biryani recipe బిర్యానీ అంటే ఇష్టం లేదనే వారు కోట్లలో ఒక్కరు, ఇద్దరు మాత్రమే బహుశా ఉండొచ్చు. బిర్యానీ ప్రియులు వారానికి ఒక్కసారైనా తినేవారు ఉన్నారు. రోజూ తినేవారు కూడా ఉన్నారు. అయితే ఇంటిలో ఆ ఇష్టమైన బిర్యానీ కుటుంబ సభ్యులకు ఎలా తయారు చేసి పెట్టాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ మటన్- అరకిలో, బాస్మతి బియ్యం – అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద- రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయ – ఒకటి, ధనియాల పొడి- రెండు టీ స్పూన్లు, గరం మసాలా- ఒక టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు – నాలుగు, లవంగాలు – ఐదు, దాల్చిన చెక్కలు – నాలుగు, కొత్తిమీర కట్ట- ఒకటి, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా(biryani recipe).


తయారు చేయు విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఉల్లిపాయ ముక్కలు, ఒక టీ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేగించాలి. తరువాత మటన్ వేసి బాగా ఉడికించి దించేయాలి. తర్వాత మరో మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిరపకాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగించాలి. తర్వాత బియ్యం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి వేగించాలి. తర్వాత బియ్యం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి వేగించాలి. తర్వాత వంతుకు వంతున్నర నీళ్లు పోసి ఉడికించి దించేయాలి. దించే ముందు కొత్తిమీర తురుము వేయాలి.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్