how to get glowing handsమనలో చాలా మంది ముఖం అందంగా కనిపించాలని ఎక్కువుగా తాపత్రయ పడుతుంటారు. అయితే శరీరంలో భాగమైన చేతులు కూడా చూపరులను ఆకర్షించేలా ఉంటే ఎంతో బాగుంటుంది. దీనికి కొన్ని హోమ్మేడ్ టిప్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తే చేతులు ఎంతో నాజ్జుగా, అందంగా (how to get glowing hands)కనిపిస్తాయి.
– రోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు గ్లిజరిన్, రోజ్‌వాటర్ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి. ఇలా చేస్తే చేతులు ఎంతో మృదువుగా ఉంటాయి.
– దళసరిగా ఉండే చేతులకు పెట్రోలియం జెల్లీని కార్బోలిక్ యాసిడ్‌తో కలిపి రోజూ రాసుకోవాలి.
-చిన్న గ్లిజరిన్ బాటిల్ తీసుకుని అందులోని గ్లిజరిన్‌ని గుడ్డులోని తెల్లసొనతో కలపాలి. గ్లిజరిన్ ఎంతుందో అంతే పాళ్లళ్లో తేనె అందులో వేయాలి. ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి.
-గుడ్డులోని పచ్చసొనను ఒక గిన్నెలో పోసి అందులో బాదంపొడి వేసి బాగా కలపాలి. దానికి కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసానని కూడా జోడించాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి చేతులకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే చేతులు ఎంతో అందంగా, మృదువుగా తయారవుతాయి.
-చేతి కండరాలకు రిలీఫ్ ఇవ్వాలంటే 20 నిమిషాల పాటు వాటిని గోరువెచ్చని నీటిలో ఉంచాలి. ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ బ్లాక్ క్రీమ్‌ని వాడాలి.
-చేతి వేళ్లు అందంగా కనిపించాలంటే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేయాలి. అలా కాకుండా వాటిని పెంచితే గోళ్లల్లో మట్టి దూరి చూడటానికి అసహ్యంగా ఉంటాయి.
-వయసు పెరిగే కొద్దీ చేతుల జాయింట్లు వాస్తుంటాయి. దీంతో చేతులు చూడటానికి బాగుండవు. అవి వాచినట్టు ఉండకుండా ఉండేందుకు నిత్యం చేతులతో ఎక్సర్సైజులు చేయాలి.


-అరచేతులను ఒక దానిపై ఒకటి వేసి రుద్దినట్టు చేయాలి. ఈ ఎక్సర్‌సైజును రోజుకు కనీసం ఐదు నిమిషాలు చేయాలి. అలాగే చేతి వేళ్లను ఒకదాని తర్వాత మరొకటి కొద్దిగా లాగినట్టు చేయాలి. ఇలా చేస్తే అవి చిటుకు చిటుకు అంటాయి. ఇలా చేయడం వల్ల చేతులకు ఎంతో రాలక్సింగ్గా ఉంటుంది.
-చేతులు అందంగా కనిపించాలంటే మరొక కిటుకు కూడా ఉంది. కొన్ని పచ్చిపాలు తీసుకుని దానికి నిమ్మరసం, తేనె జోడించి చిక్కగా పేస్టులా చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చేతులకు రాసుకోవాలి. ఇలా చేస్తే చేతులు ఎంతో అందంగా ఉంటాయి.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?