National Savings Monthly Income Account(MIS): చేతిలో డబ్బు ఉందా? దానిని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? అయితే దగ్గరలో ఉన్న మీ గ్రామంలోనో, మీ మండలంలోనూ పోస్టు ఆఫీసును సంప్రదించండి. అక్కడ పోస్టు ఆఫీసులో మంత్లీ ఇన్‌కం స్కీం ఉంటుంది. పోస్టు ఆఫీసు అధికారులను ఒక్కసారి సంప్రదించి మంత్లీ ఇన్‌కం స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. కష్టపడిన డబ్బులను అధిక వడ్డీ ఇస్తామనే సూటూబూటు వేసుకునే పెద్దమనుషులను నమ్మి వారికి కట్టబెట్టడం కన్నా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న పోస్టు ఆఫీసులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఎంతో మేలు. మీకు కావాల్సినప్పుడు ఆ డబ్బును తీసుకోవచ్చు. లేదంటే నెలనెలా పెన్షన్ రూపంలోకూడా తీసుకోవచ్చు. ఇది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు, మరియు పొదుపు చేసి లైఫ్‌లో సెటిల్ అవుదామనుకునే వారికి చాలా ఉపయోగపడవచ్చు.
మంత్లీ ఇన్‌కం స్కీం గురించి!
పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం ఒకటి అందుబాటులో ఉంది. దీని ద్వారా నెలకు రూ.5,700 పొందవచ్చు. అది పెన్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంలో ముందుగా రూ.9,00,000(తొమ్మిది లక్షలు) డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీకు అంత డబ్బు చేతిలో లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదంటోంది ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీం. ఈ పోస్టీఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంలో ఇద్దరూ లేదా ముగ్గురు కలిసి పోస్టాఫీసులు ఖాతా తెరిచి రూ.9,00,000(తొమ్మిది లక్షలు) డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా రూ.9,00,000 (తొమ్మది లక్షలు) మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం.
మెచ్యురిటీ 5 సంవత్సరాల గడువు!
పోస్టుఆఫీసు వెబ్సైట్ ప్రకారం అధికారికంగా పోస్టుఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం మెచ్యురిటీ సమయం 5 సంవత్సరాలు. ఈ స్కీంముపై ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం 7.6% వడ్డీ అందుబాటులో ఉంది. వడ్డీని ప్రతినెలా మీకు చెల్లిస్తారు. ఈ వడ్డీ వివరాలు పరిశీలిస్తే అకౌంట్ లో రూ.9,00,000 (తొమ్మది లక్షలు) ఇన్వెస్ట్ మెంట్ చేస్తే మీకు రూ.3,42,000(మూడు లక్షలా నలభైరెండు వేలు) రాబడి వస్తుంది. అంటే నెలకు సరాసరి రూ.5,700 మీరు పొందవచ్చు.
నెలనెలా వడ్డీ తీసుకోవచ్చు!
ఈ పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంలో ఒకరు మాత్రమే ఇన్వెస్ట్ మెంట్ చేస్తే గరిష్టంగా రూ.4,50,000(నాలుగు లక్షల యాభై వేలు ) మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. ఐదేళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి రూ.1,71,000 (లక్షా డెబ్బై ఒక్క వేలు) రాబడి వస్తుంది. అంటే నెలకు రూ.2,850 మొత్తాన్ని పొందవచ్చు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీంలో చేరాలంటే మైనర్లకు కూడా అవకాశం ఉంది. సుమారు 10 సంత్సరాల నుండి ఆపైన వయస్సు ఉన్నవారు (ఆడ/మగ) స్కీం తీసుకునేందుకు అర్హులు. ఈ స్కీం ద్వారా నెలనెలా మీకు వచ్చిన వడ్డీని విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. ప్రతి నెలా వడ్డీ ఆటోమెటిక్‌గా మీ ఖాతాలోకి జమ అవుతుంది.
స్కీం గురించి పూర్తి వివరాలు లింక్ క్లిక్ చేయండి: National Savings Monthly Income Account(MIS)

Saving Schemes:
Post Office Monthly Income Scheme
Post office Saving Account(SB)
National Saving Recurring Deposit Account(RD)
National Saving Time Deposite Account(TD)
National Savings Monthly Income Account(MIS)
Senior Citizens Saving Scheme Account(SCSS)
Public Provident Fund Account (PPF)
Sukanya Samriddhi Account(SSA)
National Saving Certificates (VIIITH Issue)(NSC)
Kisan Vikas Patra(KVP)
Interest rates(New)
How to avail services
Schedule of Fee
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన మాజీ విలేఖరి అరెస్టు
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు