Fat Lose : లావు ఎలా త‌గ్గాలి? బ‌రువు త‌గ్గాలంటే ఏ జాగ్ర‌త్త‌లు పాటించాలి?

Fat Lose : లావు ఎలా త‌గ్గాలి? బ‌రువు త‌గ్గాలంటే ఏ జాగ్ర‌త్త‌లు పాటించాలి?

Fat Lose : ఈ మ‌ధ్య కాలంలో లావు పెరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 5 సంవ‌త్స‌రాల పిల్ల‌ల నుంచి 55 సంవ‌త్స‌రాల పెద్ద‌ల వ‌ర‌కూ లావు స‌మ‌స్య‌తో నిత్యం బాధ‌ప‌డుతూనే ఉన్నారు. అలా లావుగా క‌నిపించే వారు స‌మాజంలోకి రావాలంటే కాస్త మొహ‌మాటం ప‌డుతుంటారు. ఇబ్బందిగా ఫీల‌వు తుంటారు. ఈ లావు ఎలా? త‌గ్గించు కోవాలి దేవుడా! అంటూ ఒక‌టే మ‌ద‌న ప‌డుతుంటారు. అలాంటి వారు జీవితంలో ఏదీ స‌జావుగా చేయ‌లేరు. ప‌రిగెత్త‌లేరు. న‌డ‌వ‌లేరు. ఏ ప‌ని చేయాల‌నుకున్నా వెంట‌నే ఆయ‌సం వ‌స్తూ ఉంటుంది.

అతిగా వ‌ద్దు..మిత‌మే ముద్దు!

ఒత్తిడితో ఉండేవాళ్ల‌కు ఆక‌లి వేయ‌దు. అదే స‌మ‌యంలో వారికి తెలియ‌కుండానే బాగా తినేస్తుంటారు. ముందుగా ఈ అల‌వాటును మార్చుకోవాలి. స్ట్రెస్ ఈటింగ్ అల‌వాటును త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌త్యామ్నా యం ఏముందో ఆలోచిం చాలి. అలా తినాలనిపించిన‌ప్పుడు వాకింగ్‌కు వెళ్లొచ్చు. లేదా స్నేహితుల‌తో చాట్ చేయొచ్చు. శ్వాస వ్యాయామాలు చేయొచ్చు. లేదా సంగీతాన్ని విన‌చ్చు. అది ఇష్టం లేక‌పోతే సినిమా చూడొచ్చు. మొత్తానికి తిన‌డం త‌ప్పించి ఏ ప‌నైనా చేయ‌వ‌చ్చు. చాలా సార్లు మ‌నం తింటున్న దేమిటో మ‌న‌కు బాగా తెలుస‌నుకుంటుంటాం. ఈ స‌మ‌యంలో eating amnesia స‌మ‌స్య‌తో బాధ‌ప‌డు తుంటాం. దీని వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. కొంత మంది వండే స‌మ‌యంలోనే గుప్పెళ్ల‌తో తీసుకొని తింటుంటారు. ఇది కూడా మంచి ప‌ద్ధ‌తి కాదు.

బిగ్ బ్రేక్స్ తీసుకోకూడ‌దు. ఏదైనా కొద్ది కొద్దిగా నాలుగైదు సార్లు తింటే ఇబ్బందీ ఉండదు. డ్రింక్ చేసేట‌ప్పుడు కూడా బాగా అదుపులో ఉండాలి. అప్పుడు లావు అయ్యే అవ‌కాశం ఉండ‌దు. ఎంతో ఆత్మ‌విశ్వాసంతో, ధైర్యంతో మెలుగు తారు. కొంత మంది ఇది మంచి ఆహారం, అది చెడ్డ ఆహారం అనుకుంటూ తిన‌డానికి వెన‌కా ముందు అవుతుంటారు. అలా కాకుండా ఏది తినాల‌నిపిస్తే దాన్ని మితంగా తీసుకుంటే వ‌చ్చే ఇబ్బందేమీ ఉండ‌దు. స‌మ‌తులాహారాన్ని తీసుకోవాలి. స‌మ‌తుల్య‌త పాటించాలి. నాజుగ్గా త‌యార‌వ్వాల‌ని డిన్న‌ర్ తిన‌డం మానొద్దు. త‌క్కువ కాల‌రీలు, పీచు ప‌దార్థాలు ఎక్క‌వుగా ఉన్న డిన్న‌ర్ అంటే sandwich, meals, salads, godhimai pasta వంటివి తినాలి. వారాంతంలో ఫుడ్‌ను బాగా లాగించేస్తుంటారు చాలా మంది. పైగా వ్యాయామాలు అస్స‌లు చేయ‌రు. దీని వ‌ల్ల శ‌రీర బ‌రువు మ‌రింత పెరుగుతుంది. అందుకే వారాంతంలో తినే చిరుతిళ్ల‌కు, హెవీ ఫుడ్స్‌కు పుల్‌స్టాప్ పెట్టాలి. అలాగే వారంతాల్లో రెగ్యుల‌ర్ ఫిట్‌నెస్ షెడ్యూల్ పెట్టుకోవాలి. ముఖ్యంగా బ్రిస్క్ వాక్ త‌ప్ప‌నిస‌రిగా చేయాలి.

పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు త‌గ్గాలంటే?

పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్ల‌నూ ప్ర‌భావితం చేస్తుంది. అంతేకాదు దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, క్యాన్స‌ర్‌, అధిక ర‌క్త‌పోటు వ‌చ్చే ప్ర‌మాదాలూ ఎక్క‌వ అంటున్నారు వైద్యులు. అందుకే ఈ కొవ్వును త‌గ్గించేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాలి. ఆహార ప‌దార్థాల ఎంపిక‌లో జాగ్ర‌త్త వ‌హించాలి. ఒక రోజులో మ‌నం తినే ఆహారం నుంచి ప‌ది గ్రాముల ఆహారం సంబంధిత పీచు అందేట‌ట్టు చూసుకుంటే అంత‌ర్గ‌త కొవ్వును అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఇందుకు బీన్స్‌, ప‌ప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు ఎక్క‌వుగా తీసుకోవాలి. వీటితో పాటు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు ప‌దార్థాల కార‌ణంగా ఏర్ప‌డే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు. ప్రోటీన్‌లో మాంసకృతుల మోతాదు త‌గినంత‌గా ఉండేట్టు చూసుకోవాలి. రోజులో క‌నీసం వంద కెలోరీల పోష‌కాలు ప్రోటీన్ల నుం చి అందేట్టు జాగ్ర‌త్త ప‌డాలి. ఇవి నిదానంగా జీర్ణ‌మై ఆక‌లిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందు కోసం మీగ‌డ తీసేసిన పెరుగు, పాలు, చేప‌లు, గుడ్లు తింటే మెరుగైన మాంస‌కృత్తులు అందుతాయి. యాపిల్, పుచ్చ‌ కాయ‌, దోస‌కాయ‌, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిల‌గ‌డ‌దుంప‌ల్లోనూ పీచు ఎక్కువుగా ఉంటుంది. కొవ్వు త‌క్కువుగా ఉండి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువుగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు త‌గ్గుతుంది. ఓట్స్‌తో చేసిన ప‌దార్థాలు కూడా పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును త‌గ్గిస్తాయి.

క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం!

న‌డుముకి రెండు ప‌క్క‌లా పేరుకున్న కొవ్వు త‌గ్గాలంటే పోష‌కాహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవ‌స‌రం అంటున్నారు నిపుణులు.
వ్యాయ‌మం 1 : రెండు కాళ్లు ద‌గ్గ‌ర పెట్టి వెన్ను నిటారుగా ఉంచి కుడి చేయి పైవైపుకి చాచి కుడి క‌ణ‌త‌కు ఆనించి ఎడ‌మ‌వైపుకు వంగాలి. మ‌ళ్లీ త‌ల‌ను వంచుతూ నెమ్మ‌దిగా ఎడ‌మ‌చేతిని పైకి లేపి ఎడ‌మ క‌ణ‌త‌కు ఆనించి కుడివైపుకు వంగాలి. అలా కొన్ని సార్లు చేయాలి.

చ‌ద‌వండి :  Tired : అల‌సిపోతున్న మ‌హిళ‌లు.. అన్ని ఒత్తిళ్లూ ఆమె పైనే భారం!

వ్యాయామం 2 : నేల మీద చాప ప‌రిచి కుడివైపుకు ప‌డుకోవాలి. ముంజేయి మీ ముందుకు ఉండాలి. కాళ్లు ఒక‌దానిపైన ఇంకోటి ఉండాలి. ముంజేయి మీద‌, కాళ్ల మీద బ‌రువు పెట్టి శ్వాస వ‌దులుతూ శ‌రీరాన్ని పైకి లేపాలి. లోనికి శ్వాస తీసుకుంటూ 30 నుంచి 60 సెక‌న్లు శ్వాస ఆపి ఉంచాలి. మ‌ళ్లీ య‌థాస్థితికి రావాలి. ఇలానే ఎడమ వైపుకు మ‌ర‌లి చేయాలి.

వ్యాయామం 3 : భుజాల క‌న్నా వెడ‌ల్పుగా కాళ్లు వెడం చేసి ఉంచాలి. కుడివైపుకు వంగి కాలి మ‌డ‌మ‌ల‌ను తాకాలి. అలాగే ఎడ‌మ‌వైపుకి వంగి చేతివేళ్ల‌తో కాలి మ‌డ‌మ‌ల‌ను తాకాలి.

వ్యాయామం 4 : టీపాట్ ఆకారంలో ఎడ‌మ మోచేయి మీ ఎడ‌మ‌కాలుని తాకాలి. అలాగే కుడి మోచేయి కుడి మోకాల‌ను తాకాలి. ఇలా రెండు వైపులా స‌రిస‌మానంగా చేయాలి. ఇవి కాక పీచు ప‌దార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుతో కూడిన ఆహారం రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకుంటుంటే న‌డుం మీద అన‌వ‌స‌ర‌మైన కొవ్వు క‌రిగిపోతుంది. ఎప్పుడూ క‌ద‌లిక‌లోనే ఉండాలి. క్యూలో నిల్చొన్నా, ఫోన్లో మాట్లాడుతున్నా, వంట గ‌దిలో వంట చేస్తున్నా ఒకే భంగిమ‌లో క‌ద‌ల‌కుండా ఉండ‌కుండా చ‌ల‌నంలో ఉండాలి.

కొవ్వును క‌రిగించే ఆహార ప‌దార్థాలు!

Oats : రుచికే కాక ఆరోగ్యానికి ఎంతో ఉత్త‌మ‌మైన‌వి ఇవి. ఓట్స్‌లో ఉండే ఫైబ‌ర్ శ‌రీరంలోని కొల‌స్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది. అంతేకాక‌, ఆక‌లిని కూడా త‌గ్గిస్తుంది.

Eggs : ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే గుడ్ల‌లో కేల‌రీలు చాలా త‌క్కువ‌. వీటిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి కొలస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు, కండ‌రాల‌కు కూడా బలాన్ని చేకూర్చుతుంది.

Apple : రోజుకొక ఆపిల్ తింటే డాక్ట‌ర్ అవ‌స‌రం కూడా రాద‌ని చెబుతుంటారు. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువుగా ఉంటాయి. ఇవి శ‌రీరంలోని కొవ్వు నిల్వ‌ల‌ను త‌గ్గిస్తుంది.

Green Chilli : దీనిలోని క్యాప్సైసిన్ అనే ప‌దార్థం ఉండ‌టం వ‌ల్ల శ‌రీర ఎదుగుద‌లకు స‌హ‌క‌రించే క‌ణాల అభివృద్ధికి, నిల్వ ఉన్న కేల‌రీల త‌రుగుద‌ల‌కు ఎంతో స‌హాయ‌కారిగా ప‌నిచేస్తుంది.

Garlic : దీనిలోని ఆలిసిన్ అనే ర‌సాయ‌నం యాంటీ బాక్టీరియ‌ల్‌గా ప‌నిచేస్తుంది. అది శ‌రీరంలోని కొవ్వును, చెడు కొల‌స్ట్రాల్‌ను త‌గ్గించ‌డానికి స‌హాయ ప‌డుతుంది.

Honey : కొవ్వు క‌రిగించే ప‌దార్థాల‌లో ముఖ్య‌మైన‌ది తేనె. గోరువెచ్చ‌ని నీటిలో తేనెను క‌లిపి ప్ర‌తిరోజూ ప‌ర‌గ‌డుపున తాగ‌డం ఎంతో మంచిది.

Green Tea : బ‌రువు త‌గ్గ‌డానికి ఎంతో ఉత్త‌మం ఈ గ్రీన్ టీ. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌లు శ‌రీర బ‌రువును క్ర‌మ ప‌ద్ద‌తిలో ఉంచుతుంది. రోజూ రెండు క‌ప్పుల గ్రీన్ టీ మంచి ఫ‌లితాన్నిస్తుంది.

చ‌ద‌వండి :  Tomato Benefits : ట‌మాటా తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి?

Wheatgrass : జీర్ణ‌క్రియ‌ల ప‌నితీరును మెరుగు ప‌రిచి కొవ్వును త‌గ్గిస్తుంది.

Tomato : మ‌నం తీసుకునే ఆహారంలో ట‌మాటోల‌ను చేర్చుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌ను క‌లిగించే క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. అంతేకాదు కొవ్వును త్వ‌రిత‌గ‌తిన త‌గ్గిస్తుంది కూడా.

Dark Chocolate : దీనిలోని ఫ్లావ‌నాయిడ్స్‌, బాధ నివార‌ణ కార‌కాలు ర‌క్తంలోని కొల‌స్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అంతేకాదు, ఇది ర‌క్తంలోని సెరోటోనిన్ పెరుగుద‌ల‌కు, కొవ్వును క‌రిగించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

Cinnamon : జీవ‌క్రియ‌ల రేటును మెరుగు ప‌ర్చ‌డంలో దాల్చిన చెక్క కీల‌క పాత్ర పోషిస్తుంది. దీన్ని త‌రుచూ తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులో ల‌భించే పోష‌కాలు శ‌రీరంలోని కొవ్వును క‌రిగించ‌డానికి దోహ‌దం చేస్తాయి. జీర్ణ‌క్రియ వ్య‌వ‌స్థ‌కు కూడా ఇది మేలు చేస్తుంది.

Curry Tree : దీనిలో పోష‌కాలు శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను దూరం చేస్తాయి. చెడు కొవ్వును క‌రిగించేస్తాయి. ఊబ‌కాయంతో బాధ‌ప‌డే వారు రోజుకు 10 ఆకుల‌ను నీళ్ల‌లో క‌లిపి తీసుకోవాలి. లేదంటే ఉద‌యాన్నే న‌మిలితే చాలా త్వ‌ర‌గా ఫ‌లితం ఉంటుంది.

తాజా పండ్లు, కాయ‌గూర‌ల్లో ఉండే పోటాషియం కొవ్వుని క‌రిగించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. వీటిని తిన్న‌ప్పుడు అవి నిదానంగా జీర్ణ‌మ‌వుతాయి. శ‌క్తిని కూడా ఒక్క‌సారిగా కాకుండా నిదానంగా విడుద‌ల చేస్తాయి. అదే పోటాషియం ప్ర‌త్యేక‌త‌. ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు పేరుకుపోకుండా ఉంటాయి. వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు ఆ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మొక్క‌జొన్న పేలాలు తిన‌డానికి ఆస‌క్తి చూపిస్తాం క‌దా!. వాటికి ఉండే అద‌న‌పు ప్ర‌యోజ‌నం కొవ్వును అదుపులో ఉంచ‌డం, వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, పీచు స‌మృద్దిగా ఉంటాయి. దీనికి వెన్న‌, ఇత‌ర‌త్రా ప‌దార్థాలు క‌ల‌ప‌కుండా కాస్తంత ఉప్పు మాత్ర‌మే చేర్చి తీసుకుంటునే ఆ లాభాలు పొంద‌వ‌చ్చు.

గ్లైస‌మిక్ స్థాయిలు త‌క్కువుగా ఉండే ముడిబియ్యంలో పోష‌కాలు పుష్క‌లంగా ఉండ‌టంతో పాటు వాటిల్లోనూ పీచూ, సెలీనియం వంటివి ఆక‌లిని అదుపులో ఉంచుతాయి. దీంతో శ‌రీరంలో కొవ్వు త్వ‌ర‌గా పేరుకోదు. కొలెస్ట్రాల్‌, బీపీ స‌మస్య‌లు అదుపులో ఉంటాయి. ప‌ప్పు ధాన్యాలు, వివిధ ర‌కాల తృణ‌ధాన్యాలూ పీచుని పుష్క‌లంగా అందించి శ‌రీరంలో కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. ఎప్పుడూ ఒకేర‌కం కాకుండా కొత్త‌ర‌కాల తృణ‌ధాన్యాల‌ని ప్ర‌య‌త్నించాల‌ నుకున్న‌ప్పుడు వాటితో జావ‌లాంటివి చేసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే పాల మీగ‌డ‌ను ఉప‌యోగించాల్సిన వంట‌కాల్లో ప్ర‌త్యామ్నాయంగా క‌మ్మ‌ని పెరుగుని వాడితే పోష‌కాలు అంది కొవ్వు స‌మ‌స్య ప్ర‌స‌క్తే ఉండ‌దు.

చ‌ద‌వండి :  Body Fitness : ప‌ర‌గ‌డుపున Exercise చేస్తే లాభ‌మా? న‌ష్ట‌మా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *