Jeans Cloth washవేణ్నీళ్లు వాడితే జీన్స్ ప్యాంట్ల మురికి త్వరగా పోతుందనుకుంటారు చాలా మంది. కానీ దాని వల్ల రంగు త్వరగా వెలిసిపోయే ప్రమాదం ఎక్కువ. పైగా ప్యాంటు పోగులు కూడా పైకిలేచే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. అందుకే తప్పనిసరిగా చల్లటి నీళ్లే (Jeans Cloth wash)వాడాలి.
ఈ జీన్స్ ప్యాంట్లను వాషింగ్మెషీన్లో వేయడం కన్నా, సాధ్యమైనంత వరకూ చేతులతో ఉతకడమే మంచిది. రంగు, మన్నిక తగ్గే ప్రమాదం ఉండదు. చేతులతో ఉతికినా డ్రైయ్యర్‌లో మాత్రం వేయకూడదు. వీటిని వీలైనంత వరకూ తక్కువ సమయం నీళ్లలో నానబెట్టాలి. అరేసేటప్పుడు తప్పనిసరిగా తిరగేయాలి. అలాగే అది రంగు కోల్పోకుండా ఉండాలంటే నీడలోనే ఆరేయాలి. ఆ జీన్స్‌ను మొదటిసారి ఉతుకుతున్నప్పుడు నానబెట్టే నీటిలో అరకప్పు వెనిగర్, కొద్దిగా ఉప్పు కలపాలి. ఆ నీళ్లలో జీన్స్‌ని ఓ గంట పాటు నానబెడితే రంగుపోదు. కొత్తదానిలానే ఉంటుంది. ఒక వేళ రకరకాల దుస్తులు కలిపి నానబెడుతోంటే నలుపు రంగు జీన్స్‌తో పాటూ ముదురు రంగు దుస్తులన్నీ ఒక బకెట్లో వేసుకోవాలి. వీటిని సాధారణ సబ్బులు కాకుండా లిక్విడ్ డిటర్జెంట్లు ఎంచుకుంటే మంచిది.

Washing Clothes safely and perfectly
సాధారణంగా బట్టలు ఉతకడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే కలర్ దుస్తులు శుభ్రం చేయడం కంటే తెల్లని దుస్తులను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అందులోనూ ఇంట్లో పిల్లలుంటే వారి స్కూలు యూనిఫార్మ్ శుభ్రం చేయడం ఒక పెద్ద పని. పిల్లలు తెల్లదుస్తుల మీద మరకలు పట్టించినప్పుడు మీ శ్రమ మరింత ఎక్కువ అవుతుంది. అయితే అందుకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు.
వెనిగర్ తో(Vinegar): వెనిగర్ తెల్లని దుస్తులను మరింత ప్రకాశవంతంగా ఉంచుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా తెల్లదుస్తుల మీద పడ్డ మరకల మీద కొద్దిగా వెనిగర్ వేసి రుద్ది తర్వాత చల్లటి నీటితో కొద్ది సమయం నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రం చేస్తే తేడా మీకే అర్థమవుతుంది.
బ్లీచింగ్‌తో(bleching): ఎక్కువుగా మరకలు పడ్డ తెల్ల దుస్తులను శుభ్రం చేయడానికి బ్లీచింగ్, డిటర్జెంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు పౌడర్లను కలిపిన నీటిలో తెల్లని దుస్తులను 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత వేడినీటిలో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దుస్తులు శుభ్రంగా తయారవ్వడంతో పాటు ప్రకాశవంతంగా కనబడతాయి.

వేడి నీటితో(hot water): తెల్ల దుస్తులను వేడి నీటిలో డిప్ చేయాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్, వైట్ వెనిగర్ మిక్స్ చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే దుస్తులు తెల్లగా మెరుస్తుంటాయి.
బేకింగ్ సోడా(baking soda): మీ తెల్లని దుస్తులను శుభ్రంగా ఉతకడానికి మరో మార్గం బేకింగ్ పౌడర్. తెల్లని దుస్తులు నానబెట్టే నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్‌ను వేసి నానబెట్టుకోవాలి. ఈ నీటిలోనే దుస్తులను శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని రెండు సార్లు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి