cervical spondylosis

how to cure cervical spondylosis permanently

Ayurvedam Topics

cervical spondylosis : కంప్యూట‌ర్ మౌస్‌ని ప‌ట్టుకోనీయ‌దు. కూర‌గాయ‌లూ కొయ్య‌నివ్వ‌దు. ఏ ప‌నీ చెయ్య‌నివ్వ‌దు. మెడ నుంచి కాలు వ‌ర‌కూ ఒక‌టే నొప్పి. ఇటీవ‌ల చాలా మంది నుంచి వ‌స్తోన్న కంప్లెయింట్ ఇది. అస‌లేమిటీ స‌మ‌స్య‌. ఎందుకు వ‌స్తుంది? ప‌రిష్కార‌మే లేదా?

వ‌య‌సు పెరిగేకొద్దీ మెడ‌లోని వెన్నుపూస‌ల జాయింట్లు ఒత్తిడికి లోనై అరిగిపోయిన‌ప్పుడు వ‌చ్చే స్థితినే స‌ర్వైక‌ల్ స్పాండిలోసిస్ Cervical Spondylosis, లేదా స్పాండిలైటిస్ అంటారు. ఆస్టియో ఆర్ధ్ర‌యిటిస్‌లో ఇదీ భాగ‌మే. 40 దాటిన‌వారిలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. మెడ న‌రాలు నొక్కుకుని వ‌చ్చే స‌ర్వైక‌ల్ రెడిక్యూలోప‌తిలో చెయ్యిలాగ‌డం, తిమ్మిర్లు, వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. మెడ‌, వెన్నుముక‌ లోని ఎముక‌ల మీద పెరిగిన పిల‌క‌ల వ‌ల్ల వెన్నుపూస ప్ర‌యాణించే మార్గం ఇరుకుగా త‌యారై వ‌చ్చే సర్వైక‌ల్ మైలోప‌తిలో చేతులు ప‌ట్టుత‌ప్ప‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

Cervical Spondylosis: ల‌క్ష‌ణాలు

మెడ‌నొప్పి, మెడబిగుసుక‌పోవ‌డం, భుజాల్లోనూ చేతుల్లోనూ ఛాతీలోనూ నొప్పి (Pain), చేతులు, పాదాలు, కాళ్ళ‌లో సూదులు గుచ్చుకుంటున్న‌ట్టూ తిమ్మిర్లూ ఉండ‌టం ఉంటుంది. స‌మ‌తూకంగా న‌డ‌వ‌లేక‌ పోవ‌డం, మూత్ర విస‌ర్జ‌న మ‌ల‌విస‌ర్జ‌న మీదా నియంత్ర‌ణ కోల్పోవ‌డం కూడా జ‌రుగుతుంటుంది.

కార‌ణాలు

వ‌య‌సుతోపాటే పెరిగే వినియ‌మం, అరుగుద‌ల‌కే దీనికి ప్ర‌ధాన కార‌ణాలు. ఇందులో వెన్నుపూస‌ల మ‌ధ్య ఉండే మెత్త‌ని కుష‌న్‌లాంటి డిస్కులు మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా త‌యారైనా, డిస్కుల మ‌ధ్య‌భాగంలోని జిగురువంటి ప‌దార్థం వెన్నుపూస‌ల మ‌ధ్య నుంచి వెలుప‌లికి వ‌చ్చినా, మెడ ఎముక‌ల‌ను, కండ‌రాల‌ను క‌లిపి ఉంచే లిగ‌మెంట్లు గ‌ట్టిప‌డి బిరుసుగా, త‌యారైన క‌ద‌లిక‌ల‌ను కుదించివేస్తాయి. మెడ‌మీద దెబ్బ త‌గ‌ల‌డం, బ‌రువుల‌ను లేప‌డం వంటివి చేస్తే ఈ మార్పులు మ‌రింత వేగంగా వ‌స్తాయి.

త‌ల‌ను సాధార‌ణ‌స్థితిలో కాకుండా బాగా ముందుకు చాచ‌డం, భుజాల‌ను పైకెత్తి ముందుకు వంచ‌డం, ఛాతీని ముడుచుకోవ‌డం, క‌టిప్ర‌దేశాన్నీ తుంటినీ వెన‌క్కి వంచ‌డం, మోకా ళ్ళ‌నూ మోచేతుల‌నూ వంచి నిల‌బ‌డ‌టం వంటి అస‌హ‌జ శారీర‌క భంగిమ‌ల‌వ‌ల్లా స‌ర్వైక‌ల్ స్పాండి లోసిస్ వ‌స్తుంది. ప‌నితీవ్ర‌త వ‌ల్ల మెడ‌భాగం ఒత్తిడికి గురైనా వ‌స్తుంది. పొట్టి మెడ‌, మొండెం ఎక్కువ పొడ‌వుండ‌టం కూడా కార‌ణాలే.

ప‌నిచేసేట‌ప్పుడూ చ‌దివేట‌ప్పుడూ టెలీఫోన్‌లో మాట్లాడేట‌ప్పుడూ TV, చూసేట‌ప్పుడూ మెడ‌ను సాగ‌దీసినా ప‌క్క‌కు వంచినా మ‌రీ ఎత్తు దిండునుగానీ మ‌రీ ప‌ల్చ‌ని దిండును గానీ వాడిన లేదా గ‌డ్డం కింద చేతిని ఉంచ‌కొని థింక‌ర్ భంగిమ‌ల ఎక్కువ‌సేపు గ‌డిపినా త‌ల‌ను ఎత్తిచేసే ప‌నులు ఎక్కువ సేపు చేసినా స‌ర్వైక‌ల్ స్పాండిలోసిస్ రావ‌చ్చు.

cervical spondylosis
వెన్న‌పూస‌ నొప్పి

ఉప‌శ‌మ‌నం కోసం..

అభ్యంగ‌చికిత్స‌: మ‌హావిష‌గ‌ర్భ‌తైలం వంటి తైలాల‌ను వేడిచేసి మెడ‌మీద మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల బిరుసెక్కిన డిస్కులు మృదువుగా మార‌తాయి. మ‌సాజ్ వ‌ల్ల కండ‌రాల్లోనూ లిగ‌మెంట్ల లోనూ స్త‌బ్ద‌త వీడి ఉప‌శ‌మ‌నం ఉంటుంది.

గ్రీవావ‌స్తి: మెడ‌మీద మిన‌ప్పిండితో గుండ్ర‌ని గోడ‌లా మెత్తి అందులో వేడిచేసిన ఔష‌ధ‌తైలాన్ని ఉంచ‌డం వ‌ల్ల అద్భుత ఫ‌లితం క‌నిపిస్తుంది.

కాప‌డం: వేడినీళ్ళ‌ను మెడ‌మీద ధార‌గా పోయ‌డం, వేడినీళ్ల ష‌వ‌ర్ స్నానం, వేడి ఇసుక‌ను మూట‌గా క‌ట్టి మెడ‌మీద కాప‌డం పెట్ట‌డం వంటివీ ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి.

స‌ర్వైక‌ల్ కాల‌ర్‌: కొన్ని రోజుల పాటు దీన్ని ధ‌రించ‌డం వ‌ల్ల మెడ కండ‌రాల‌కు ఆస‌రా ఉంటుంది. దీన్ని మ‌రీ రోజుల త‌ర‌బ‌డి వాడ‌టం మంచిది కాదు.

వ్యాయామం: మెడ‌ను, భుజాల‌ను బ‌లంగా త‌యారుచేసే వ్యాయామాల‌ను చేసినా కాసేపు న‌డిచినా త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. మెడ‌మీద stress క‌లిగించే ప‌నులు త‌గ్గించుకుని విశ్రాంతి తీసుకుంటూ తేలిక‌పాటి యోగా చేయ‌డం వ‌ల్ల కొంత ఫ‌లితం క‌నిపిస్తుంది.

గృహ‌వైద్యంలో..

పొట్టు ఒలిచిన వెల్లుల్లి గ‌ర్భాల‌ను 10 గ్రాములు తీసుకుని ముద్ద‌గా నూరి అర‌గ్లాసు పాల‌కు క‌లిపి చిక్క‌బ‌డేవ‌ర‌కూ మ‌రిగించి తీసుకోవాలి. అర‌క‌ప్పు శొంఠి క‌షాయానికి రెండు టీస్పూన్ల ఆముదం క‌లిపి రోజూ రాత్రిపూట తీసుకుంటే కొద్దిరోజుల్లో త‌గ్గుతుంది. ఐదువంతుల వేప‌నూనె Neem oil,లో ఓ వంతు సల్ఫ‌ర్ క‌లిపి వేడిచేసి మెడ‌మీద మ‌ర్ధ‌నా చేయాలి. కొబ్బ‌రి లేదా నువ్వుల నూనెలోగానీ క‌ర్పూరం క‌లిపి మెడ‌మీద మృదువుగా మ‌ర్ధ‌న చేయాలి.

Cervical Spondylosis: ఆయుర్వేదంలో..

యోగ‌రాజ‌గుగ్గులు లేదా సింహ‌నాద‌గుగ్గులు మాత్ర‌లు రోజుకు 3 సార్లు 2 మాత్ర‌ల చొప్పున వేడి నీళ్ళ‌తో వాడాలి. త్రిఫ‌ల గుగ్గులు పూట‌కు ఒక మాత్ర చొప్పున 3 పూట‌లా వేడినీళ్ల‌తో తీసు కోవాలి. ల‌క్షాది గుగ్గులు ఒక‌టి లేదా రెండు మాత్ర‌లు రోజూ రెండుమూడుసార్లు తీసుకోవాలి. గోదంతి మిశ్ర‌ణం 1-2 మాత్ర‌ల చొప్పున రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. ద‌శ‌మూల‌క్వాధ చూర్ణంతో క‌షాయం త‌యారుచేసి పూట‌కు 15 మిల్లీలీట‌ర్ల చొప్పున మూడుపూట‌లా తీసుకోవాలి.

స‌ప్త‌గుణ తైలం/ మ‌హానారాయ‌ణ‌తైలం/ క్షీక‌బ‌లాతైలాన్ని నొప్పి ఉన్న భాగంలో మృదువుగా మ‌ర్ధ‌నా చేయాలి. గృహ‌చికిత్స‌లు, ఉప‌శ‌మ‌న ప‌ద్ధ‌తుల వ‌ల్ల మెడ‌నొప్పి (Neck pain) త‌గ్గ‌కుండా క్ర‌మంగా నొప్పి తీవ్ర‌మైన తిమ్మిర్లు కాళ్ళూ చేతుల్లోకి ప్ర‌స‌రించినా వెంట‌నే వైద్యుని సంప్ర‌దించాలి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *