Palakova: కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లెలో పాలకోవకు ఓ ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన తడకనపల్లె పాలకోవా(Palakova) కోసం జనం ఉవ్విళ్లూరుతుంటారు. గ్రామంలో పాడి పరిశ్రమ ఎక్కువుగా ఉండటంతో సగం మందికిపైగా ఈ పాలకోవా తయారీ మీద ఆధారపడి జీవిస్తున్నారు.
గ్రామంలో గేదెల హాస్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొదు సంఘాల ఆధ్వర్యంలో ఈ హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. హాస్టల్ లో ఉండే గేదెల నుంచి పాలనను తీసుకొని గ్రామంలో స్వచ్ఛమైన పాలకోవా తయారు చేస్తున్నారు. ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలు చక్కెరతో ఇక్కడ పాలకోవా తయారు అవుతుంది.
ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇక మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుందని తయారీదారులు అంటున్నారు. చక్కెరతోనే కాదు ఇక్కడ బెల్లంతో కూడా పాలకోవను తయారు చేస్తున్నారు. తడకనపల్లె పాలకోవాను కర్నూలు జిల్లా చుట్టుపక్క గ్రామాలకే కాకుండా బెంగుళూరు, ఢిల్లీ, విజయవాడ తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఒక్కసారి పాలకోవా టేస్ట్ చేసిన వారు కచ్చితంగా ఇక్కడకు వచ్చి ఈ పాలకోవాను కొనుగోలు చేస్తుంటారు. తడకనపల్లె పాలకోవాను గత 100 సంవత్సరాల నుండి ఇక్కడ తయారు చేస్తున్నామంటున్నారు మేకర్స్. తమ కుటుంబంలో మూడు తరాల నుండి ఈ పాలకోవాను తయారు చేస్తున్నామని తమకు ఇదే ప్రధాన మైన వృత్తి అని కూడా తయారీ దారులు అంటున్నారు. ఇదే వృత్తిపై ఊరు ఆధారపడి ఉంది కాబట్టి కొన్ని బ్యాంకులు మాకు కోవా తయారీ మిషన్ యూనిట్స్ కోసం రుణాలు మంజూరు చేస్తున్నారని వారు తెలిపారు.


జుబేదాబీ – పాలకోవా మేకర్
”మా దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి కోవా చేయడం జరుగుతా ఉంది. మా నాయనా ఉన్నప్పటి నుంచి మా ఒక్క కుటుంబమే చేసేది ఫస్టు మా అన్న వాళ్లు మా అక్కవాళ్లు మేమూ తరువాత కొంత మందికి విజయ్‌మోహన్ కలెక్టర్ సార్ ఉన్నప్పుడు మా గ్రూపులో ఉన్నవాళ్లకి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కోవాకు వేరే కోవాకు తేడా ఏంటంటే సార్ మాది ఈ ప్యూర్ పాలతో చేస్తాం సార్. పాలు చక్కెర మాత్రమే వేసి చేస్తాం. అది మా ఊరికి ఒక ప్రత్యేకంగా మా కోవా అంటేనే ఫేమస్ అయిపోయింది సార్.”
ఖుద్దూష్ – పాలకోవా మేకర్
”అన్నా మేము కోవా తయారు చేసి కర్నూలు , డోను, గుత్తి ఈ ప్రాంతాలకు పంపిస్తాం అన్నా. పాలు మేము సొంతంగా పిండుకొచ్చుకుంటాము అంటే వేరే కోవాకు మా కోవాకు తేడా ఏమిటంటే పాలు మేము చిక్కగా
తెచ్చుకుంటాం అన్న. అంటే కల్తీ లేని పాలు అన్నమాట మేమే పోయి పిండుకొచ్చుకుంటము అదే పాలతో చెక్కరా మామూలుగా దానికి తగినంత చేసి కోవా చేస్తాము. నాణ్యత మాత్రం నాణ్యత లో రాజీ పడే విషయం లేదన్న నాణ్యత ఎప్పుడూ బాగుంటది క్వాలిటీ బాగుంటదని చెప్పేసి మన దగ్గర ఎక్కువుగా వస్తారన్నా. ఈ కోవా తయారు చేయాలి అంటే మా తాతల కాలం నుంచే చేస్తున్నాము. మా అమ్మ చేసింది . ఇప్పడు నేను కూడా అదే వ్యాపారంలో ఉన్నా.”
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!