how to buy shares online షేర్స్‌ని మనం రెండు మార్గాల్లో కొనవచ్చు. మొదటి మార్గం ప్రైమరీ మార్కెట్, రెండవది సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్లో మీరు షేర్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడే కొనడానికి(how to buy shares online) అవకాశం ఉంటుంది.
ప్రైమరీ మార్కెట్ – IPO(Initial Public Offerings, IPO’S) ప్రజలకు తొలిసారిగా షేర్లు అమ్మడాన్ని IPO’S అంటారు. ఇది ప్రైమరీ మార్కెట్ లో జరుగుతుంది. ఎవరైనా ఈ తొలి వాటాలను కొనుగోలు చేయాలి అంటే ఈ IPO’S ద్వారా కంపెనీ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయాలి. మన దరఖాస్తును పరిశీలించిన అనంతరం వారికి వాటాలను కేటాయించడం జరుగుతుంది. వాటాల కేటాయింపు అనంతరం కంపెనీని స్టాక్ ఎక్సేంజ్‌లో నమోదు చేయడం జరుగుతుంది. ప్రైమరీ మార్కెట్లో మీరు షేర్స్ కొనడానికి సిద్ధపడినా మనకు కచ్చితంగా షేర్లు వస్తాయని, కావాల్సినన్ని దక్కుతాయని హామీ లేదు. ఎందుకంటే వారు జారీ చేసే వాటాలకంటే ఎక్కువ మంది ఉంటే వాటిని దరఖాస్తు చేసిన అందరికి ఒక నిష్పత్తిలో జారీ చేస్తారు. వాటాల జారీ అనంతరం ఇవి స్టాక్ ఎక్సేంజ్ నందు లిస్టు అవుతాయి పైగా పరిమిత కాలానికే ఈ మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ప్రతి పబ్లిక్ ఇష్యూలోనూ 25 శాతం వాటాలను చిన్న వాటాదారులకు కేటాయిస్తారు. రెండు లక్షల రూపాయలకంటే తక్కువ విలువైన షేర్లకు దరఖాస్తు చేసుకునే వారిని చిన్న ఇన్వెస్టర్లుగా పరిగణిస్తారు. ప్రైమరీ మార్కెట్ నందు మీకు రిస్కు తక్కువుగా ఉంటుంది.

ఒక కంపెనీ ప్రైమరీ మార్కెట్లో వాటాదారులకు ఏ ధరకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటుందో దానిని ఇష్యూ ప్రైస్ అని పిలుస్తారు. ఈ కంపెనీ షేర్ స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్టు అయినప్పుడు ఆ ప్రైస్ కంటే ఎక్కువుగాను, తక్కువుగాను ఉండవచ్చు. ఎక్కువుగా ఉంటే మీకు లాభం, తక్కువుగా ఉంటే మీకు నష్టం రాగలదు. ఈ మధ్యన ఐపిఓ వచ్చిన కోల్ ఇండియా తీసుకుంటే దాని ఇష్యూ ప్రైస్ రూ.245 ఐతే అది లిస్టు అయిన రోజు క్లోజ్ ప్రైస్ రూ.342 అనగా మీకు సుమారు 39% లాభం ఇక మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
రిలయన్స్ పవర్ షేర్ల గురించి దాని ఇష్యూ ప్రైస్ రూ.450 అయితే అది లిస్టు అయిన రోజు క్లోస్ ప్రైస్ రూ.372.50 అనగా ఈ షేర్ మీద మీకు నష్టం 17%. మీరు లిస్టు అయిన రోజు హైప్రైస్ లేదా లోప్రైస్ నందు ఎవ్వరు అమ్మలేరు. కావున క్లోజ్ ప్రైస్ తీసుకోవడం జరిగినది. ఇక్కడ మీరు గమనించడం జరిగినది ఏమిటంటే అన్ని IPO లు కూడా లాభ సాటి కావు. కావున మీరు IPOకు అప్లై చేసేముందు కంపెనీ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. దీని గురించి మనం తర్వాత వివరంగా తెలుసుకుందాం.

ఇష్యూ ప్రైస్ – ఇష్యూప్రైస్ ను కంపెనీ మరియు వారి బ్యాంకర్ కలిపి రెండు రకాలుగా నిర్ణయం తీసుకుంటారు. ఒక్కటి ఫిక్స్డ్ ప్రైస్, రెండవది ప్రైస్ బ్యాండ్ – ఒక వేళ ప్రైస్ బ్యాండ్ – 100 – 120కి నిర్ణయిస్తే ఏ ప్రైస్ కి ఎక్కువుగా అప్లై చేస్తారో దానిని బట్టి ఇష్యూ ప్రైస్ నిర్ణయం తీసుకుంటారు. సెబి మార్గదర్శకాల ప్రకారం, జారీ ప్రక్రియను ఇష్యూ ముగింపు తేదీ నుండి 15 రోజులలో పూర్తి చేయాలి. ఒక వేళ మీకు ఎలాంటి వాటా జారీ కాని పక్షంలో మీ డబ్బు తిరిగి మీకు వాపసు అందుతుంది.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి