Identify fake milk: క‌ల్తీ పాల‌ను క‌నిపెట్ట‌డం ఎలా? | చిటికెలో తెలిసిపోతుంది?

Identify fake milk: ఇటీవ‌ల కాలంలో ఏది చూసినా క‌ల్తీయే. ప‌ప్పు, ఉప్పు, బెల్లం, పంచ‌దార‌, బియ్యం..చివ‌ర‌కు పౌష్టికాహారం అనుకుంటున్న పాలు, దాని ఉప ఉత్ప‌త్తులైన పెరుగు, నెయ్యి కూడా క‌ల్తీ (Identify fake milk)బారిన ప‌డుతున్నాయి. ఇలా క‌ల్తీ జ‌రిగిన పాలు, పాల ప‌దార్థాలు వాడ‌టం ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

పాల‌లో ప్రధానంగా సోడియం బై కార్బొనేట్‌, గ్లూకోజ్‌, పంచ‌దార‌, పిండి, యూరియా, బోరిక్ ఆమ్లం, డాల్టా క‌ల్తీ చేస్తుంటారు. దీని వ‌ల్ల ఎక్కువ నీరు పోసినా పాలు తెల్ల‌గా, చిక్క‌గా క‌నిపిస్తాయి. పాల‌లో ర‌క‌ర‌కాల క‌ల్తీల‌ను ఈ విధంగా గుర్తించ‌వ‌చ్చు.

సోడియం బై కార్పొనేట్(Sodium bicarbonate): టెస్ట్ట్యూబ్‌లో 3 మిల్లీమీట‌ర్ల పాలు శాంపిల్ తీసుకోవాలి. దానిలో 10 చుక్క‌ల రోసాలిక్ ఆమ్లం వేయాలి. పాలు గులాబీ రంగులోకి మారితే దానిలో సోడియం బై కార్బొనేట్ క‌లిసిన‌ట్టు గుర్తించ‌వచ్చు.

గ్లూకోజ్(Glucose): ఐదు మిల్లీలీట‌ర్ల పాల‌లో డ‌యాస్టిక్స్ ప‌ట్టీని అర నిమిషం ఉంచాలి. నీలం రంగులో ఉండే ఆ ప‌ట్టీ ఆకుప‌చ్చ రంగంలోకి మారితే గ్లూకోజ్ క‌లిపిన‌ట్టు లెక్క‌.

పంచ‌దార(sugar): మూడు మిల్లీలీట‌ర్ల పాల‌లో రెండు మిల్లీలీట‌ర్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం క‌ల‌పాలి. దానిలో 50 మిల్లీ గ్రాములు రిసార్సినాలెన్‌ను క‌లిపి వేడి చేయాలి. పాలు ఎరుపు రంగులోకి మారితే పంచ‌దార క‌లిపిన‌ట్టు.

పిండి(Flour) : మూడు మిల్లీలీట‌ర్ల పాల‌లో ఒక శాతం నీరు క‌లిపి అయోడిన్ ద్రావ‌ణం ఒక చుక్క వేయాలి. పాలు నీలి రంగులోకి మారితే పిండి క‌లిసిన‌ట్టు.

యూరియా(Urea): ఐదు మిల్లీలీట‌ర్ల పాల‌లో సోయాబీన్ పొడి లేదా కందిప‌ప్పు పొడి క‌లిపి ఐదు నిమిషాల త‌ర్వాత ఎర్ర‌లిట్మ‌స్ కాగితాన్ని అందులో ముంచాలి. 30 సెక‌న్ల త‌రువాత ఆ కాగితం నీలిరంగులోకి మారితే యూరియా క‌లిపిన‌ట్టు నిర్థారించ‌వ‌చ్చు.

బోరిక్ ఆమ్లం(Boric acid): మూడు మిల్లీలీట‌ర్ల పాల‌లో 20 చుక్క‌ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం క‌లిపి, ప‌సుపురంగు కాగితాన్ని ముంచాలి. నిమిషం త‌రువాత ఆ కాగితాన్ని తీసి ఒక చుక్క అమ్మోనియా క‌లిపి మ‌ళ్లీ ముంచాలి. మొదటిసారి ముంచిన‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులోకి మారితే బోరిక్ ఆమ్లం క‌లిసిన‌ట్టే.

డాల్టా(Dalda): మూడు మిల్లీలీట‌ర్ల పాల‌లో 10 చుక్క‌ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా మ్యూటారిక్ ఆమ్లం క‌లిపి, ఆ మిశ్ర‌మానికి పావు స్పూన్ పంచ‌దార బాగా క‌లిపి ఐదు నిమిషాల త‌రువాత చూడాలి. అది ఎరుపు రంగులోకి మారితే డాల్టా క‌లిపిన‌ట్టు.

పెరుగు(curd)లో క‌ల్తీ: ఐదు మిల్లీలీట‌ర్ల పెరుగులో 10 చుక్క‌లు హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా మ్యూటారిక్ ఆమ్లం క‌లిపి ఐదు నిమిషాలు త‌రువాత ప‌రిశీలించాలి. అది ఎరుపు రంగులోకి వ‌స్తే ఆ పెరుగులో డాల్టా క‌ల్తీ జ‌రిగిన‌ట్టు.

ర‌బ్రీ స్వీట్లు(Ruby Sweets): విరిగిన పాల‌తో ర‌బ్రీ స్వీట్లు త‌యారు చేస్తారు. టిష్యూ పేప‌ర్ ను త‌డిపి మెత్త‌గా చేసి ఈ స్వీట్‌లో క‌లుపుతుంటారు. దీనిని గుర్తించాలంటే ఒక స్పూన్‌లో స్వీట్ తీసుకుని 3 మిల్లీలీట‌ర్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, 3 మిల్లీలీట‌ర్ల డిస్టిల్డ్ వాట‌ర్ ఏదైనా రాడ్డుతో బాగా క‌ల‌పాలి. ఆ రాడ్డుకు స‌న్న‌ని పీచులాంటి ప‌దార్థం అంటుకుంటే స్వీటులో టిష్యూ పేప‌ర్ క‌ల్తీ జ‌రిగిన‌ట్టే.

నెయ్యిలో క‌ల్తీ(Ghee): మూడు మిల్లీలీట‌ర్ల నెయ్యిలో 10 చుక్క‌ల హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా మ్యూటారిక్ ఆమ్లం క‌లిపి, పావు స్పూన్‌ పంచ‌దార వేసి, బాగా క‌లియ‌బెట్టాలి. ఐదు నిమిషాల త‌ర్వాత అది ఎరుపురంగులోకి మారితే నెయ్యిలో డాల్టా క‌లిసిన‌ట్టు నిర్థారించ‌వ‌చ్చు. క‌ల్తీ నిర్థార‌ణ‌కు అవ‌స‌ర‌మైన ర‌సాయ‌నాలు కెమిక‌ల్స్ దుకాణాల్లో ల‌భిస్తాయి.

Share link

Leave a Comment