రాసుకోవడం వల్ల రాసిన అంశాలు ఎక్కువ కాలం మనకు గుర్తుంటాయి.
- ఒక అంశానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అంతా ఒకే దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పుస్తకాలు తిరగెయ్యాల్సిన అవసరం ఉండదు.
- మీ ప్రిపరేషన్ టైంను సొంత నోట్స్ సేవ్ చేస్తుంది.
- నోట్స్ రాసుకోవడం వల్ల సబ్జెక్టుపై పూర్తి పట్టు వస్తుంది. మీకు సబ్జెక్టు పై ఉన్న భయం పోతుంది.
- ఇలా మీకు మీరు నోట్స్ రాసుకోవడం వల్ల సబ్జెక్టులోని టాపిక్స్‌పైన పూర్తి అవగాహన మీకు వస్తుంది. తద్వారా మీరు ఎగ్జామ్‌లో బిట్స్ ఎంత కష్టంగా వచ్చినా సరే వాటిని తేలికగా ఆన్సర్ చేయగలుగుతారు.
- అప్లికేషన్ బిట్స్ కు మాత్రం ఆన్సర్ చేయగలిగే సామర్థ్యం సొంత నోట్స్తోనే సాధ్యం.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?