Fast for a day: పండుగల కాలం వచ్చేసింది. ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మికత జీవితం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇంటి ఇల్లాలు తన కుటుంబం కోసం, భవిష్యత్తులో మంచి జరిగేందుకు దేవుళ్లకు ఒక్క రోజు ఉపవాసం(Fast for a day) చేపడుతుంటారు. అలా తెల్లవారు జామున లేచి పూజా దీక్షలో నిమగ్నమవుతుంటారు. చన్నీటి స్నానాలు చేస్తుంటారు. పూజా గదిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం చేపడుతుంటారు. అయితే ఉపవాసం తీసుకునే సమయంలో కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకుని తగు సూచలను పాటిస్తే అటు ఆరోగ్యం.. ఇటు ఆధ్యాత్మికత జీవితం బాగుంటుందని పెద్దలు చెబుతున్నారు.

మహిళలకు ఇంట్లో పనులు తప్పనిసరి కదా! సాధ్యమైనంత వరకూ ఆ రోజు పని భారం లేకుండా చూసుకోవాలి. ఎండలో వెళ్లడం, బరువు పనులు చేయడం సరికాదు. కొన్ని చిన్న చిన్న విధులు చక్కబెట్టడం వరకూ పర్వాలేదు కానీ బోలెడన్నీ పనులు చేసుకునేందుకు ఉద్యుక్తం కాకపోవడం మంచిది.
నెలసరి అయిపోయిన వారంలోపు కూడా ఉండకపోవడం మంచిది. రక్తస్రావం వల్ల కాస్త నిస్సుత్తువుగా ఉంటారు. శరీరంలో కూడా కొన్ని పోషకాలూ, మినర్స్నూ కోల్పోతుంది. ఈ సమయంలో ఉపవాసం ఉండకపోవడం మంచిది. ఒక వేళ ఉన్నా అరటిపండు, యాపిల్, పుచ్చకాయ ముక్కలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోస తినడం వల్ల శరీరానికి కావాల్సినంత నీరు అందుతుంది.
ఉపవాసం ఉండేవారిలో కొందరు టీ, కాఫీలకు ప్రాధాన్యమిస్తుంటారు. వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా మంచి నీళ్లు తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లూ, ఏమైనా పండ్ల రసాలు స్వీకరిస్తే మేలు. ఇవన్నీ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి తక్షణ శక్తినిందిస్తాయి.

జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఇలా చేయడం వల్ల ఆడవారిలో తలెత్తే మూత్ర సంబంధిత సమస్యలూ అదుపులోకి వస్తాయి. చాలా మంది మహిళలు తినాలనే ధ్యాస దృష్టి మరల్చుకునేందుకు ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. అలా కాకుండా కాసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మంద్రమైన సంగీతం వింటూ ధ్యానం చేయడం మంచింది.
మర్నాడు ఆకలి ఉంది కదాని అతిగా తినేయకూడదు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అన్నం కూరలతో పాటూ, సగ్గు బియ్యం జావ, పండ్ల ముక్కలు తీసుకోవాలి. వేపుళ్లూ, ఘాటైన మసాలా జోలికి వెళ్లకూడదు.
ఉపవాసం వల్ల లాభం ఏమిటి?
ముందుగా మనిషిలో మంచి పెరుగుతుంది. చెడు తగ్గుతోంది. ఆయుర్ధాయం పెరుగుతుంది. ఒంట్లో ఇన్సులిన్‌ను గ్రహించే స్వభావం మెరుగవుతోంది. రక్తంలో గ్లూకోజు నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది. ఒత్తిడిని, వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగువుతుంది.

వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరటం ఉండదు. ఆకలిపై నియంత్రణ మెరుగువుతుంది. అధిక రక్తపోటు (హైబీపీ) వెనుకంజ వేస్తోంది. పెద్ద పెద్ద వ్యాధులకు మూలమైన వాపు స్వభావం తగ్గుతోంది. ఒంట్లో పెరుగుతున్న కొవ్వు కరగడం మొదలవుతుంది.
ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తున్నాయి. కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పూ తగ్గుతోంది. రుమటాయిడ్ ఆర్థ్రెటిస్ వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్టు స్పష్టంగా గుర్తించారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి